అన్వేషించండి

Meizu 21: 200 మెగాపిక్సెల్ కెమెరా, లేటెస్ట్ ప్రాసెసర్‌తో గేమింగ్ ఫోన్ - ధర ఎంతంటే?

Meizu New Phone: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మెయిజు తన కొత్త స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ చేసింది. అదే మెయిజు 21.

Meizu 21 Price: మెయిజు 21 స్మార్ట్ ఫోన్‌ను చైనాలో అధికారికంగా లాంచ్ చేశారు. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను అందించారు. 12 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్‌గా ఉంది. నాలుగు వేర్వేరు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఐపీ54 రేటెడ్ బిల్ట్, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్‌గా ఉంది.

మెయిజు 21 ధర (Meizu 21 Price)
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,399 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.39,000) ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 3,699 యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.43,000), 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 3,999 యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.45,000) నిర్ణయించారు. మెయిజు వైట్, రుయి గ్రీన్, స్మార్ట్ పర్పుల్, అన్‌బౌన్స్‌డ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

మెయిజు 21 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Meizu 21 Specifications, Features)
మెయిజు 21 స్మార్ట్ ఫోన్‌లో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 1100 నిట్స్‌గా ఉంది. సూపర్ ఎంటచ్ డిస్‌ప్లే 0.075 సెకన్ల రెస్పాన్స్ రేట్‌ను అందించనుంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, అడ్రెనో 750 జీపీయూ కూడా ఈ ప్రాసెసర్‌కు పెయిర్ అయి ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించారు. దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు. 512 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఈ ఫోన్‌లో ఉంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే... వైఫై, నావిక్, బ్లూటూత్ వీ5.4, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, జీపీఎస్, ఏ-జీపీఎస్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, గైరోస్కోప్, డిస్టెన్స్ సెన్సార్, లైట్ సెన్సార్, ఈ-కంపాస్, ఐఆర్ రిమోట్ కంట్రోల్, లీనియర్ మోటార్లు కూడా అందించారు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్ కాగా, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 198 గ్రాములుగా ఉంది.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP Mahanadu:నెల్లూరు నుంచి మంగళగిరికి మహానాడు షిఫ్ట్‌... బాబు ప్లాన్ రివర్స్‌? టీడీపీలో వర్గపోరుకు చెక్ పడేనా!
నెల్లూరు నుంచి మంగళగిరికి మహానాడు షిఫ్ట్‌... బాబు ప్లాన్ రివర్స్‌? టీడీపీలో వర్గపోరుకు చెక్ పడేనా!
Machilipatnam Lecturer Joshua Arrested: మాయాటలతో యువతికి కామర్స్ లెక్చరర్ వల! గుట్టురట్టు చేసిన భార్య! రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు అప్పగింత!
మాయాటలతో యువతికి కామర్స్ లెక్చరర్ వల! గుట్టురట్టు చేసిన భార్య! రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు అప్పగింత!
Nowhera Shaik Arrested: నౌహీరా షేక్ అరెస్ట్.. ఫేక్ ఐడీతో దొరికిన హీరా గ్రూప్ ఎండీ
ఖురాన్ టీచర్ నుంచి కుబేరురాలి వరకు... హీరా గోల్డ్ కుంభకోణంలో అరెస్టైన నౌహీరా షేక్‌ బ్యాక్‌గ్రౌండ్!
Heatwave in Andhra Pradesh and Telangana:తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!

వీడియోలు

MI vs KKR IPL 2026 Highlights | ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ఊచకోత
KKR Bowlers Destroy MI Batting IPL 2026 | ముంబైకు చుక్కలు చూపించిన నరైన్, గ్రీన్
Sanju Samson vs Heinrich Klaasen | క్లాసెన్‌తో గొడవకు ఎండ్ కార్డ్ వేసిన సంజూ
Virat Kohli Comments On Captaincy Stress | ద్రవిడ్ చేసిన సాయంపై కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
Hardik Pandya Shocking Comments IPL 2026 | కేకేఆర్ చేతిలో ఓటమిపై హార్దిక్ పాండ్యా అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Mahanadu:నెల్లూరు నుంచి మంగళగిరికి మహానాడు షిఫ్ట్‌... బాబు ప్లాన్ రివర్స్‌? టీడీపీలో వర్గపోరుకు చెక్ పడేనా!
నెల్లూరు నుంచి మంగళగిరికి మహానాడు షిఫ్ట్‌... బాబు ప్లాన్ రివర్స్‌? టీడీపీలో వర్గపోరుకు చెక్ పడేనా!
Machilipatnam Lecturer Joshua Arrested: మాయాటలతో యువతికి కామర్స్ లెక్చరర్ వల! గుట్టురట్టు చేసిన భార్య! రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు అప్పగింత!
మాయాటలతో యువతికి కామర్స్ లెక్చరర్ వల! గుట్టురట్టు చేసిన భార్య! రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు అప్పగింత!
Nowhera Shaik Arrested: నౌహీరా షేక్ అరెస్ట్.. ఫేక్ ఐడీతో దొరికిన హీరా గ్రూప్ ఎండీ
ఖురాన్ టీచర్ నుంచి కుబేరురాలి వరకు... హీరా గోల్డ్ కుంభకోణంలో అరెస్టైన నౌహీరా షేక్‌ బ్యాక్‌గ్రౌండ్!
Heatwave in Andhra Pradesh and Telangana:తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
Cockroach Janta Party: జనతా పార్టీ గురించి చర్చ సందర్భంగా సెర్చింగ్‌లో 'బొద్దింక' ! దాని సంస్కృత నామం ఏంటో తెలుసా? డైనోసార్ కన్నా ముందే ఉనికిలో ఉన్నాయా?
జనతా పార్టీ గురించి చర్చ సందర్భంగా సెర్చింగ్‌లో 'బొద్దింక' ! దాని సంస్కృత నామం ఏంటో తెలుసా? డైనోసార్ కన్నా ముందే ఉనికిలో ఉన్నాయా?
Transfer Trimurthulu Teaser : కానిస్టేబుల్ త్రిమూర్తులు వెరీ స్ట్రిక్ట్ - పదేళ్ల తర్వాత హీరోగా వడ్డే నవీన్ రీఎంట్రీ
కానిస్టేబుల్ త్రిమూర్తులు వెరీ స్ట్రిక్ట్ - పదేళ్ల తర్వాత హీరోగా వడ్డే నవీన్ రీఎంట్రీ
IPL 2026 GT VS CSK Result Update: చెన్నై ఇంటికి.. జీటీ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. రాణించిన సుద‌ర్శ‌న్, గిల్, సిరాజ్, రాబ‌డ‌
చెన్నై ఇంటికి.. జీటీ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. రాణించిన సుద‌ర్శ‌న్, గిల్, సిరాజ్, రాబ‌డ‌
Hardik Pandya Fined: MI కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జరిమానా - KKR మ్యాచ్ లో ప్రవర్తనపై సీరియస్ యాక్షన్
MI కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జరిమానా - KKR మ్యాచ్ లో ప్రవర్తనపై సీరియస్ యాక్షన్
Embed widget