అన్వేషించండి

Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు

Mahindra XUV 3XO CNG రియల్ వరల్డ్ టెస్ట్‌లో సిటీలో 16.75km/kg, హైవేపై 22.29km/kg మైలేజీ ఇచ్చింది. పెట్రోల్ మైలేజీ, ధర, రేంజ్ వివరాలు తెలుసుకోండి.

Mahindra XUV 3XO CNG Mileage: మహీంద్రా XUV 3XO CNG SUV కొనాలనుకునేవారికి కీలక అప్‌డేట్‌. ఈ బండి మైలేజీ గురించి ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఫ్యాక్టరీ నుంచే అమర్చిన CNG కిట్‌తో వస్తున్న ఈ SUV నిజ జీవిత డ్రైవింగ్ పరిస్థితుల్లో ఎంత మైలేజీ ఇస్తుందో తెలుసుకోవడానికి ఎక్స్‌పర్ట్‌లు దీనిని పరీక్షించారు. ఈ టెస్ట్‌లో సిటీ ప్రయాణానికి, హైవే డ్రైవింగ్‌కు మధ్య స్పష్టమైన తేడా కనిపించింది. పెట్రోల్‌తో పోలిస్తే CNGలో ఎంత దూరం ప్రయాణించవచ్చో కూడా ఈ పరీక్ష ద్వారా అంచనా వేయవచ్చు.

మహీంద్రా XUV 3XO CNG ధరలు ఎక్స్‌షోరూమ్ ప్రకారం రూ.9.99 లక్షల నుంచి రూ.12.27 లక్షల వరకు ఉన్నాయి. మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్లతో పోలిస్తే సుమారు రూ.1 లక్ష నుంచి రూ.1.2 లక్షల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. KUV100 CNGను మినహాయిస్తే, ప్రైవేట్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని మహీంద్రా అందిస్తున్న తొలి CNG వాహనంగా XUV 3XO నిలుస్తుంది.

రియల్ వరల్డ్ టెస్ట్‌లో ఎంత మైలేజీ ఇచ్చింది?

ఎక్స్‌పర్ట్‌లు నిర్వహించిన నిజ జీవిత పరీక్షలో XUV 3XO CNG సిటీలో కిలోగ్రామ్ CNGకి 16.75km మైలేజీ ఇచ్చింది. హైవేపై 22.29km/kg నమోదు చేసింది. ఈ రెండు పరిస్థితులను కలిపి లెక్కిస్తే సగటు మైలేజీ 19.52km/kgగా ఉంది.

కంపెనీ ప్రకటించిన ARAI మైలేజీ 24.7km/kg. హైవేపై వచ్చిన 22.29km/kg మైలేజీ ఈ గణాంకానికి దగ్గరగా ఉంది. అయితే అందరికీ ఇదే మైలేజీ రాకపోవచ్చు. డ్రైవింగ్ స్టైల్‌, ట్రాఫిక్, రోడ్డు పరిస్థితులు, వాహనంలో ఉన్న బరువు వంటి అంశాలపై ఆధారపడి మైలేజీ మారుతుంది.

ఇది కూడా చదవండి: మూడున్నర లక్షల అమ్మకాలు దాటిన Tata Altroz.. ధర, మైలేజీ, ఫీచర్లు తెలిస్తే మీకూ కొనాలనిపిస్తుంది!

ఇంజిన్ పనితీరు ఎలా ఉంది?

XUV 3XO CNGలో 1.2-లీటర్ MPFi టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇందులో 10-bar CNG ఇంజెక్షన్ సిస్టమ్ ఉంది. పెట్రోల్, CNG రెండు మోడ్‌లలోనూ 111hp పవర్, 200Nm టార్క్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఈ SUVలో బూట్ ఫ్లోర్ కింద రెండు CNG సిలిండర్లను అమర్చారు. వాటి మొత్తం సామర్థ్యం 60 లీటర్లు. ఈ ట్విన్ సిలిండర్ అమరిక వల్ల బూట్ స్పేస్‌పై ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. సిటీలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో ఆటోమేటిక్ స్టాప్-స్టార్ట్ ఫీచర్ ఉపయోగపడుతుంది. CNG మోడ్‌లోనూ ఈ ఫీచర్ పనిచేస్తుంది. క్లచ్ పెడల్ నొక్కే వరకు ఇంజిన్ ఆఫ్‌లో ఉండే విధంగా ఇది పనిచేస్తుంది.

హైవేపై 100kph వేగంతో ప్రయాణించినప్పుడు ఇంజిన్ సుమారు 2,300rpm వద్ద పనిచేసింది. ఇంజిన్ తక్కువ rpm వద్ద పనిచేయడం కూడా మైలేజీకి అనుకూలంగా ఉంటుంది.

ఫుల్ ట్యాంక్‌తో ఎంత దూరం వెళ్లొచ్చు?

ఖాళీ అయిన CNG ట్యాంక్‌ను తిరిగి నింపినప్పుడు పరీక్షలో 7.94kg గ్యాస్ పట్టింది. పరీక్షలో వచ్చిన 19.52km/kg సగటు మైలేజీని పరిగణనలోకి తీసుకుంటే, CNG ట్యాంక్‌ను పూర్తిగా నింపినప్పుడు సుమారు 150–160km ప్రయాణించవచ్చని ఎక్స్‌పర్ట్‌లు అంచనా వేశారు.

పెట్రోల్ మోడ్‌లో మైలేజీ ఎలా ఉంది?

పెట్రోల్‌తో పరీక్షించినప్పుడు XUV 3XO CNG సిటీలో 9.68kpl, హైవేపై 14.47kpl మైలేజీ ఇచ్చింది. మొత్తం సగటు 12.07kplగా నమోదైంది. ఇందులో 42 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంది. ఈ లెక్కన, పెట్రోల్‌తో వాస్తవ పరిస్థితుల్లో సుమారు 500km రేంజ్ ఆశించవచ్చు.

CNG, పెట్రోల్ రెండింటినీ కలిపి ఉపయోగిస్తే మొత్తం డ్రైవింగ్ రేంజ్ సుమారు 650–660km వరకు ఉండవచ్చని పరీక్ష ఆధారంగా అంచనా వేయవచ్చు. అయితే ఇది డ్రైవింగ్ పరిస్థితులను బట్టి మారుతుంది.

ఇది కూడా చదవండి: టర్బో ఇంజిన్‌ కార్‌ మైలేజీ, పెర్ఫార్మెన్స్‌ బాగుండాలంటే ఈ 7 జాగ్రత్తలు తప్పనిసరి!

మైలేజీ పరీక్ష ఎలా నిర్వహించారు?

CNG ట్యాంకులను ప్రతిసారీ ఒకే స్థాయిలో నింపడం కష్టమైనందున, సాధారణ ట్యాంక్-టు-ట్యాంక్ పద్ధతికి బదులుగా ఎక్స్‌పర్ట్‌లు ప్రత్యేక విధానాన్ని అనుసరించారు. ముందుగా CNG ట్యాంక్‌ను పూర్తిగా ఖాళీ చేసి, తిరిగి 2kg గ్యాస్ నింపారు. అనంతరం సిటీ పరిస్థితుల్లో గ్యాస్ అయిపోయే వరకు వాహనాన్ని నడిపారు. హైవే పరీక్షలోనూ ఇదే విధానాన్ని అనుసరించారు.

టైర్లలో గాలి ఒత్తిడిని తయారీదారు సూచించిన స్థాయిలో ఉంచారు. నవీ ముంబై పరిసరాల్లో నిర్ణీత సిటీ, హైవే మార్గాల్లో టెస్ట్‌ నిర్వహించారు. కారులో ఒకరే ప్రయాణించారు. ACని 22 డిగ్రీల వద్ద ఆటో మోడ్‌లో ఉంచారు. సాధారణ ప్రజలు వినియోగించినట్లుగానే ఆడియో సిస్టమ్, ఇండికేటర్లు, వైపర్లు వంటి ఎలక్ట్రికల్ పరికరాలను ఉపయోగించారు. డ్రైవర్‌ను మార్చడం ద్వారా, డ్రైవింగ్ స్టైల్‌ తేడాల ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు.

మొత్తంగా చూస్తే, నగర ప్రయాణాల్లో CNG మైలేజీ 16.75km/kgగా ఉండగా, హైవేపై 22.29km/kgకు చేరింది. రోజువారీ ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి CNG వెర్షన్‌ ఖర్చులను తగ్గించే అవకాశం ఉంది. అయితే, పెట్రోల్ వేరియంట్‌తో ధర వ్యత్యాసం, తమ రోజువారీ ప్రయాణ దూరం, సమీపంలో CNG స్టేషన్ల లభ్యతను బట్టి కొనుగోలు నిర్ణయం తీసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bike Pillion Seat: తల్లిదండ్రులతో బైక్‌పై ప్రయాణిస్తున్నారా? వెనుక కూర్చునేవారికి సౌకర్యవంతమైన సీట్‌ ఉన్న 5 బైక్స్
తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించడానికి సౌకర్యవంతమైన వెనుక సీట్లు.. భారత్‌లో టాప్ 5 బైక్స్ ఇవే!
Fastest Charging Electric Cars: భారత్‌లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
భారత్‌లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే Electric Vehicles ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
Small Cars: మీ ఇంటి దగ్గర రోడ్డు చాలా ఇరుకా? పార్కింగ్‌కు సరైన స్థలం లేదా? ఈ 8 కార్లు మీకు మంచి ఎంపిక
చిన్న సందులు, ఇరుకైన అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లకు సులభంగా సరిపోయే 8 కార్లు ఇవే!
Car Warranty: డాష్‌క్యామ్ అమరిస్తే కారు వారంటీ రద్దవుతుందా? రూ.లక్షల నష్టం రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!
కారులో డాష్‌క్యామ్ పెట్టించాలనుకుంటున్నారా? మీ కారు వారంటీ పోతుందేమో తెలుసుకోండి!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohit Ulva Heroics: ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Comedy Thriller OTT : ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Vitamins for Hair : జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
Embed widget