అన్వేషించండి

Paying e-challan online: ట్రాఫిక్‌ చలాన్‌ కట్టకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేస్తారా? ఆన్‌లైన్‌లో ఇలా చెక్‌ చేయండి!

మీ వాహనంపై ట్రాఫిక్‌ చలాన్‌ ఉందో లేదో Parivahan పోర్టల్‌లో చెక్‌ చేసి ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఫైన్‌ కట్టకపోతే ఎదురయ్యే పరిణామాలు తెలుసుకోండి.

How to check and pay e-challan online: ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకుండా కారు లేదా టూవీలర్‌ నడిపితే పోలీసులు జరిమానా విధిస్తారు. దీనినే చలాన్‌ అంటారు. ప్రస్తుతం చాలా ట్రాఫిక్‌ ఉల్లంఘనలను ఎలక్ట్రానిక్‌ విధానంలో నమోదు చేస్తున్నారు. అయితే, చలాన్‌ సమాచారం SMS ద్వారా వచ్చినా కొందరు గమనించకపోవచ్చు. ఫోన్‌ నంబర్‌ మారడం లేదా మెసేజ్‌ను డిలీట్‌ చేయడం వల్ల కూడా ఆ సమాచారం మిస్‌ కావచ్చు. మీరు చూడనంత మాత్రాన చలాన్‌ రద్దయినట్లు కాదు. వాహనంపై జరిమానా ఉందో లేదో తెలుసుకోవడానికి, దానిని ఆన్‌లైన్‌లో చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వ Parivahan పోర్టల్‌ ఉపయోగపడుతుంది.

చలాన్‌ చెల్లించనంత మాత్రాన డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెండ్‌ అవుతుందని చెప్పలేం. పదేపదే ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించడం లేదా చట్టబద్ధమైన ఆదేశాలను పాటించకపోవడం వల్ల లైసెన్స్‌కు సంబంధించిన చర్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే, ట్రాఫిక్‌ పోలీసులు సంబంధిత వాహనాన్ని జప్తు కూడా చేయవచ్చు. కానీ, జరిమానా చెల్లించలేదనే ఒకే ఒక్క కారణంతోనే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారని భావించకూడదు.

ఈ-చలాన్‌ అంటే ఏమిటి?

ఈ-చలాన్‌ అనేది ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన డిజిటల్‌ రికార్డు. ట్రాఫిక్‌ పోలీసులు సీసీ కెమెరాలు, ఆటోమేటెడ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వ్యవస్థలు లేదా నేరుగా తనిఖీ చేయడం ద్వారా ఉల్లంఘనలను గుర్తించవచ్చు. కెమెరాల్లో రికార్డయిన ఫొటోలు, వీడియోల ఆధారంగా వాహనాన్ని గుర్తించి, జరిగిన ఉల్లంఘనను నిర్ధారించే అవకాశం ఉంటుంది. అయితే, అన్ని ఉల్లంఘనలూ కెమెరాల ద్వారానే గుర్తించరు. రూల్స్‌ను అతిక్రమించిన వాహనాన్ని ట్రాఫిక్‌ పోలీసులు నేరుగా గుర్తించి కూడా చలాన్‌ జారీ చేయవచ్చు.

వాహనం రిజిస్ట్రేషన్‌ వివరాల ఆధారంగా దాని నంబర్‌, రిజిస్టర్డ్‌ యజమాని వివరాలను గుర్తించి జరిమానా నమోదు చేస్తారు. సాధారణంగా, వాహనానికి అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌కు SMS ద్వారా చలాన్‌ సమాచారం పంపిస్తారు. ఆ సందేశం రాకపోయినా లేదా కనిపించకపోయినా మీ బండిపై చలాన్‌ లేనట్లు కాదు. మీకు తెలీకుండా లేదా వేరే వ్యక్తులు మీ బండిని తీసుకెళ్లి రూల్స్‌ జంప్‌ చేయవచ్చు. కాబట్టి, అప్పుడప్పుడు ఆన్‌లైన్‌లో చలాన్‌ వివరాలను తనిఖీ చేసుకోవడం మంచిది.

ఇది కూడా చదవండి: Maruti Victorisని మరింత ఆకర్షణీయంగా మార్చేద్దామా? ఔరమ్ ఎడిషన్ లాంచ్‌.. ఈ కిట్‌లో ఏమేం ఉన్నాయంటే?

ఆన్‌లైన్‌లో చలాన్‌ ఎలా చెక్‌ చేయాలి?

మీ వాహనంపై పెండింగ్‌ చలాన్‌ ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ విధంగా చేయండి.

1. ముందుగా అధికారిక Parivahan ఈ-చలాన్‌ వెబ్‌సైట్‌ను [https://echallan.parivahan.gov.in/] సందర్శించండి.
2. వెబ్‌సైట్‌లో చలాన్‌ స్టేటస్‌ తనిఖీ చేసే ఆప్షన్‌ను ఎంచుకోండి.
3. అందుబాటులో ఉన్న ఆప్షన్‌ను బట్టి చలాన్‌ నంబర్‌, వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ (DL) నంబర్‌ను నమోదు చేయండి.
4. అడిగిన వివరాలు నమోదు చేసి, వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేయండి.
5. ఆ తర్వాత. మీ వాహనంపై ఏవైనా చలాన్‌లు ఉంటే స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఏ నిబంధన ఉల్లంఘించారు? ఎంత జరిమానా విధించారు? వంటి వివరాలు అక్కడ కనిపిస్తాయి.

‘Challan Not Found’ అనే సందేశం కనిపిస్తే, మీరు నమోదు చేసిన వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసి మళ్లీ ప్రయత్నించండి. అప్పుడు కూడా ఇదే సందేశం కనిపిస్తేనే ఎలాంటి చలాన్‌ లేదని నిర్ధారించుకోవాలి.

ఇది కూడా చదవండి: ఇప్పుడు టూవీలర్లలోనూ లగ్జరీ కార్లకు పోటీగా స్మార్ట్‌ ఫీచర్లు.. ఇలాంటివి ఉన్నట్లు మీకు తెలుసా?

ఈ-చలాన్‌ ఫైన్‌ ఎలా చెల్లించాలి?

చలాన్‌ వివరాలు కనిపించిన తర్వాత జరిమానా చెల్లించాలి.

1. అధికారిక ఈ-చలాన్‌ పోర్టల్‌లో చెల్లింపు ప్రక్రియను ప్రారంభించండి.
2. చలాన్‌ నంబర్‌, వాహన రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదా DL నంబర్‌ను నమోదు చేయండి.
3. క్యాప్చా వెరిఫికేషన్‌ పూర్తి చేసి ‘Get Detail’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
4. స్క్రీన్‌పై కనిపించే ఉల్లంఘన వివరాలు, జరిమానా మొత్తాన్ని జాగ్రత్తగా పరిశీలించండి.
5. చెల్లింపు కాలమ్‌లోని ‘Pay Now’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
6. అందుబాటులో ఉన్న చెల్లింపు విధానాన్ని ఎంచుకుని లావాదేవీని పూర్తి చేయండి.

చెల్లింపు పూర్తయ్యాక రిసిప్ట్‌ లేదా ట్రాన్సాక్షన్‌ రిఫరెన్స్‌ నంబర్‌ను భద్రపరచుకోండి. అవసరమైతే, భవిష్యత్తులో చెల్లింపునకు ఆధారంగా ఉపయోగపడుతుంది. వాహనానికి రిజిస్టర్‌ చేసిన మొబైల్‌ నంబర్‌కు కన్ఫర్మేషన్‌ మెసేజ్‌ కూడా రావచ్చు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే అనుమానాస్పద లింకుల ద్వారా డబ్బు చెల్లించకుండా, అధికారిక వెబ్‌సైట్‌ ద్వారానే చెల్లింపు చేయడం మంచిది. 

ఒకవేళ, చలాన్‌ తప్పుగా జారీ అయిందని అనిపిస్తే, దానిని అలాగే వదిలేయకుండా సంబంధిత స్టేషన్‌ దృష్టికి తీసుకెళ్లండి.

చలాన్‌ చెల్లించకపోతే ఏమవుతుంది?

ఈ-చలాన్‌ను పట్టించుకోకపోతే అది ఆటోమేటిక్‌గా రద్దు కాదు. జరిమానా పెండింగ్‌లో ఉండిపోవచ్చు. కేసు స్వభావం, వర్తించే నిబంధనలు, సంబంధిత అధికారుల చర్యలను బట్టి తదుపరి నోటీసులు లేదా చట్టపరమైన చర్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

పెండింగ్‌ చలాన్లు ఉంటే, వాహనాన్ని అమ్ముదామని అనుకున్నప్పుడు లేదా రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (RC) బదిలీ సమయంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. అందువల్ల, అప్పుడప్పుడు మీ వాహనంపై చలాన్లు ఉన్నాయో లేదో తనిఖీ చేయడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
Bajaj Pulsar N250SS మార్కెట్‌లోకి వచ్చింది.. Pulsar N250తో పోలిస్తే ఏం మారింది? ధరలో డిఫరెన్స్‌ ఎంత?
పల్సర్ N250 వర్సెస్‌ పల్సర్ N250SS... ఈ రెండు బైక్‌ల మధ్య ప్రధాన తేడాలేంటి?
Ban on non-BS6 vehicles: కాలుష్యంపై కఠిన చర్యలు.. నాన్‌-BS6 వెహికల్స్‌కు నో ఎంట్రీ, PUC లేకుంటే పెట్రోల్‌ కూడా దొరకదు!
మీ వెహికల్‌ BS6 కాదా? అయితే, నవంబర్‌ 1 నుంచి సిటీలోకి 'నో ఎంట్రీ'!
Maruti Victorisని మరింత ఆకర్షణీయంగా మార్చేద్దామా? ఔరమ్ ఎడిషన్ లాంచ్‌.. ఈ కిట్‌లో ఏమేం ఉన్నాయంటే?
మారుతి విక్టోరిస్‌ కోసం కొత్త యాక్సెసరీస్ కిట్.. కేవలం రూ.22,990తో మరింత ప్రీమియం లుక్‌!
Advertisement

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Third Front: కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ 2.0 - మమత, అఖిలేష్, జగన్‌లతో నయా కూటమికి ప్లాన్ చేస్తున్నారా?
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ 2.0 - మమత, అఖిలేష్, జగన్‌లతో నయా కూటమికి ప్లాన్ చేస్తున్నారా?
Punganur Municipal Chairman: పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
Tea With Snacks : సమోసాలు, బిస్కెట్లు మాత్రమే కాదు.. టీతో పాటు ఇవి తినడం కూడా మంచిది కాదట
సమోసాలు, బిస్కెట్లు మాత్రమే కాదు.. టీతో పాటు ఇవి తినడం కూడా మంచిది కాదట
Dasara Holidays: బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
Hyderabad RTC Pass: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
Bigg Boss Season 10 Today October 25th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
Embed widget