అన్వేషించండి

తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే

మారుతి సుజుకి కొత్త YMC ఎలక్ట్రిక్ MPV వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకురానుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఈవీ కారు సుమారు 500km రేంజ్ ఇస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు YMC అభివృద్ధి చేస్తోంది.
  • దీనికి 500 కి.మీ. రేంజ్, ఆధునిక ఫీచర్లు ఉంటాయి.
  • ఇ-విటారా సాంకేతికత పంచుకుంటూ 2027లో మార్కెట్లోకి వస్తుంది.

భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. మారుతి సుజుకి కూడా ఈ సెగ్మెంట్‌లో పట్టు నిలుపుకునేందుకు  సిద్ధమవుతోంది. కంపెనీ తొలి ఎలక్ట్రిక్ SUV e VITARAను మార్కెట్లోకి తీసుకొచ్చిన తర్వాత, తాజాగా పెద్ద 7 సీటర్ ఎలక్ట్రిక్ కారుపై వర్క్ చేస్తోంది. ఈ మోడల్‌ను YMC కోడ్‌నేమ్‌తో పిలుస్తున్నారు. ఇటీవల దీని టెస్టింగ్ మోడల్ రోడ్లపై కనిపించింది. దీంతో ఇది త్వరలో మార్కెట్లోకి వస్తుందని ఆశిస్తున్నారు.

మారుతి ఈ కొత్త ఎలక్ట్రిక్ MPVని ముఖ్యంగా పెద్ద కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని తయారుచేస్తున్నారు. నివేదికల ప్రకారం, ఈ కారు సుమారు 500 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంది. కారులో ఆధునిక డిజైన్, ప్రీమియం కేబిన్, కనెక్టెడ్ ఫీచర్లు, ADAS వంటి సేఫ్టీ ఫీచర్లు రావొచ్చు. 

మొదటి 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు YMC 

మారుతి కంపెనీ రాబోయే YMCను తొలి 7 సీటర్ ఎలక్ట్రిక్ కారుగా భావిస్తున్నారు. దీని డిజైన్ SUV, MPV కాంబినేషన్‌గా  ఉండవచ్చు. టెస్టింగ్ మోడల్‌లో పొడవైన బాడీ, చిన్న బోనెట్, తగిన గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి. ఇటీవల లీక్ అయిన ఫొటోల్లో దీని వెనుక భాగానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఇందులో కనెక్టెడ్ టెయిల్‌ల్యాంప్, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, పెద్ద టెయిల్‌గేట్, రియర్ వైపర్, డీఫాగర్ వంటివి ఉంటాయి. 

500KM వరకు రేంజ్ 

YMC అతిపెద్ద ప్రత్యేకత దాని రేంజ్ అవుతుంది. ఇందులో మారుతి e VITARAకు సంబంధించిన బ్యాటరీ, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగిస్తారని రిపోర్టులు చెబుతున్నాయి. e VITARAలో 49kWh, 61kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. మారుతి కంపెనీ ప్రకారం 61kWh బ్యాటరీ ఉన్న e VITARA సింగిల్ ఛార్జ్‌లో 500km కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది. దాని వెరిఫైడ్ రేంజ్ 543km. 7 సీటర్ కావడం వల్ల దీని బరువు ఈ విటారా కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే రియల్ రేంజ్ కాస్త భిన్నంగా ఉండవచ్చు.

e VITARA నుంచి టెక్నాలజీ 

కొత్త YMCలో మారుతి తన ప్రస్తుత EV టెక్నాలజీ e VITARAతో బ్యాటరీ, మోటార్ టెక్నాలజీని వాడే అవకాశం ఉందని పేర్కొన్నారు. e VITARAలో 61kWh బ్యాటరీతో సింగిల్ స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్, 2WD సెటప్ ఉంది. కొత్త కారులోనూ ఇలాంటి పవర్‌ట్రెయిన్ ఉంటే, ఇది లాంగ్ జర్నీలతో పాటు ఫ్యామిలీ కోసం బెస్ట్ ఛాయిస్ కానుంది. 

ADAS సహా అనేక ఫీచర్లు 

ఎలక్ట్రిక్ కారు YMCలో మోడ్రన్ డిజిటల్ కేబిన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లభించనుంది. ADAS (Advanced Driver Assistance System) కూడా రావొచ్చు. మారుతి e VITARAలో ఇప్పటికే Level 2 ADAS, 7 ఎయిర్‌బ్యాగ్స్, మారుతి కనెక్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

ఈ కారు 2027లో లాంచ్ 

YMC గురించి ఇప్పటివరకు మారుతి కంపెనీ నుంచి ఎలాంటి వివరాలు రాలేదు. ప్రస్తుత నివేదికల్లో దీన్ని 2027లో లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మారుతి సుమారు 500km రేంజ్, 7 సీటర్, ఆధునిక ఫీచర్లతో మంచి ధరకు అందిస్తే, ఇది భారత EV మార్కెట్లో సంచలనంగా మారవచ్చు. పెట్రోల్- డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారాలనుకునే వారికి ఈ కారు సరిగ్గా సరిపోతుంది. 

 

Frequently Asked Questions

మారుతి సుజుకి అభివృద్ధి చేస్తున్న కొత్త ఎలక్ట్రిక్ కారు ఏమిటి?

ఇది 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు, దీనికి 'YMC' అనే కోడ్‌నేమ్ ఉంది. పెద్ద కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని దీనిని తయారు చేస్తున్నారు.

మారుతి YMC ఎలక్ట్రిక్ కారు రేంజ్ ఎంత?

ఈ కారు సుమారు 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదని అంచనా. ఇది e VITARA యొక్క 61kWh బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగిస్తుంది.

మారుతి YMCలో ఏయే ఫీచర్లు లభిస్తాయి?

ఇందులో మోడ్రన్ డిజిటల్ కేబిన్, పెద్ద టచ్‌స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ADAS వంటి అధునాతన ఫీచర్లు ఉండవచ్చు.

మారుతి YMC ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు విడుదల కానుంది?

ఈ కారు 2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. కంపెనీ నుండి అధికారిక వివరాలు ఇంకా రాలేదు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Affordable Gloves Boots: రూ.15 వేలల్లోనే పూర్తి రైడింగ్ గేర్.. CE Level 2 ఆర్మర్ అంటే ఏమిటి?
రూ.15 వేలల్లోనే బైక్ పూర్తి రైడింగ్ గేర్.. జాకెట్, గ్లౌజులు, బూట్లను ఎలా ఎంచుకోవాలి?
2026 KTM 200 Duke Review: కేవలం రూ.1,500 అదనపు ధర.. కేటీఎం 200 డ్యూక్‌లో 5 కీలక అప్‌డేట్స్ ఇవే!
2026 కేటీఎం 200 డ్యూక్ రివ్యూ: ఈ బైక్‌లో వచ్చిన 5 కొత్త అప్‌డేట్స్, ప్రత్యేకతలు ఇవిగో!
Bike Pillion Seat: తల్లిదండ్రులతో బైక్‌పై ప్రయాణిస్తున్నారా? వెనుక కూర్చునేవారికి సౌకర్యవంతమైన సీట్‌ ఉన్న 5 బైక్స్
తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించడానికి సౌకర్యవంతమైన వెనుక సీట్లు.. భారత్‌లో టాప్ 5 బైక్స్ ఇవే!
Fastest Charging Electric Cars: భారత్‌లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
భారత్‌లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే Electric Vehicles ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు
ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు
Tirupati Crime News: అప్పు తిరిగి చెల్లించలేదని తల్లితో పాటు 6 నెలల చిన్నారి కిడ్నాప్! తిరుపతి జిల్లాలో దారుణం
అప్పు తిరిగి చెల్లించలేదని తల్లితో పాటు 6 నెలల చిన్నారి కిడ్నాప్! తిరుపతి జిల్లాలో దారుణం
Andhra Pradesh Rains: ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
Mohit Ulva Journey: టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Fastest Charging Electric Cars: భారత్‌లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
భారత్‌లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే Electric Vehicles ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
Embed widget