అన్వేషించండి

Turbo Engine Maintenance: టర్బో ఇంజిన్‌ కార్‌ మైలేజీ, పెర్ఫార్మెన్స్‌ బాగుండాలంటే ఈ 7 జాగ్రత్తలు తప్పనిసరి!

టర్బో ఇంజిన్‌ ఎక్కువ కాలం మెరుగ్గా పనిచేయాలంటే సరైన ఇంజిన్‌ ఆయిల్‌, నాణ్యమైన ఇంధనం, ఎయిర్‌ ఫిల్టర్‌ నిర్వహణ, సకాలంలో సర్వీసింగ్‌ చాలా ముఖ్యం.

Turbocharged engine maintenance tips: ప్రస్తుతం కార్లలో టర్బోచార్జ్‌డ్‌ ఇంజిన్ల వినియోగం పెరుగుతోంది. తక్కువ సామర్థ్యం ఉన్న ఇంజిన్‌ నుంచే ఎక్కువ పవర్‌ పొందేందుకు కార్ల తయారీ సంస్థలు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. సాధారణంగా నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ ఇంజిన్లతో పోలిస్తే టర్బో ఇంజిన్లు మెరుగైన పనితీరును అందించగలవు. అయితే, వీటిలో అదనపు పరికరాలు ఉండటం, అధిక ఉష్ణోగ్రతలు & వేగంతో పనిచేయడం వల్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే టర్బోచార్జర్‌ దెబ్బతిని రిపేర్‌ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

టర్బో ఇంజిన్‌ ఎలా పనిచేస్తుంది?

టర్బోచార్జర్‌లో టర్బైన్‌, ఇంపెల్లర్‌ ఉంటాయి. ఇవి ఒక షాఫ్ట్‌ ద్వారా అనుసంధానమై ఉంటాయి. ఇంజిన్‌ పనిచేసినప్పుడు వెలువడే ఎగ్జాస్ట్‌ వాయువులు టర్బైన్‌ను తిప్పుతాయి. దీంతో ఇంపెల్లర్‌ కూడా వేగంగా తిరిగి బయట గాలిని లోపలికి లాగి ఒత్తిడితో ఇంజిన్‌కు పంపిస్తుంది. కొన్ని టర్బోచార్జర్లు నిమిషానికి 2,50,000 rpm వరకు తిరగగలవు.

ఒత్తిడితో వచ్చే గాలిలో ఆక్సిజన్‌ ఎక్కువగా ఉండటంతో ఇంధనం దహనం కావడానికి సహాయపడుతుంది. అయితే, ఈ ప్రక్రియలో గాలి వేడెక్కుతుంది. ఆ వేడిని తగ్గించేందుకు ఇంటర్‌కూలర్‌ ఉపయోగపడుతుంది. చల్లబడిన గాలి ఇంజిన్‌ సిలిండర్లలోకి వెళ్తుంది. ఈ వ్యవస్థ వల్ల చిన్న ఇంజిన్‌ నుంచే అధిక పనితీరు పొందే అవకాశం ఉంటుంది.

1. సరైన ఇంజిన్‌ ఆయిల్‌ వాడాలి

టర్బో ఇంజిన్‌లో ఇంజిన్‌ ఆయిల్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది టర్బోచార్జర్‌ బేరింగ్స్‌కు లూబ్రికేషన్‌ అందించడంతో పాటు వేడిని నియంత్రించడంలోనూ సహాయపడుతుంది. తయారీ సంస్థ సూచించిన గ్రేడ్‌, స్పెసిఫికేషన్లకు సరిపోయే ఆయిల్‌నే ఉపయోగించాలి.

ఆయిల్‌ మార్చాల్సిన సమయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఆయిల్‌ కలుషితమైతే లేదాస లెవెల్‌ తగ్గితే టర్బోచార్జర్‌ భాగాలు వేగంగా అరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి క్రమం తప్పకుండా ఆయిల్‌ లెవల్‌ తనిఖీ చేయాలి. ఆయిల్‌ లీకేజీ లేదా ఆయిల్‌ ప్రెజర్‌ వార్నింగ్‌ కనిపిస్తే వెంటనే పరిశీలించాలి.

ఇది కూడా చదవండి: ట్రాఫిక్‌ చలాన్‌ కట్టకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేస్తారా? ఆన్‌లైన్‌లో ఇలా చెక్‌ చేయండి!

2. ఇంజిన్‌ చల్లగా ఉన్నప్పుడు వేగంగా నడపకండి

కారు స్టార్ట్‌ చేసిన వెంటనే అధిక వేగంతో నడపడం మంచిది కాదు. ముఖ్యంగా ఇంజిన్‌ చల్లగా ఉన్నప్పుడు ఆయిల్‌ అన్ని భాగాలకు చేరేందుకు కొంత సమయం పడుతుంది. అందువల్ల స్టార్ట్‌ చేసిన తర్వాత కొద్దిసేపు ప్రశాంతంగా నడపాలి.

మొదట్లో వేగంగా యాక్సిలరేట్‌ చేయకుండా, ఇంజిన్‌పై అధిక లోడ్‌ పడకుండా చూసుకోవాలి. కొన్ని నిమిషాల పాటు తక్కువ rpm వద్ద నడిపితే ఇంజిన్‌ క్రమంగా సాధారణ ఆపరేటింగ్‌ ఉష్ణోగ్రతకు చేరుతుంది. కారు మోడల్‌కు సంబంధించిన సూచనలను ఓనర్‌ మాన్యువల్‌లో పరిశీలించడం మంచిది.

3. వేగంగా ప్రయాణించిన తర్వాత వెంటనే ఇంజిన్‌ ఆపకండి

ఎక్కువసేపు హైస్పీడ్‌లో ప్రయాణించినప్పుడు, కొండ ప్రాంతాల్లో ఎక్కినప్పుడు లేదా ఇంజిన్‌పై అధిక లోడ్‌ పడినప్పుడు టర్బోచార్జర్‌ బాగా వేడెక్కుతుంది. అలాంటి సమయంలో వెంటనే ఇంజిన్‌ ఆపేస్తే కొన్ని మోడళ్లలో ఆయిల్‌ ప్రసరణ నిలిచిపోవడం వల్ల వేడి ప్రభావం పెరగవచ్చు.

అందుకే ప్రయాణం చివర్లో కొన్ని నిమిషాలు తక్కువ వేగంతో నడిపి టర్బో ఉష్ణోగ్రత తగ్గేలా చూడాలి. అయితే, ప్రతి ఆధునిక టర్బో కారులోనూ ఇంజిన్‌ను ఎక్కువసేపు ఐడ్లింగ్‌లో ఉంచాల్సిన అవసరం లేదు. కొన్ని కార్లలో ఇంజిన్‌ ఆపిన తర్వాత కూడా వేడిని నియంత్రించే వ్యవస్థలు పని చేస్తాయి.

4. ఎయిర్‌ ఫిల్టర్‌ను శుభ్రంగా ఉంచాలి

టర్బోచార్జర్‌ గాలిని లోపలికి లాగి ఒత్తిడితో ఇంజిన్‌కు పంపిస్తుంది. ఎయిర్‌ ఫిల్టర్‌ సరిగా పనిచేయకపోతే దుమ్ము, చిన్న కణాలు ఇంజిన్‌లోకి చేరి టర్బో భాగాలను దెబ్బతీయవచ్చు.

భారతదేశంలోని దుమ్ముతో కూడిన రోడ్లపై ప్రయాణించే కార్లలో ఎయిర్‌ ఫిల్టర్‌పై ఎక్కువ మురికి పేరుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల మాన్యువల్‌లో సూచించిన వ్యవధిలో ఫిల్టర్‌ను తనిఖీ చేయాలి. అవసరమైతే శుభ్రం చేయాలి లేదా మార్చాలి. దుమ్ము ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కారు నడిపేవారు మరింత తరచుగా తనిఖీ చేయడం మంచిది.

ఇది కూడా చదవండి: తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే

5. నాణ్యమైన పెట్రోల్‌ వాడాలి

టర్బో పెట్రోల్‌ ఇంజిన్లు అధిక ఉష్ణోగ్రతలు, ఒత్తిడితో పనిచేస్తాయి. అందువల్ల ఇంధన నాణ్యత ముఖ్యం. తయారీ సంస్థ సూచించిన కనీస ఆక్టేన్‌ రేటింగ్‌ ఉన్న పెట్రోల్‌నే ఉపయోగించాలి. నమ్మకమైన ఇంధన కేంద్రాల వద్ద పెట్రోల్‌ నింపుకోవడం మంచిది. ప్రతి టర్బో కారుకు ప్రీమియం పెట్రోల్‌ అవసరం ఉండదు. కారు మాన్యువల్‌లో సూచించిన ఇంధన గ్రేడ్‌ను అనుసరించాలి.

భారత్‌లో E20 పెట్రోల్‌ వినియోగం పెరిగిన నేపథ్యంలో ఇథనాల్‌ మిశ్రమానికి సంబంధించిన అనుకూలతను కూడా పరిశీలించాలి. కొన్ని పాత కార్లు E10 వరకు మాత్రమే అనుకూలంగా ఉండవచ్చు. అలాంటి కార్లలో E20 వాడితే ఇంధన సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. మీ కారు E20కు అనుకూలమా కాదా అనేది తయారీ సంస్థ సూచనల ద్వారా నిర్ధారించుకోవాలి.

6. MPFI, డైరెక్ట్‌ ఇంజెక్షన్‌ ఇంజిన్ల నిర్వహణ

టర్బో పెట్రోల్‌ ఇంజిన్లలో MPFI లేదా డైరెక్ట్‌ ఇంజెక్షన్‌ వ్యవస్థ ఉండవచ్చు. MPFI ఇంజిన్లలో ఇంధనం ఇన్‌టేక్‌ వాల్వ్‌ల దగ్గర స్ప్రే అవుతుంది. దీనివల్ల వాల్వ్‌ల వెనుక పేరుకునే కార్బన్‌ డిపాజిట్లను కొంతవరకు తగ్గించడంలో సహాయపడవచ్చు. అయితే, ఇతర భాగాల్లో మురికి పేరుకుపోవడాన్ని ఇది పూర్తిగా నివారించదు.

డైరెక్ట్‌ ఇంజెక్షన్‌ ఇంజిన్లలో ఇంధనం నేరుగా సిలిండర్‌లోకి వెళ్తుంది. అందువల్ల ఇన్‌టేక్‌ వాల్వ్‌ల వెనుక కార్బన్‌ డిపాజిట్లు పేరుకునే అవకాశం ఉంటుంది. కాలక్రమేణా ఇవి పెరిగితే ఇంజిన్‌ ఐడ్లింగ్‌లో అస్థిరత, యాక్సిలరేషన్‌లో ఆలస్యం, పనితీరు తగ్గడం లేదా మిస్‌ఫైర్‌ వంటి సమస్యలు రావచ్చు.

అందుకే స్పార్క్‌ ప్లగ్స్‌, ఇంజెక్టర్లు, థ్రోటిల్‌ బాడీతో పాటు ఇతర భాగాలను కూడా సర్వీసింగ్‌ సమయంలో తనిఖీ చేయించాలి.

7. వార్నింగ్‌ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి

టర్బో ఇంజిన్‌లో చిన్న సమస్యను ప్రారంభంలోనే గుర్తిస్తే పెద్ద రిపేర్‌ ఖర్చులను నివారించవచ్చు. కారు పవర్‌ అకస్మాత్తుగా తగ్గడం, అసాధారణ శబ్దాలు రావడం, ఎగ్జాస్ట్‌ నుంచి అధిక పొగ వెలువడటం, ఆయిల్‌ వినియోగం పెరగడం, ఇంజిన్‌ సరిగా పనిచేయకపోవడం లేదా మైలేజీ అకస్మాత్తుగా తగ్గడం వంటి లక్షణాలను గమనించాలి.

ఇలాంటి సమస్యలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా నిపుణుల వద్ద తనిఖీ చేయించాలి. అలాగే, తయారీ సంస్థ సూచించిన సర్వీసింగ్‌ షెడ్యూల్‌ను తప్పనిసరిగా పాటించాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Paying e-challan online: ట్రాఫిక్‌ చలాన్‌ కట్టకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేస్తారా? ఆన్‌లైన్‌లో ఇలా చెక్‌ చేయండి!
మీ బండిపై ట్రాఫిక్‌ చలాన్‌ ఉందో, లేదో మీకు తెలుసా? మీ ఫోన్‌లోనే చెక్‌ చేయవచ్చు!
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
Bajaj Pulsar N250SS మార్కెట్‌లోకి వచ్చింది.. Pulsar N250తో పోలిస్తే ఏం మారింది? ధరలో డిఫరెన్స్‌ ఎంత?
పల్సర్ N250 వర్సెస్‌ పల్సర్ N250SS... ఈ రెండు బైక్‌ల మధ్య ప్రధాన తేడాలేంటి?
Ban on non-BS6 vehicles: కాలుష్యంపై కఠిన చర్యలు.. నాన్‌-BS6 వెహికల్స్‌కు నో ఎంట్రీ, PUC లేకుంటే పెట్రోల్‌ కూడా దొరకదు!
మీ వెహికల్‌ BS6 కాదా? అయితే, నవంబర్‌ 1 నుంచి సిటీలోకి 'నో ఎంట్రీ'!
Advertisement

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Third Front: కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ 2.0 - మమత, అఖిలేష్, జగన్‌లతో నయా కూటమికి ప్లాన్ చేస్తున్నారా?
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ 2.0 - మమత, అఖిలేష్, జగన్‌లతో నయా కూటమికి ప్లాన్ చేస్తున్నారా?
Punganur Municipal Chairman: పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
Tea With Snacks : సమోసాలు, బిస్కెట్లు మాత్రమే కాదు.. టీతో పాటు ఇవి తినడం కూడా మంచిది కాదట
సమోసాలు, బిస్కెట్లు మాత్రమే కాదు.. టీతో పాటు ఇవి తినడం కూడా మంచిది కాదట
Dasara Holidays: బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
Hyderabad RTC Pass: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
Bigg Boss Season 10 Today October 25th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
Embed widget