అన్వేషించండి

Bajaj Pulsar N250SS మార్కెట్‌లోకి వచ్చింది.. Pulsar N250తో పోలిస్తే ఏం మారింది? ధరలో డిఫరెన్స్‌ ఎంత?

Bajaj Pulsar N250SSలో 4-వాల్వ్‌ ఇంజిన్‌, 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌, క్విక్‌షిఫ్టర్‌, 5-అంగుళాల TFT డిస్‌ప్లే ఉన్నాయి. స్టాండర్డ్‌ N250తో ధర, ఫీచర్ల తేడాలు తెలుసుకోండి.

Bajaj Pulsar N250 vs N250SS: బజాజ్‌ ఆటో, తన పల్సర్‌ బైక్‌ సిరీస్‌లో Pulsar N250SSను చేర్చింది. ఈ మోడల్‌.. స్టాండర్డ్‌ Pulsar N250 కంటే పైస్థాయి వేరియంట్‌గా అందుబాటులోకి వచ్చింది. గతంలో Pulsar N160కు కూడా కంపెనీ ఇదే తరహా SS అప్‌డేట్‌ ఇచ్చింది. ఇప్పుడు N250SSలోనూ ఇంజిన్‌, గేర్‌బాక్స్‌, ఫీచర్ల పరంగా కీలక మార్పులు చేసింది. ఈ రెండు బైక్‌ల్లో కొన్ని ప్రాథమిక అంశాలు ఒకేలా ఉన్నప్పటికీ, కొత్త మోడల్‌లో అదనపు సదుపాయాలు ఉన్నాయి. మరి ఈ రెండు వేరియంట్ల మధ్య ప్రధాన వ్యత్యాసాలు ఏమిటో తెలుసుకుందాం.

ఇంజిన్‌లో కీలక మార్పులు

కాగితంపై చూస్తే.. Pulsar N250, N250SS రెండింటిలోనూ 249cc ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్‌ ఎయిర్‌ & ఆయిల్‌ కూలింగ్‌ వ్యవస్థతో పనిచేస్తుంది. అయితే, ఇంజిన్‌ నిర్మాణంలో మాత్రం తేడా ఉంది.

స్టాండర్డ్‌ N250లో 2-వాల్వ్‌ హెడ్‌ ఉండగా, N250SSలో అప్‌డేట్‌ చేసిన 4-వాల్వ్‌ హెడ్‌ను అందించారు. దీని కారణంగా కొత్త వేరియంట్‌ గరిష్ఠంగా 25hp పవర్‌, 22Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్టాండర్డ్‌ N250లో 24.5hp పవర్‌, 21.5Nm టార్క్‌ లభిస్తుంది. అంటే N250SSలో పవర్‌, టార్క్‌ స్వల్పంగా పెరిగాయి.

6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌, క్విక్‌షిఫ్టర్‌

గేర్‌బాక్స్‌ విషయంలోనూ N250SSకు అదనపు ప్రయోజనం ఉంది. స్టాండర్డ్‌ N250లో 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ ఉంటే, N250SSలో 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను అందించారు.

అంతేకాదు, కొత్త వేరియంట్‌లో క్విక్‌షిఫ్టర్‌ కూడా స్టాండర్డ్‌గా లభిస్తుంది. దీని ద్వారా క్లచ్‌ను ఉపయోగించకుండా పై గేర్‌కు మారవచ్చు. స్టాండర్డ్‌ N250లో ఈ ఫీచర్‌ లేదు.

N250SSలో ఎలక్ట్రానిక్‌ థ్రోటిల్‌ బాడీని కూడా కొత్తగా అందించారు. ఇది రైడింగ్‌ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. దీంతో రైడర్‌కు బైక్‌ పనితీరును ఎంచుకున్న మోడ్‌కు అనుగుణంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: Maruti Victorisని మరింత ఆకర్షణీయంగా మార్చేద్దామా? ఔరమ్ ఎడిషన్ లాంచ్‌.. ఈ కిట్‌లో ఏమేం ఉన్నాయంటే?

ఫీచర్లలోనూ అప్‌గ్రేడ్‌

రెండు బైక్‌ల మధ్య మరో ముఖ్యమైన తేడా డిస్‌ప్లే. స్టాండర్డ్‌ N250లో నెగెటివ్‌ LCD కన్సోల్‌ ఉంటుంది. N250SSలో మాత్రం 5-అంగుళాల TFT డిస్‌ప్లేను ఇచ్చారు.

ఇతర అదనపు ఫీచర్లలో అడ్జస్టబుల్‌ లీవర్లు, USB Type-C ఛార్జింగ్‌ పోర్ట్‌, పానిక్‌ బ్రేక్‌ అలర్ట్‌, హజార్డ్‌ స్విచ్‌ ఉన్నాయి. ఇవి బైక్‌ వినియోగాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఉపయోగపడతాయి.

ధర ఎంతంటే?

ధర విషయానికి వస్తే, ఎక్స్‌-షోరూమ్‌ ధర ప్రకారం Pulsar N250SS ధర రూ.1.59 లక్షలు. స్టాండర్డ్‌ Pulsar N250 ధర రూ.1.45 లక్షలు. అంటే, కొత్త SS వేరియంట్‌ కోసం అదనంగా రూ.14,000 చెల్లించాలి. ఈ అదనపు ఖర్చుకు మెరుగైన పవర్‌, ఎక్కువ గేర్‌ నిష్పత్తుల ఎంపిక, క్విక్‌షిఫ్టర్‌, TFT డిస్‌ప్లే, ఇతర సౌకర్యవంతమైన ఫీచర్లు లభిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ఇప్పుడు టూవీలర్లలోనూ లగ్జరీ కార్లకు పోటీగా స్మార్ట్‌ ఫీచర్లు.. ఇలాంటివి ఉన్నట్లు మీకు తెలుసా?

ప్రత్యర్థుల ధరలతో పోలిస్తే..

Pulsar N250SS ధర దాని ప్రధాన ప్రత్యర్థి బైక్‌ల కంటే తక్కువగా ఉంది. Suzuki Gixxer 250 ధర రూ.1.85 లక్షలు కాగా, ఇటీవల పరిచయమైన Hero Xtreme 250R Carbon ధర రూ.1.98 లక్షలు. ఈ రెండు మోడళ్లతో పోలిస్తే N250SS తక్కువ ధరలో అందుబాటులో ఉంది.

మొత్తంగా చూస్తే, స్టాండర్డ్‌ N250 కంటే అదనపు ఫీచర్లు, 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌, క్విక్‌షిఫ్టర్‌ కావాలనుకునే వారికి Pulsar N250SS ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తుంది. అయితే, తక్కువ ధరలో 250cc బైక్‌ కావాలనుకునే వారికి స్టాండర్డ్‌ N250 కూడా పరిశీలించదగిన మోడల్‌.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Small Cars: మీ ఇంటి దగ్గర రోడ్డు చాలా ఇరుకా? పార్కింగ్‌కు సరైన స్థలం లేదా? ఈ 8 కార్లు మీకు మంచి ఎంపిక
చిన్న సందులు, ఇరుకైన అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లకు సులభంగా సరిపోయే 8 కార్లు ఇవే!
Car Warranty: డాష్‌క్యామ్ అమరిస్తే కారు వారంటీ రద్దవుతుందా? రూ.లక్షల నష్టం రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!
కారులో డాష్‌క్యామ్ పెట్టించాలనుకుంటున్నారా? మీ కారు వారంటీ పోతుందేమో తెలుసుకోండి!
Hyundai Grand i10 Nios కొనే ప్లాన్‌లో ఉన్నారా? ముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి
హ్యుందాయ్‌ i10 నియోస్‌ కొనవచ్చా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు, 2 మైనస్ పాయింట్లు
Kia Seltos సరికొత్త రికార్డ్‌.. 7 లక్షలు దాటిన అమ్మకాలు.. ఈ SUVకి ఇంత క్రేజ్ ఎందుకో తెలుసా?
ఇండియాలో 7 లక్షల మంది కొన్న క్రేజీ SUV.. ధర మీ బడ్జెట్‌లోనే!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohit Ulva Heroics: ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Comedy Thriller OTT : ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Vitamins for Hair : జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
Embed widget