BRS ప్రభుత్వం గతంలో కృష్ణా నదిలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకు ఒప్పుకుందని, వారి చారిత్రక తప్పిదాల వల్లే రాష్ట్రానికి క్లిష్ట పరిస్థితి వచ్చిందని చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
Water Crisis | కాళేశ్వరంలో నీటిమట్టం తక్కువగా ఉండటంతో ఎత్తిపోత సాధ్యం కావడం లేదని, గత BRS ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాల వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని భువనగిరి ఎంపీ చామల మండిపడ్డారు.

- బీఆర్ఎస్ కృష్ణా జలాల కేటాయింపులు, పాలన లోపాలను ఎంపీ కిరణ్ తప్పుబట్టారు.
- గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం; కేటీఆర్, హరీష్‌లపై తీవ్ర విమర్శలు.
- ఎల్‌నినోతో నీటి కొరత; మే 28న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు.
Telangana ElNino Challenge | హైదరాబాద్: గతంలో కృష్ణా నదిలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకు ఒప్పుకున్నదే బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వమని, వారి చేసిన చారిత్రక తప్పిదాల వల్లే రాష్ట్రానికి క్లిష్ట పరిస్థితి వచ్చిందని భువనగిరి లోక్‌సభ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram) వద్ద ప్రస్తుత నీటి ప్రవాహ పరిస్థితిని, బిఆర్ఎస్ పాలనా లోపాలను ఎత్తిచూపారు. కాళేశ్వరం వద్ద నీటిని ఎత్తిపోసేందుకు కనీసం 93.5 మీటర్ల నీటిమట్టం కావాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 89 మీటర్ల ప్రవాహం మాత్రమే ఉందన్నారు. దాదాపు 4.5 మీటర్ల మేర నీటి ప్రవాహం తక్కువగా ఉండటం వల్ల నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేదని వివరించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద కూడా ఇదే రకమైన పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
గోదావరి జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత
గోదావరి జలాల వినియోగంపై బిఆర్ఎస్ అనవసరంగా దుష్ప్రచారం చేస్తోందని చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికే గోదావరి నీళ్లను సమర్థవంతంగా వాడుకుంటోందని, అలాంటప్పుడు దేవాదుల, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి BRS నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలంగాణ నీళ్లు ఆంధ్రప్రదేశ్‌కు పోతున్నాయన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అసలు నీళ్లు ఆంధ్రాకు పోవడం లేదని స్పష్టం చేశారు. బొగ్గు, నీళ్లు, విద్యుత్ వంటి కీలక రంగాలపై బిఆర్ఎస్ పార్టీకి సరైన చిత్తశుద్ధి లేకపోవడం వల్లే నేడు తెలంగాణలో పరిస్థితులు తలెత్తాయని అన్నారు.
కేటీఆర్, హరీష్ రావు వైఖరిపై ధ్వజం
ప్రజలు అధికారం ఇవ్వలేదనే కక్షతో కేటీఆర్ (KTR), హరీష్ రావు నిరంతరం రాజకీయ విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల ఆరోపించారు. 24 గంటలూ రాజకీయాలు చేయడమే వారి ప్రధాన అజెండాగా మారిందని, కేటీఆర్ వివేకం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. దాదాపు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఇప్పుడు నీతులు చెప్తున్నారని, గడ్డం పెంచితే ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారని కేటీఆర్ భావిస్తున్నారేమో అని సెటైర్లు వేశారు. కేటీఆర్ ఏం చేసినా లేదా ఎలాంటి మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు.
Also Read: Hyderabad RTC Pass: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
ఎల్‌నినో విపత్తు.. అఖిలపక్ష సమావేశం
సుమారు 150 ఏళ్ల తర్వాత దేశంలో El Nino విపత్తు వచ్చిందని, దీని ప్రభావం వల్ల నీటి ప్రవాహాలు, వర్షపాతంపై తీవ్ర ప్రభావం పడిందని చామల కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు. ఎల్ నినో పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారని తెలిపారు. ఎల్‌నినో సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ నెల 28న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పక్షాల నాయకులు హాజరై, ప్రభుత్వానికి తగిన సలహాలు మరియు సూచనలు అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Frequently Asked Questions
కృష్ణా నది నీటి కేటాయింపులపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమని విమర్శించారు?
కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ప్రస్తుత నీటిమట్టం పరిస్థితి ఎలా ఉంది?
కాళేశ్వరం వద్ద నీటిని ఎత్తిపోసేందుకు 93.5 మీటర్లు అవసరం కాగా, ప్రస్తుతం 89 మీటర్ల ప్రవాహం మాత్రమే ఉంది. 4.5 మీటర్ల మేర నీటిమట్టం తక్కువగా ఉండటంతో నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేదు.
ఎల్‌నినో విపత్తు ప్రభావం మరియు దానిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి?
150 ఏళ్ల తర్వాత వచ్చిన ఎల్‌నినో విపత్తు నీటి ప్రవాహాలు, వర్షపాతంపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ నెల 28న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
గోదావరి జలాల వినియోగంపై BRS చేస్తున్న దుష్ప్రచారం గురించి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారు?
గోదావరి జలాలపై BRS దుష్ప్రచారం చేస్తోందని చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే నీళ్లను సమర్థవంతంగా వాడుకుంటోంది. తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు పోవడం లేదని తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు























