అన్వేషించండి

Tecno Megabook T1: మొట్టమొదటి ల్యాప్‌టాప్ లాంచ్ చేసిన టెక్నో - సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్!

టెక్నో మొట్టమొదటి ల్యాప్‌టాప్ మార్కెట్లో లాంచ్ అయింది. అదే టెక్నో మెగాబుక్ టీ1.

టెక్నో తన మొట్టమొదటి ల్యాప్‌టాప్‌ను ఐఎఫ్ఏ 2022 బెర్లిన్ ఈవెంట్లో లాంచ్ చేసింది. అదే టెక్నో మెగాబుక్ టీ1. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం, 16 జీబీ వరకు ర్యామ్, 70Whr బ్యాటరీతో ఈ ల్యాప్‌టాప్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా 17.5 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది.

దీని ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. షాంపేన్ గోల్డ్, మోనెట్ వయొలెట్, రోమ్ మింట్, స్పేస్ గ్రే కలర్ ఆప్షన్లలో ఈ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. అయితే త్వరలో మనదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

టెక్నో మెగాబుక్ టీ1 స్పెసిఫికేషన్లు
టెక్నో మెగాబుక్ టీ1 ల్యాప్‌టాప్‌లో 15.6 అంగుళాల స్క్రీన్‌ను అందించారు. టీయూవీ రెయిన్‌ల్యాండ్ ఐ కంఫర్ట్ సర్టిఫికేషన్, అడాప్టివ్ డీసీ డిమ్మింగ్ వంటి ఫీచర్లు కూడా అందించారు. 350 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌తో ఈ ల్యాప్‌టాప్ లాంచ్ అయింది.

12 జీబీ ర్యామ్, 16 జీబీ ర్యామ్ ఆప్షన్లతో టెక్నో మెగాబుక్ టీ1 మార్కెట్లోకి వచ్చింది. 512 జీబీ ఎస్ఎస్‌డీ, 1 టీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఆప్షన్లు కూడా ఈ ల్యాప్‌టాప్‌లో అందించారు. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం కూడా ఇందులో ఉంది. ముందువైపు వీడియో కాలింగ్ కోసం 2 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. 65W ఫాస్ట్ చార్జర్‌ను కూడా దీంతోపాటు అందించారు.

ఒక హెచ్‌డీఎంఐ పోర్టు, రెండు యూఎస్‌బీ 3.0 పోర్టులు, వైఫై 6, టీఎఫ్ కార్డ్ రీడర్, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి. దీని మందం 1.48 సెంటీమీటర్లు కాగా, బరువు 1.48 కేజీలుగా ఉంది.

టెక్నో మనదేశంలో స్పార్క్ 9టీ అనే కొత్త స్మార్ట్ ఫోన్ ఇటీవలే లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న దీని ధరను రూ.9,799గా నిర్ణయించారు. టర్కోయిస్ సియాన్, అట్లాంటిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో టెక్నో స్పార్క్ 9టీని కొనుగోలు చేయవచ్చు.

ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ357 ప్రాసెసర్ కూడా ఇందులో అందించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు. స్టోరేజ్‌లో నుంచి 3 జీబీని వర్చువల్ ర్యామ్‌గా ఉపయోగించుకోవచ్చు. అంటే 7 జీబీ వరకు ర్యామ్ ఉండనుంది.

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఏఐ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 4జీ, వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్లను కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.88 సెంటీమీటర్లుగా ఉంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

టాప్ హెడ్ లైన్స్

Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
Embed widget