Acer Swift Edge: ఏసర్ సూపర్ ల్యాప్‌టాప్ లాంచ్ - ఏకంగా యాపిల్‌తో పోటీ పడే ఫీచర్లు!
ఏసర్ స్విఫ్ట్ ఎడ్జ్ ల్యాప్‌టాప్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇది ఏకంగా యాపిల్ ల్యాప్‌టాప్‌లతో పోటీ పడనుంది.

ఏసర్ స్విఫ్ట్ ఎడ్జ్ ల్యాప్‌టాప్ గురువారం మనదేశంలో లాంచ్ అయింది. ప్రపంచంలోనే అత్యంత తేలికైన 16 అంగుళాల ఓఎల్ఈడీ ల్యాప్‌టాప్ ఇదే అని కంపెనీ అంటోంది. అల్యూమినియం అలోయ్‌తో ఈ ల్యాప్‌టాప్‌ను రూపొందించారు. ఇది సాధారణ ల్యాప్‌టాప్ కంటే 20 శాతం తేలికగానూ, రెగ్యులర్ అల్యూమినియం కంటే రెండు రెట్లు బలంగానూ ఉంటుంది. దీని మందం 12.95 మిల్లీమీటర్లు కాగా, బరువు 1.17 కేజీలు మాత్రమే అని కంపెనీ అంటోంది. ఆక్టాకోర్ రైజెన్ 7 6800యూ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 13 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రోతో ఈ ల్యాప్ పోటీ పడనుంది.
ఏసర్ స్విఫ్ట్ ఎడ్జ్ ధర, ఆఫర్లు
దీని ధరను మనదేశంలో రూ.1,24,999గా నిర్ణయించారు. 16 జీబీ ర్యామ్ + 1 టీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఇందులో అందించారు. ఏసర్ ఇండియా స్టోర్, అమెజాన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. త్వరలో దీని సేల్ ప్రారంభం కానుంది. ఒలివైన్ బ్లాక్ కలర్ ఆప్షన్ మాత్రమే ఇందులో అందుబాటులో ఉంది.
ఏసర్ స్విఫ్ట్ ఎడ్జ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 16 అంగుళాల 4కే ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని పీక్ బ్రైట్‌నెట్ 400 నిట్స్‌గా ఉంది. ఆక్టాకోర్ ఏఎండీ రైజెన్ 7 6800యూ ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్ పని చేయనుంది. దీని బేస్ క్లాక్ స్పీడ్ 2.7 గిగాహెర్ట్జ్ కాగా, టర్బో క్లాక్ స్పీడ్ 4.7 గిగాహెర్ట్జ్‌గా ఉంది. ఇంటిగ్రేటెడ్ ఏఎండీ రేడియోన్ గ్రాఫిక్స్ కూడా ఇందులో ఉన్నాయి. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1 టీబీ పీసీఐఈ జెన్ 4 ఎన్వీఎంఈ ఎస్ఎస్‌డీ స్టోరేజ్‌లను అందించారు.
పవర్ బటన్‌లో సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫుల్ హెచ్‌డీ వెబ్‌క్యామ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లను ఇందులో అందించారు. టెంపోరల్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ కూడా ఈ ల్యాప్‌టాప్‌లో ఉంది. లో లైట్ కండీషన్స్‌లో కూడా మంచి ఇమేజ్ క్వాలిటీని ఇది అందించనుంది. మల్టీ-టచ్ టచ్ ప్యాడ్, బ్యాక్ లిట్ కీబోర్డు, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ సపోర్ట్ కూడా అందించారు.
దీని మందం 1.29 సెంటీమీటర్లు కాగా, బరువు 1.17 కేజీలుగా ఉంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, యూఎస్‌బీ 3.2 జెన్ 1 పోర్టు, పవర్ ఆఫ్ చార్జింగ్ సపోర్ట్, యూఎస్‌బీ 3.2 పోర్టు అందించారు. వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2 కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. 65W యూఎస్‌బీ టైప్-సీ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేసే 54Whr బ్యాటరీ ఇందులో ఉంది. 64 బిట్ విండోస్ 11 హోం, సర్టిఫైడ్ విండోస్ సెక్యూర్డ్ కోర్ పీసీ ఇందులో ఉంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

