Jio Plan Hike: బ్యాడ్‌న్యూస్ - రెండు బడ్జెట్ ప్లాన్ల ధరను పెంచిన జియో!
ప్రముఖ టెలికాం నెట్‌వర్క్ జియో తన జియోఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరను పెంచింది.
జియో తన జియోఫోన్ రూ.749 ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచాక ఇప్పుడు రూ.155, రూ.185 ప్లాన్ల ధరను కూడా పెంచింది. ఈ రెండు ప్లాన్ల ధరలూ రూ.30కి పైగా పెరిగాయి. జియోఫోన్‌కు అందుబాటులో ఉన్న చవకైన ప్లాన్లలో ఈ రెండూ ఉన్నాయి.
జియో ఫోన్ రూ.155 ప్లాన్ ఎంత పెరిగింది? దాని లాభాలేంటి?
జియోఫోన్ రూ.155 ప్లాన్ ధరను రూ.186కు పెంచారు. అంటే దీని ధర రూ.31 పెరిగిందన్న మాట. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ప్రతిరోజూ 1 జీబీ 4జీ డేటా లభించనుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, మొత్తంగా 50 ఎస్ఎంఎస్ కూడా లభించనున్నాయి. దీంతోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌లకు కూడా యాక్సెస్ లభించనుంది.
జియో ఫోన్ రూ.185 ప్లాన్ ఎంత పెరిగింది? దాని లాభాలేంటి?
ఇక జియోఫోన్ రూ.185 ప్లాన్ ధర రూ.222కు పెరిగింది. అంటే దీని ధరను ఏకంగా రూ.37 పెంచారన్న మాట. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 28 రోజులే. అయితే రోజుకు 2 జీబీ అన్‌లిమిటెడ్ డేటా ఈ ప్లాన్ ద్వారా లభించనుంది. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ వంటి లాభాలు కూడా ఈ ప్లాన్‌తో లభించనున్నాయి. ఇక మిగతా లాభాలన్నీ పై ప్లాన్ తరహాలోనే ఉన్నాయి.
జియో రూ.749 ప్లాన్ ధర పెంపు, దాని లాభాలు
ఈ ప్లాన్ ధరను జియో రూ.150 పెంచింది. అంటే ఇప్పుడు దీనికి రూ.899 పెట్టాల్సిందే. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులుగా ఉండనుంది. నెలకు 2 జీబీ చొప్పున మొత్తంగా 24 జీబీ హై స్పీడ్ డేటాను జియో రూ.849 ప్లాన్ ద్వారా అందించనున్నారు. ఈ డేటాను అయిపోయాక నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోనుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతి 28 రోజులకు 50 ఎస్ఎంఎస్‌లు కూడా లభించనున్నాయి. జియో టీవీ, జియో సినిమా, జియోన్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి యాప్స్‌కు ఉచితంగా యాక్సెస్ లభించనుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram