News
News
వీడియోలు ఆటలు
X

Jio Cinema Premium Plans: ముందు ఫ్రీ, తర్వాత ప్లాన్లు - అదే మ్యాజిక్కు - రూ.2 నుంచి జియో సినిమా ప్రీమియం ప్లాన్!

జియో సినిమా తన ప్రీమియం ప్లాన్లను త్వరలో లాంచ్ చేయనుంది. ఈ ప్లాన్లు రూ.2 నుంచి ప్రారంభం కానున్నాయి.

FOLLOW US: 
Share:

Jio Cinema Premium Plans: ప్రస్తుతం జియో సినిమా యాప్‌కు ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ లేదు. ఐపీఎల్‌ను కూడా జియో సినిమా ఉచితంగా స్ట్రీమ్ చేస్తుంది. కేవలం జియోనే కాకుండా ఏ సిమ్ ద్వారా అయినా ఐపీఎల్‌ను స్ట్రీమ్ చేయవచ్చు. అయితే ఈ ఫ్రీ స్ట్రీమింగ్ మరిన్ని రోజులు ఉండబోదు. త్వరలో జియో ప్రీమియం ప్లాన్లను తీసుకురానుంది. దీనికి సంబంధించిన టెస్టింగ్ వెబ్‌సైట్ కూడా ఇప్పటికే లైవ్ అయింది.

ప్లాన్లు ఎలా ఉన్నాయి?
ప్రస్తుతానికి మూడు ప్లాన్లను ఇందులో లిస్ట్ చేశారు. వీటిలో అత్యంత చవకైనది అందరినీ ఆకర్షించేది డైలీ ప్లాన్. రోజుకు రూ.2 చెల్లించి ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనికి డైలీ ప్లాన్ అని పేరు పెట్టారు. దీని వ్యాలిడిటీ ఒక్క రోజు మాత్రమే. రెండు డివైస్‌ల్లో కంటెంట్‌ను స్ట్రీమ్ చేయవచ్చు.

ఇక రెండోది వచ్చి గోల్డ్ ప్లాన్. దీని వ్యాలిడిటీ మూడు నెలలుగా ఉంది. రూ.99తో దీన్ని కొనుగోలు చేయవచ్చు. డైలీ ప్లాన్ తరహాలోనే రెండు డివైస్‌ల్లో కంటెంట్‌ను స్ట్రీమ్ చేసే అవకాశం ఉంది. అయితే కంటెంట్ స్ట్రీమ్ ఎస్‌డీలోనా, హెచ్‌డీలోనా, 4కేలోనా అనేది తెలియరాలేదు.

దీంతో పాటు మూడో ప్లాటినం ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. దీని ధరను రూ.599గా నిర్ణయించారు. ఇది వార్షిక ప్లాన్. 12 నెలల పాటు దీని వ్యాలిడిటీ ఉండనుంది. ఈ ప్లాన్ డిస్క్రిప్షన్‌లో ‘యాడ్ ఫ్రీ’ అని పేర్కొన్నారు. అంటే పైన ఉన్న రెండు ప్లాన్లలో యాడ్లు వస్తాయి అనుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా కంటెంట్‌ను నాలుగు డివైస్‌ల్లో ఒకేసారి స్ట్రీమ్ కానుంది.

అయితే వీటి అసలు ధరలు వేరే అని, ఇవి ఆఫర్ ధరలు అని జియో అంటుంది. డైలీ ప్లాన్ అసలు ధర రూ.29 కాగా, ఆఫర్ కింద రూ.2కే అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గోల్డ్ ప్లాన్ అసలు ధర రూ.299 కాగా దీన్ని రూ.99కే అందిస్తున్నారు. ఇక ప్లాటినం ప్లాన్ అసలు ధర రూ.1,199 కాగా దీన్ని రూ.599కే అందిస్తున్నారు. అయితే ప్రారంభ ఆఫర్ కింద తక్కువ ధరకు అందిస్తున్నారా లేకపోతే ఈ ధరలను చాలా కాలం పాటు కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఇటీవలే మూడు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లతో రీచార్జ్ చేసుకున్న యూజర్లకు కంపెనీ అదనపు డేటాను కూడా అందిస్తోంది. రూ. 999 ప్లాన్‌ ద్వారా వినియోగదారులకు 40 జీబీ అదనపు డేటాను ఉచితంగా అందజేస్తున్నారు. చాలా మంది మొబైల్ ఫోన్‌లలో మ్యాచ్‌ని ఆస్వాదిస్తున్నందున జియో ఈ ప్లాన్‌లను IPLకి ముందే ప్రారంభించింది. ఐపీఎల్ 2023 సీజన్ జియో సినిమాలో మాత్రమే స్ట్రీమ్ కానుంది. కాబట్టి జియో ఈ కొత్త ప్లాన్స్ లాంచ్ చేసింది.

IPL సీజన్ 16 మొదటి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మార్చి 31వ తేదీన జరుగుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఐపీఎల్‌కి ముందు జియో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మూడు కొత్త క్రికెట్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఇందులో ప్రతిరోజూ 3 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. కంపెనీ రూ. 999, రూ. 399, రూ. 219 యొక్క 3 ప్లాన్‌లను ప్రారంభించింది. రూ. 999 ప్లాన్‌లో కస్టమర్‌లు 84 రోజుల పాటు ప్రతిరోజూ 3 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. ఇది కాకుండా ఈ ప్లాన్‌లో కంపెనీ రూ. 241 డేటా వోచర్‌ను కూడా ఉచితంగా ఇస్తోంది. దీని కింద కస్టమర్లు అదనంగా 40 జీబీ డేటాను ఉచితంగా పొందుతారు.

జియో రూ. 399, రూ. 219 ప్లాన్‌లలో కూడా కస్టమర్‌లు ప్రతిరోజూ 3 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. అయితే రెండు ప్లాన్‌ల వ్యాలిడిటీ వేర్వేరుగా ఉంటుంది. రూ. 399 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీనిలో మీరు కంపెనీ నుంచి ఉచితంగా రూ. 61 డేటా వోచర్‌ను పొందుతారు. దీని కింద మీకు 6 జీబీ డేటా అందించనున్నారు. అదే సమయంలో రూ. 219 ప్లాన్‌లో కంపెనీ 2 జీబీ అదనపు డేటాను ఇస్తుంది. దీని వ్యాలిడిటీ 14 రోజులుగా ఉంది.

Published at : 24 Apr 2023 06:45 PM (IST) Tags: Jio Cinema Premium Subscription Plans Jio Cinema Premium Jio Cinema Premium Plans Jio Cinema Plans Jio Voot

సంబంధిత కథనాలు

Whatsapp New Feature: ఇకపై వాట్సాప్ లో హై క్వాలిటీ ఫోటోలను పంపుకోవచ్చు - కానీ, ఒక కండీషన్!

Whatsapp New Feature: ఇకపై వాట్సాప్ లో హై క్వాలిటీ ఫోటోలను పంపుకోవచ్చు - కానీ, ఒక కండీషన్!

Malware Removal Tool: మీ సెల్ ఫోన్‌లోకి మాల్వేర్ చేరిందా? ఈ ఫ్రీ టూల్‌తో ఈజీగా రిమూవ్ చేసుకోండి!

Malware Removal Tool: మీ సెల్ ఫోన్‌లోకి మాల్వేర్ చేరిందా? ఈ ఫ్రీ టూల్‌తో ఈజీగా రిమూవ్ చేసుకోండి!

Realme 11 Pro+: రూ.24 వేల లోపే 200 మెగాపిక్సెల్ కెమెరా లాంచ్ చేసిన రియల్‌మీ - ప్రారంభ ఆఫర్లు అదుర్స్!

Realme 11 Pro+: రూ.24 వేల లోపే 200 మెగాపిక్సెల్ కెమెరా లాంచ్ చేసిన రియల్‌మీ - ప్రారంభ ఆఫర్లు అదుర్స్!

Facebook: ఇండియాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ వెరిఫికేషన్ షురూ - నెలకు ఎంత కట్టాలంటే?

Facebook: ఇండియాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ వెరిఫికేషన్ షురూ - నెలకు ఎంత కట్టాలంటే?

Realme 11 Pro: 100 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - ధర రూ.20 వేలలోనే!

Realme 11 Pro: 100 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - ధర రూ.20 వేలలోనే!

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్