వర్షంలో ఫోన్ మాట్లాడితే పిడుగు పడి చనిపోతారా? - నిపుణులు ఏం అంటున్నారు?
మెరుపులు, ఉరుములు వచ్చేటప్పుడు మొబైల్‌లో మాట్లాడవచ్చా?
ఇప్పుడు మొబైల్ ఫోన్లు మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్నా ఫోన్లు మాట్లాడేవారు కొందరు ఉంటారు. అయితే ఇలా వర్షం సమయంలో పిడుగులు పడితే పిడుగులు మన మీద పడే అవకాశం ఉందని కొన్ని చోట్ల కనిపిస్తుంది. మరి ఇది నిజమేనా? నిపుణులు ఏం అంటున్నారు?
దీనిపై లైట్‌నింగ్ సేఫ్టీ స్పెషలిస్ట్ జాన్ జెన్సెనియస్ స్పందించారు. ఒకవేళ ఎవరైనా సెల్‌ఫోన్ కారణంగా పిడుగు పడి చనిపోతే చేతిలో ఉన్న మొబైల్ కరిగిపోవడమో, కాలిపోవడమో అవుతుందన్నారు. దీనికి ప్రజలందరూ సెల్ ఫోన్‌ని నిందిస్తారని, కానీ అలా ఏమీ ఉండదని తెలిపారు.
వర్షాల సమయంలో ల్యాండ్ లైన్ వాడితే పిడుగుల ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే దీనికి కనెక్షన్ బయట నుంచి వస్తుంది కాబట్టి పిడుగులు వైర్ల నుంచి మాట్లాడే వ్యక్తిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కానీ సెల్ ఫోన్ కారణంగా ఈ ప్రమాదం ఉండదు.
‘ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెరుపులను, పిడుగులను ఏవీ ఆకర్షించలేవు. కానీ మెరుపులు వైర్లను, కంచెలను ఫాలో అవుతాయి. సెల్ ఫోన్‌లో మాట్లాడని వ్యక్తి మీద పిడుగు పడటానికి ఎంత ప్రమాదం ఉందో, మాట్లాడే వ్యక్తి మీద పిడుగు పడటానికి కూడా అంతే అవకాశం ఉంది.’ అని జాన్ అన్నారు. అయితే మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం పడేటప్పుడు కారు లేదా బిల్డింగ్ లాంటి క్లోజ్డ్ షెల్టర్‌లోకి వెళ్లడం మంచిది.
మరోవైపు టెలిగ్రాంలో ఇటీవలే స్టోరీ ఫీచర్‌ను అందించడంపై కంపెనీ పనిచేస్తుందని కంపెనీ కొంతకాలం క్రితం తెలియజేసింది. ఇప్పుడు కంపెనీ ఈ అప్‌డేట్‌ను రోల్అవుట్ చేయడం కూడా మొదలు పెట్టింది. ప్రస్తుతానికి టెలిగ్రామ్ ప్రీమియం మెంబర్‌షిప్ తీసుకున్న వారికి మాత్రమే ఈ స్టోరీ ఫీచర్ అందుబాటులో ఉంది.
అయితే ఫ్రీ యూజర్లకు ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. టెలిగ్రామ్‌లో కనిపించే స్టోరీ ఫీచర్‌లోని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మీరు కథను 6,12, 24, 48 గంటలు కనిపించేలా సెట్ చేయవచ్చు. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కేవలం 24 గంటలు మాత్రమే స్టోరీని షేర్ చేసే అవకాశాన్ని ఇస్తాయి. అయితే మీరు టెలిగ్రామ్‌లో అంతకంటే ఎక్కువ సమయం పొందుతారు.
టెలిగ్రామ్‌లో అందుబాటులో ఉన్న స్టోరీ ఫీచర్ కింద, మీరు ప్రతి స్టోరీకి స్పెషల్ కాంటాక్ట్ లిస్ట్‌ను సెటప్ చేయవచ్చు. అయితే మీరు స్టోరీ పోస్ట్ చేస్తే దాన్ని ఎవరైనా చూడగలరు కానీ ప్రీమియం ప్లాన్‌ని కొనుగోలు చేసిన వారు మాత్రమే స్టోరీని పోస్ట్ చేయగలరు.
టెలిగ్రామ్ సీఈవో గత నెలలో మాట్లాడుతూ ఈ ఫీచర్ ఇప్పటికే అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల్లో ఉన్నందున దీనిపై కంపెనీ మొదట ఆసక్తి చూపలేదన్నారు. కానీ వినియోగదారులు దానిని డిమాండ్ చేస్తున్నారని, దీని కారణంగా కంపెనీ ఈ ఫీచర్‌ను తీసుకురావలసి వచ్చిందని పేర్కొన్నారు. టెలిగ్రాం కొన్ని ప్రత్యేకమైన ఆప్షన్లతో వచ్చే ఈ అప్‌డేట్‌ను తీసుకువచ్చినట్లు తెలిపింది.
Read Also: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial