By: ABP Desam | Updated at : 08 Jul 2023 08:15 PM (IST)
ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్ వెబ్ వెర్షన్ అందుబాటులో లేదు. ( Image Source : Twitter )
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ 100కి పైగా దేశాల్లో థ్రెడ్స్ యాప్‌ను లాంచ్ చేశారు. ఈ యాప్ ఇప్పటికే 70 మిలియన్లకు పైగా యూజర్‌బేస్‌ను దాటేసింది. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ త్వరలో ఈ యాప్ బిలియన్ యూజర్‌బేస్‌ను దాటుతుందని తెలిపారు. అలాగే పాపులర్ యాప్‌ల్లో చేరుతుందని కూడా ఆశిస్తున్నారు.
థ్రెడ్స్ సరిగ్గా ట్విట్టర్ లాగానే పని చేస్తుంది. పోస్ట్, వీడియో షేర్, రీ పోస్ట్ వంటి ఆప్షన్లు కూడా ఉంటాయి. థ్రెడ్స్‌కు సంబంధించి ప్రస్తుతం యూజర్లలో అనేక సందేహాలు ఉన్నాయి. వాటిలో మొదటిది థ్రెడ్స్ యాప్‌నకు వెబ్ వెర్షన్ ఉందా? అంటే ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌ల్లో ట్విట్టర్‌ని యాక్సెస్ చేసినట్లు థ్రెడ్స్‌ను యాక్సెస్ చేయవచ్చా?
ప్రస్తుతానికి అస్సలు కుదరదు
ఇప్పటికి మీరు ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లో మాత్రమే మెటా థ్రెడ్స్‌ను యాక్సెస్ చేయగలరు. కంపెనీ ఇంకా దాని వెబ్ వెర్షన్‌ను విడుదల చేయలేదు. థ్రెడ్స్‌ను డౌన్‌లోడ్ చేయడానికి మీరు ఆండ్రాయిడ్‌లో అయితే ప్లే స్టోర్, ఐఫోన్‌లో అయితే యాప్ స్టోర్‌కు వెళ్లాలి. మీకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంటేనే మీరు థ్రెడ్స్‌లో లాగిన్ అవ్వగలరు. మీకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లేకపోతే ముందుగా క్రియేట్ చేసుకోవాలి. తర్వాత వారు మెటా థ్రెడ్స్ యాప్‌లో లాగిన్ చేయగలుగుతారు.
ఇన్‌స్టాగ్రామ్ కారణంగా థ్రెడ్స్ యాప్ యూజర్ బేస్ వేగంగా పెరుగుతూ ఉండవచ్చు. కానీ ట్విట్టర్‌లో ఉన్న కొన్ని బేసిక్ ఫీచర్లు థ్రెడ్స్‌లో లేవు. ఇందులో డీఎం అనే ఆప్షన్ లేదు. ట్విట్టర్‌లో వినియోగదారులు ‘స్పేసెస్’ ద్వారా వ్యక్తులతో కనెక్ట్ అవ్వగలరు. అయితే ఈ ఆప్షన్ ప్రస్తుతం థ్రెడ్స్‌లో కూడా అందుబాటులో లేదు. అంటే థ్రెడ్స్ ఇంకా చాలా డెవలప్ అవ్వాల్సి ఉంది. అప్పుడే అది ట్విట్టర్‌తో పోటీ పడగలదు.
Which one is your favorite now ?#Threads #threadapp #ThreadsApp #ElonMusk #MarkZuckerberg #ثريدز pic.twitter.com/RjSS51lqou
— Dr. Muhammad Rashid (@dr_rashid_malik) July 7, 2023
✨ Threads is here – a new app where you can share updates and join convos ✨
— Instagram (@instagram) July 5, 2023
Use your Instagram account to log in and get started 🎉 https://t.co/eEyTigO7WB pic.twitter.com/mCNsx33ZVg
Rolling out now in 100+ countries. Learn more 👇https://t.co/lA8G4QYS2h
— Instagram (@instagram) July 5, 2023
Read Also: ట్విట్టర్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ పొందిన మస్క్ ట్వీట్ - ఎంత రీచ్ వచ్చింది?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Big Billion Days Sale 2023: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - టాప్-10 డీల్స్ ఇవే!
Vivo Price Cut: రెండు ఫోన్ల ధరలు తగ్గించిన వివో - ఇప్పుడు రూ.12 వేల లోపుకే!
Itel P55: దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే 8 జీబీ + 128 జీబీ - ఐటెల్ పీ55 వచ్చేసింది!
Motorola Edge 40 Neo: రూ.20 వేలలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? - అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ ఇదే - సేల్ ప్రారంభం నేడే!
ChatGPT యూజర్లు ఇకపై AI చాట్‌బాట్‌తో మాట్లాడవచ్చు, ఎలాగో తెలుసా?
KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్ మీటింగ్ వచ్చే వారం !
TDP News : అధికార మత్తు వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్ చూశారా?
/body>