అన్వేషించండి

iQoo 9 Series Launched: ఐకూ అదిరిపోయే ఫోన్లు వచ్చేశాయ్ - మీరు మంచి కెమెరా ఫోన్లు కొనాలనుకుంటే ఇవే బెస్ట్!

వివో సబ్ బ్రాండ్ ఐకూ మనదేశంలో కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసింది. అవే ఐకూ 9, ఐకూ 9 ప్రో, ఐకూ 9 ఎస్ఈ.

ఐకూ 9 ప్రో, ఐకూ 9, ఐకూ 9 ఎస్ఈ స్మార్ట్ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. వీటిలో ఐకూ 9 ప్రో అత్యంత ప్రీమియం మోడల్ కాగా... ఇందులో హైఎండ్ స్సెసిఫికేషన్లు అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఐకూ 9లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888+, ఐకూ 9 ఎస్ఈలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌లు అందించారు.120 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేలు కూడా వీటిలో అందించారు.

ఐకూ 9 ప్రో ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.64,990 కాగా... 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,990గా నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. డార్క్ క్రూజ్, లెజెండ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఐకూ 9 ప్రోను ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా ప్రీ-ఆర్డర్ చేస్తే... రూ.6,000 ఫ్లాట్ డిస్కౌంట్, రూ.5,000 అదనపు ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ లభించనుంది. 

ఐకూ 9 ధర
ఇందులో కూడా రెండు వేరియంట్లే లాంచ్ అయ్యాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.42,990 కాగా... 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.46,990గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ-ఆర్డర్లు కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఆల్ఫా, లెజెండ్ కలర్ వేరియంట్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఐకూ 9ను ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా ప్రీ-ఆర్డర్ చేస్తే... రూ.4,000 ఫ్లాట్ డిస్కౌంట్, రూ.3,000 అదనపు ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ లభించనుంది. 

ఐకూ 9 ఎస్ఈ ధర
ఐకూ 9ఎస్ఈలో కూడా రెండు వేరియంట్లే లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.33,990 కాగా... 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,990గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ-ఆర్డర్లు మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. స్పేస్ ఫ్యూజన్, సన్‌సెట్ సియర్రా రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో ఈ మూడు ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఐకూ 9 ఎస్ఈని ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా ప్రీ-ఆర్డర్ చేస్తే... రూ.3,000 ఫ్లాట్ డిస్కౌంట్, రూ.3,000 అదనపు ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ లభించనుంది. 

ఐకూ 9 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.78 అంగుళాల 2కే ఈ5 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు.3డీ కర్వ్‌డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను కూడా ఇందులో అందించారు. ఇందులో లో టెంపరేచర్ పాలీ క్రిస్టలైన్ ఆక్సైడ్ (ఎల్టీపీవో) 2.0 టెక్నాలజీని అందించారు. అడాప్టివ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా ఇందులో అందించారు. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉంది. 120W ఫ్లాష్ చార్జ్, 50W వైర్‌లెస్ ఫ్లాష్‌చార్జ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ జీఎన్5 సెన్సార్‌ను అందించారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కోసం ‘గింబల్’ టెక్నాలజీని అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ ఫిష్ ఐ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 16 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

ఐకూ 9 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపైనే ఈ ఫోన్ కూడా పనిచేయనుంది. ఇందులో 6.56 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 10-బిట్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో అందించారు. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 888+ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4350 ఎంఏహెచ్‌గా ఉంది. 120W ఫ్లాష్ చార్జ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్598 సెన్సార్‌ను అందించారు. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 13 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను ఉంది.

ఐకూ 9 ఎస్ఈ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపైనే ఐకూ 9 ఎస్ఈ కూడా పనిచేయనుంది. ఇందులో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. 

దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 66W ఫ్లాష్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో అందించారు.

Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!

Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by iQOO India (@iqooind)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
YS Jagan Comments On Tirumala Stampede: తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్
తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్ 
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Infosys Tiger: ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP DesamTirupati Pilgrims Stampede 6died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
YS Jagan Comments On Tirumala Stampede: తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్
తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్ 
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Infosys Tiger: ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Tamil 8: చివరి దశకు వచ్చేసిన తమిళ బిగ్‌బాస్ - ఫైనల్ రేసులో ఎంత మంది ఉన్నారు? ప్రైజ్ మనీ ఎంత?
చివరి దశకు వచ్చేసిన తమిళ బిగ్‌బాస్ - ఫైనల్ రేసులో ఎంత మంది ఉన్నారు? ప్రైజ్ మనీ ఎంత?
Mudragada: చంద్రబాబు గారండీ.. మా జగన్ వస్తే ఊరుకోడండీ..- ఇట్లు  పాత మిత్రుడు ముద్రగడ పద్మనాభరెడ్డి
చంద్రబాబు గారండీ.. మా జగన్ వస్తే ఊరుకోడండీ..- ఇట్లు  పాత మిత్రుడు ముద్రగడ పద్మనాభరెడ్డి
Divorce Proceedings in India : డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
Embed widget