By: ABP Desam | Updated at : 03 Apr 2023 04:21 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Pixabay
టెక్ విశ్లేషకుడు జెఫ్ రీసెర్చ్ ప్రకారం, రాబోయే ఐఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ ఖర్చు చేయకుండా కొత్త ఐఫోన్ కొనాలి అనుకునే వారికి ఐఫోన్ 15 సిరీస్ నిరాశ కలిగించే అవకాశం ఉంటుంది. అయితే, Apple వచ్చే ఏడాది iPhone SE 4ని కూడా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఖర్చు లేకుండా అప్‌గ్రేడ్ చేయాలనుకునే Apple అభిమానులకు ఈ ఫోన్ బెస్ట్ ఎంపికగా చెప్పుకోవచ్చు.
ఐఫోన్ 15 సిరీస్ కంటే తక్కువ ధరలో iPhone SE 4
iPhone SE 4 2024లో ఆవిష్కరించబడే అవకాశం ఉన్నది. ఐఫోన్ SE ప్రీమియం ఐఫోన్ 15 సిరీస్ కంటే తక్కువ ధరకు విడుదల చేయబడుతుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దాని ముందున్న iPhone SE 2022 లాగానే, రాబోయే iPhone SE 4 రాబోయే Google Pixel 7aకి పోటీగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు, యాపిల్ iPhone SE 4 అనేక అప్ గ్రేడ్‌లతో వచ్చే అవకాశం ఉంది. ఇప్పుటికే ఈ ఫోన్ కు సంబంధించి బయటకు వచ్చిన లీక్ లు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
సైలెంట్ స్విచ్ ప్లేస్ లో 'యాక్షన్ బటన్'
అటు ఆపిల్ రాబోయే ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడళ్లతో సైలెంట్ స్విచ్‌కు గుడ్ బైడ్ చెప్పే అవకాశం ఉంది. ఐఫోన్ 15 ప్రో మోడల్‌లు రెండూ కస్టమైజ్ చేయదగిన 'యాక్షన్ బటన్'తో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఆపిల్ వాచ్ అల్ట్రాలో చూసినట్లు మాక్ రూమర్స్ ఇటీవల ఓ నివేదికలో పేర్కొంది. 2007 నుండి ప్రతి iPhone మోడల్‌లో ఏర్పాటు చేసిన రింగ్/సైలెంట్ స్విచ్‌ని యాక్షన్ బటన్ భర్తీ చేస్తుందని Mac Rumors నివేదిక తెలిపింది. యాపిల్ iPhone 15 Pro మోడల్ వినియోగదారులు ఆన్ చేయడం లాంటి పనులను యాక్షన్ బటన్‌ను చేస్తుందని వివరించింది. ఫ్లాష్ లైట్, లాక్ రొటేషన్, హోమ్ స్క్రీన్ డిస్ ప్లే, నోటిఫికేషన్ సెంటర్ ఓపెన్, కంట్రోల్ సెంటర్ ఓపెన్ను, డోంట్ డిస్టర్బ్, స్క్రీన్ షాట్, స్క్రీన్ రికార్డింగ్, లో పవర్ మోడ్, మాగ్నిఫైయర్ సహా ఇతర పనులను కూడా ఈ బటన్ నిర్వర్తించనుంది.
iPhone SE 4 పరిస్థితి ఏంటి?
9to5Mac మునుపటి నివేదిక ప్రకారం, గత సంవత్సరం అందుబాటులోకి వచ్చిన ఐఫోన్ 14 ప్రోతో పోల్చినప్పుడు iPhone 15 ప్రోలో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉండబోతున్నాయి. అత్యంత కీలకమైన మార్పు USB-C ఛార్జింగ్ పోర్ట్ తో యాపిల్ లైట్నింగ్ పోర్ట్ ను మార్చుకోవడం. ప్రస్తుత మోడల్ మాదిరిగానే, USB-C పోర్ట్ దిగువన, ఫైరింగ్ స్పీకర్ పక్కన, రెండర్ ప్రకారం ఉంచబడనుంది. 'యాక్షన్ బటన్' ఇందులో వస్తుందో రాదో తెలియదు. ఐఫోన్ 15 డిస్‌ప్లేను తయారు చేయడంలో కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేకపోయినందున ఆపిల్ ఇటీవల చైనీస్ డిస్‌ప్లే మేకింగ్ దిగ్గజం బీజింగ్ ఓరియంటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఆర్డర్‌లను ఉపసంహరించుకుంది. చైనా BOE చేసిన డిస్‌ప్లేలు నాణ్యత అవసరాలను తీర్చలేదు, దీని కారణంగా శామ్‌సంగ్‌పై ఆధారపడటాన్ని తగ్గించే ఆపిల్ప్రణాళిక ప్రస్తుతానికి పని చేయదని వెల్లడించింది. యాపిల్ కంపెనీ iPhone, iPad, ఇతర Apple పరికరాలను తయారు చేసే వివిధ సరఫరాదారులను కలిగి ఉంది. మరింత అధునాతన సాంకేతికత అవసరమయ్యే హై-ఎండ్ డిస్‌ప్లేలు శామ్ సంగ్ ద్వారా ఉత్పత్తి చేయబడుతున్నాయి.
Read Also: ఇకపై మీ చాట్ లాక్ చేసుకోవచ్చు, వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్
ChatGPT యూజర్లు ఇకపై AI చాట్‌బాట్‌తో మాట్లాడవచ్చు, ఎలాగో తెలుసా?
Google Pixel 8 Series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర, ఫీచర్లు లీక్ - ఐఫోన్లకు పోటీనిచ్చే కెమెరాలు!
WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!
WiFi Connection: ఇంట్లో వైఫై పెట్టిస్తున్నారా? - ఎంత స్పీడ్ అయితే బెస్ట్!
iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్‌కోట్ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి
/body>