By: ABP Desam | Updated at : 18 Mar 2022 07:23 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
ఐఫోన్ ఎస్ఈ 2022 సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. (Image Credits: Apple)
యాపిల్ ఇటీవలే తన కొత్త ఐఫోన్ ఎస్ఈని మనదేశంలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 5జీ కనెక్టివిటీని అందించారు. ప్రస్తుతం యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ ఇదే. ఐఫోన్ 13 సిరీస్‌లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఐఫోన్ ఎస్ఈ (2022) ధర
ఈ స్మార్ట్ ఫోన్ ధరను మనదేశంలో రూ.43,900గా నిర్ణయించారు. ఇది 64 జీబీ వేరియంట్ ధర. ఇందులో 128 జీబీ వేరియంట్ ధరను రూ.48,900గానూ, 256 జీబీ వేరియంట్ ధరను రూ.58,900గానూ నిర్ణయించారు. మిడ్‌నైట్, స్టార్‌లైట్, (ప్రొడక్ట్) రెడ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ ఎస్ఈ (2022) స్పెసిఫికేషన్లు
ఐఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై యాపిల్ ఐఫోన్ ఎస్ఈ (2022) పనిచేయనుంది. ఇందులో 4.7 అంగుళాల రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే చూడటానికి గతంలో లాంచ్ అయిన ఐఫోన్ ఎస్ఈ తరహాలోనే ఉంది. అయితే ఫోన్ ముందువైపు, వెనకవైపు అత్యంత కఠినమైన గ్లాస్‌ను అందించినట్లు యాపిల్ ప్రకటించింది. ఐపోన్ 13, ఐఫోన్ 13 ప్రోల్లో అందించిన గ్లాస్ ప్రొటెక్షన్‌ను యాపిల్ ఇందులో కూడా అందించింది.
ఐఫోన్ 13 సిరీస్‌లో అందించిన ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌పై ఈ మొబైల్ పనిచేయనుంది. ఈ చిప్ ద్వారా ఐఫోన్ 8 కంటే 1.8 రెట్లు వేగంగా ఈ ఫోన్ పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది. గతంలో లాంచ్ అయిన ఐఫోన్ ఎస్ఈ తరహాలోనే ఇందులో కూడా వెనకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. అయితే ఇందులో మెరుగైన విజువల్ ప్రాసెసింగ్‌ను అందించినట్లు కంపెనీ తెలిపింది. వెనకవైపు కెమెరా డీప్ ఫ్యూజన్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ఇది 4కే వీడియో రికార్డింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. 60 ఎఫ్‌పీఎస్, స్మార్ట్ హెచ్‌డీఆర్4 వద్ద 4కే వీడియోను రికార్డ్ చేయవచ్చు.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు ఫేస్‌టైం హెచ్‌డీ కెమెరాను అందించారు. 5జీ, 4జీ వోల్టే, వైఫై 5, బ్లూటూత్ వీ5, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, లైటెనింగ్ పోర్టు ఇందులో ఉండనున్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్, గైరో స్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఇందులో ఉండనున్నాయి.
ఇందులో టచ్ ఐడీని అందించారు. ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే రోజంతా చార్జింగ్ వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇది కీ స్టాండర్డ్ బేస్డ్ వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉందని కంపెనీ తెలిపింది.
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?
Airtel Network Issue: ఎయిర్టెల్ వినియోగదారులకు నెట్వర్క్ సమస్యలు - మొబైల్ డేటా కూడా పనిచేయడం లేదట!
JioFi Postpaid Plans: జియోఫై కొత్త ప్లాన్లు వచ్చేశాయ్ - రూ.250లోపే 150 ఎంబీపీఎస్ స్పీడ్!
BSNL 5GB Daily Data Plan: రోజుకు 5 జీబీ డేటా అందించే బీఎస్ఎన్ ప్లాన్ - రూ.600 లోపే - 84 రోజుల వ్యాలిడిటీ!
Oppo A57 2022: రూ.13 వేలలోపే ఒప్పో కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?
Boat Wave Neo: రూ.1,800లోపే అదిరిపోయే స్మార్ట్ వాచ్ - లాంచ్ చేసిన భారతీయ బ్రాండ్!
Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం
Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?
IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్ బట్లర్ ఫెయిల్యూర్! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!
IAS Couple Dog : ఇప్పుడు ఆ కుక్కను ఎవరు తీసుకెళ్తారు ? బదిలీ అయిన ఐఏఎస్ జంటపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు