iPhone 17 series Price Leak: సెప్టెంబర్ 9న లాంఛ్ కానున్న ఐఫోన్ 17 సిరీస్.. ధరలు, అప్‌గ్రేడ్ ఫీచర్లు లీక్
iphone 17 Series Price and Features | ఐఫోన్ 17 సిరీస్ విడుదల తేదీ దగ్గర పడుతున్నకొద్దీ ఫోన్ల ధరలు, ఫీచర్లు లీక్ అవుతున్నాయి. ఐఫోన్ కొత్త మోడల్ లీకైన ధరల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

Apple iPhone 17 Launch Date and Time | యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ కొత్త సిరీస్ విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, దాని గురించి కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజా రిపోర్ట్ ప్రకారం ఐఫోన్ 17 సిరీస్ ధరలు లీక్ అయ్యాయి. సెప్టెంబర్ 9న విడుదల కానున్న కొత్త ఐఫోన్ 17 లైనప్ మోడల్స్ కొనడానికి ఎంత చెల్లించాలో లీక్ సమాచారం ద్వారా తెలుసుకోవచ్చు. ఈసారి Apple తన ఫ్లాగ్‌షిప్ సిరీస్ ధరలను పెంచనుందా లేదా అనేది ఈ వివరాలను చూస్తే అర్థమవుతుంది.
ఐఫోన్ 17 ధర ఎంత ఉండవచ్చు
TrendForce నివేదిక ప్రకారం iPhone 17 ధరలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. ఈ ఫోన్ 128GB వేరియంట్ 799 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.70,400)తో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని 256GB స్టోరేజీ వేరియంట్ ధర 899 డాలర్లు (సుమారు రూ. 79,200 ), 512GB వేరియంట్ ధర 1,099 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు ధర.96,800) చెల్లించాల్సి ఉంటుంది.
మిగతా మోడల్స్ మరింత ఖరీదైనవి..
ఆ నివేదిక ప్రకారం, స్టాండర్డ్ మోడల్‌ను మినహాయిస్తే iPhone 17 Air (ఐఫోన్ 17 ఎయిర్), ఐఫోన్ 17 Pro, ఐఫోన్ 17 Pro Max ధరలు 50-100 అమెరికన్ డాలర్లు మేరకు పెరిగే అవకాశం ఉంది. లీకైనస సమాచారం ప్రకారం iPhone 17 Air 256GB బేస్ వేరియంట్ ధర 1,099 డాలర్లు (సుమారు రూ. 96,800 ) ఉండవచ్చు. iPhone 17 Pro ప్రారంభ ధర 1199 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 1,05,600), ఐఫోన్ 17 ప్రో మాక్స్ ప్రారంభ ధర 1299 డాలర్లు (భారత కరెన్సీలో ధర. రూ.1,14,500)గా అంచనా వేశారు. ఈ ధరలన్నీ అమెరికా మార్కెట్‌కు సంబంధించినవని, భారత మార్కెట్లో ఏ ధరలకు అందుబాటులోకి వస్తాయో మరో నాలుగు రోజుల్లో తెలియనుంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
iPhone 17 సిరీస్‌లో పలు అప్‌గ్రేడ్‌లు
సెప్టెంబర్ 9న విడుదల కానున్న ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లలో అనేక అప్‌గ్రేడ్‌లు ఉండనున్నాయి. ఈ సిరీస్‌లోని అన్ని మోడల్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తాయి. వీటిలో కంపెనీ తాజా A19 సిరీస్ చిప్‌సెట్‌లను ఇస్తున్నారు. మరోవైపు ఐఫోన్ 17 ప్రో మోడల్ వెనుక డిజైన్‌లో మార్పులు ఉండనున్నాయి. కంపెనీ మొదటిసారిగా తన ఐఫోన్ ఫ్రంట్ కెమెరా 24MP ని మార్కెట్లోకి తీసుకొస్తుంది.






















