News
News
X

iPhone: సిమ్‌కార్డు స్లాట్ లేకుండానే ఐఫోన్లు.. ఎప్పుడు రానున్నాయి? ఎలా ఉపయోగించాలి?

టెక్ దిగ్గజం యాపిల్ 2023లో లాంచ్ చేయనున్న ఐఫోన్ 15 సిరీస్‌లో సిమ్ కార్డు స్లాట్ ఉండబోదని తెలుస్తోంది.

FOLLOW US: 

యాపిల్ ఇటీవలే ఐఫోన్ 13 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. 2022లో ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ కానుంది. ఐఫోన్ 14 సిరీస్ కూడా లాంచ్ కాకముందే ఐఫోన్ 15 గురించిన లీకులు కూడా వస్తున్నాయి.

ఐఫోన్ 15 సిరీస్‌లో సిమ్ కార్డు స్లాట్ గురించి ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తుంది. ఇందులో ఫిజికల్ సిమ్ కార్డు వేసుకునే అవకాశం లేకుండా.. స్లాట్‌ను పూర్తిగా తీసేయనున్నట్లు తెలుస్తోంది. అంటే ఇందులో ఈ-సిమ్ ఉపయోగించడం తప్ప వేరే ఆప్షన్ లేదన్న మాట. ఒకవేళ ఇదే నిజమైతే అసలు సిమ్ కార్డు స్లాట్ లేని ఐఫోన్లను మనం 2023లో చూడవచ్చు.

ఈ విషయాన్ని పోర్చుగల్‌కు చెందిన ఒక బ్లాగ్ ముందుగా తెలిపింది. ఈ కథనాన్ని బట్టి ఐఫోన్ 15 ప్రో మోడళ్లలో డ్యూయల్ ఈ-సిమ్ సపోర్ట్ ఉండనుంది. అంటే సిమ్ కార్డు స్లాట్ లేకపోయినా.. రెండు సిమ్‌లను ఈ ఫోన్లలో ఉపయోగించవచ్చన్న మాట. ఐఫోన్ 15 ప్రో మోడళ్లలో డ్యూయల్ ఈ-సిమ్ సపోర్ట్‌ను అందించినప్పటికీ.. సాధారణ మోడళ్లకు ఈ ఫీచర్ వస్తుందో రాదో చూడాల్సి ఉంది.

భవిష్యత్తులో ఐఫోన్లు ఎలా ఉండనున్నాయి?
అసలు ఒక్క పోర్టు కూడా లేని ఫోన్‌ను రూపొందించడానికి యాపిల్ ప్రయత్నిస్తుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ యాపిల్ ఫిజికల్ సిమ్ కార్డు స్లాట్‌ను తీసేయడానికి ప్లాన్ చేస్తే.. 2023లో వచ్చే ఐఫోన్లలో చార్జింగ్ పోర్టు ఉంటుందో లేదో చూడాలి.

అన్ని స్మార్ట్ ఫోన్లలోనూ కామన్‌గా యూఎస్‌బీ టైప్-సీ పోర్టును అందించాల్సిందిగా యూరోపియన్ కమిషన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లను అడగనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఐఫోన్ సిమ్ కార్డు స్లాట్ గురించి కూడా కథనాలు రావడం ఏమాత్రం యాదృచ్ఛికం కాదు.

2017లో యాపిల్ మొదటిసారి వైర్‌లెస్ చార్జింగ్ టెక్నాలజీని పరిచయం చేసింది. ఐఫోన్ 8 సిరీస్‌తో దీన్ని మొదటిసారి అందుబాటులోకి తీసుకువచ్చారు. 2020లో మాగ్‌సేఫ్ బ్రాండెడ్ వైర్‌లెస్ చార్జింగ్ డివైసెస్‌ను కంపెనీ లాంచ్ చేసింది.

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!

Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 26 Dec 2021 05:30 PM (IST) Tags: Apple iPhone Apple iPhone iPhone 15 Series Apple iPhone 15 Series iPhone 15 iPhone Without Simcard Slot

సంబంధిత కథనాలు

Tecno Pop 6 Pro: రూ.6 వేలలోపే టెక్నో స్మార్ట్ ఫోన్ - ఆండ్రాయిడ్ 12, వెనకవైపు రెండు కెమెరాలు!

Tecno Pop 6 Pro: రూ.6 వేలలోపే టెక్నో స్మార్ట్ ఫోన్ - ఆండ్రాయిడ్ 12, వెనకవైపు రెండు కెమెరాలు!

Oppo A17: ఆండ్రాయిడ్ 12తో ఒప్పో కొత్త ఫోన్ - రూ.10 వేలలోనే!

Oppo A17: ఆండ్రాయిడ్ 12తో ఒప్పో కొత్త ఫోన్ - రూ.10 వేలలోనే!

Walking Robot Dogs: పెంపుడు కుక్కల స్థానంలో రోబోటిక్ డాగ్స్, చైనాలో నయా ట్రెండ్! ఎందుకలా?

Walking Robot Dogs: పెంపుడు కుక్కల స్థానంలో రోబోటిక్ డాగ్స్, చైనాలో నయా ట్రెండ్! ఎందుకలా?

శాంసంగ్ కొత్త ఫోన్ గురించి అదిరిపోయే అప్‌డేట్ - ఈసారి మెరుగైన బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే!

శాంసంగ్ కొత్త ఫోన్ గురించి అదిరిపోయే అప్‌డేట్ - ఈసారి మెరుగైన బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే!

Oppo Find X6: సూపర్ కెమెరాలతో ఒప్పో కొత్త ఫోన్ - వన్‌ప్లస్ రేంజ్ సెన్సార్లు!

Oppo Find X6: సూపర్ కెమెరాలతో ఒప్పో కొత్త ఫోన్ - వన్‌ప్లస్ రేంజ్ సెన్సార్లు!

టాప్ స్టోరీస్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

Sajjala Ramakrishna Reddy : మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy :  మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

IND Vs SA, 1st ODI: క్లాసీన్ క్లాస్ - మిల్లర్ మాస్ - మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా ఎంత కొట్టిందంటే?

IND Vs SA, 1st ODI: క్లాసీన్ క్లాస్ - మిల్లర్ మాస్ - మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా ఎంత కొట్టిందంటే?

Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు

Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు