Huawei Foldable Phone: హువావే మడత ఫోన్ వచ్చేసింది.. కెమెరాలు, డిజైన్ సూపర్.. ధర ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హువావే తన కొత్త ఫోల్డబుల్ ఫోన్ అయిన పీ50 పాకెట్‌ను లాంచ్ చేసింది.
హువావే కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. అదే హువావే పీ50 పాకెట్. కంపెనీ లాంచ్ చేసిన మొదటి ఫోల్డబుల్ ఫ్లిప్ ఫోన్ ఇదే. ఇందులో 6.9 అంగుళాల ఫోల్డబుల్ ఫ్లెక్సిబుల్ స్క్రీన్‌ను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 40 మెగాపిక్సెల్ కాగా, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు.
హువావే పీ50 పాకెట్ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర 8,988 యువాన్లుగా (సుమారు రూ.1,06,200) ఉండగా, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 10,988 యువాన్లుగా (సుమారు రూ.1,29,830) నిర్ణయించారు. గోల్డ్ కలర్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
హువావే పీ50 పాకెట్ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.9 అంగుళాల ఫోల్డబుల్ ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. హోల్ పంచ్ కెమెరా కటౌట్‌ను ఇందులో అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 21:9గా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 300 హెర్ట్జ్‌గా ఉంది. దీంతోపాటు 1.04 అంగుళాల అమోఎల్ఈడీ ఎక్స్‌టర్నల్ స్క్రీన్ కూడా అందించారు.
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్, 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు 40 మెగాపిక్సెల్ కెమెరాను ప్రధాన సెన్సార్‌గా అందించారు. దీంతోపాటు 32 మెగాపిక్సెల్ సెన్సార్, 13 మెగాపిక్సెల్ సెన్సార్లు కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 10.7 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది. 40W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. వైర్ లెస్ చార్జింగ్‌ను కంపెనీ ఇందులో అందించలేదు. హార్మొనీ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?