QR Code Scanning Tips: గ్యాలరీలో ఉన్న క్యూఆర్ కోడ్ ఇమేజ్ స్కాన్ చేయడం ఎలా?
మీ గ్యాలరీలో ఉన్న క్యూఆర్ కోడ్ ఇమేజ్ స్కాన్ చేయడం ఎలా?
మనం ఏదైనా షాప్‌కి వెళ్లినప్పుడు అక్కడ ఆన్‌లైన్ పేమెంట్ చేయాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. అలాగే ఇటీవల కొందరు శుభకార్యాలకు రావాల్సిన అడ్రెస్‌లు కూడా క్యూఆర్ కోడ్‌ల ద్వారా పంపిస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా సులభమైన పద్ధతి. అడ్రస్ వెతుక్కుని వెళ్లడం కంటే, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గూగుల్ లొకేషన్ గుర్తిస్తుంది. మ్యాప్స్ తిన్నగా అక్కడికి వెళ్లాల్సిన దారి చెబుతుంది. అయితే క్యూఆర్ కోడ్ సంబంధించిన ఇమేజ్ ఫోన్‌లో ఉంటే గ్యాలరీలో ఉన్న ఫొటో స్కాన్ చేసి డిటైల్స్ తెలుసుకోవడం కూడా కొంచెం కష్టమే. కానీ అసాధ్యం అయితే కాదు. కొన్ని టిప్స్ ఫాలో అయితే ఈజీగా స్కాన్ చేయవచ్చు.
గూగుల్ లెన్స్ ద్వారా స్కాన్ చేయవచ్చు
ఫొటోలపై సమాచారాన్ని గుర్తించడంలో గూగుల్ లెన్స్ ఇప్పుడు బాగా సాయపడుతుంది. దీని ద్వారా టెక్స్ట్ ట్రాన్స్‌లేట్ చేయవచ్చు, ఒకేలాంటి ఇమేజెస్‌ను కనిపెట్టవచ్చు. మీ ఫోన్‌లో ఉన్న గ్యాలరీ, కెమెరా రోల్ నుంచి ఇమేజెస్‌ను తీసుకుని వాటిని కూడా స్కాన్ చేయవచ్చు.
మీ ఫోన్ గ్యాలరీ ద్వారా స్కాన్ చేయవచ్చు
వన్‌ప్లస్ లాంటి ఫోన్లలో గ్యాలరీ యాప్‌లోనే గూగుల్ లెన్స్ ఫీచర్ కూడా ఉంటుంది. గ్యాలరీ యాప్‌లో క్యూఆర్ కోడ్ ఉన్న ఫొటో ఓపెన్ చేయండి. గూగుల్ లెన్స్ ఐకాన్‌పై క్లిక్ చేస్తే ఫొటో ఆటోమేటిక్‌గా స్కాన్ అవుతుంది. దానికి సంబంధించిన రిజల్ట్స్ వెంటనే కనిపిస్తాయి.
గూగుల్ సెర్చ్ విడ్జెట్
ఆండ్రాయిడ్ ఫోన్లలో సాధారణంగా గూగుల్ సెర్చ్ బార్ విడ్జెట్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయవచ్చు. దీన్ని ఉపయోగించడానికి మొదటగా విడ్జెట్‌ను హోం స్క్రీన్‌కు యాడ్ చేయాలి. ఆ తర్వాత ఆ సెర్చ్ బార్‌లో కుడివైపు చివరన లెన్స్ సింబల్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి ఇమేజ్ సెలక్ట్ చేసుకుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ అవుతుంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!
View this post on Instagram