Spotify Premium: ఫ్రీగా స్పాటిఫై ప్రీమియం - ఇలా చేస్తే పొందవచ్చు - యాడ్ ఫ్రీ మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు!
దీపావళి సందర్భంగా స్పాటిఫై నాలుగు నెలల పాటు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది.
దీపావళి సందర్భంగా స్పాటిఫై నాలుగు నెలల ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. దీపావళి పండుగ సందర్భంగా ఈ ఆఫర్‌ను స్పాటిఫై ప్రారంభించింది. యాపిల్ మ్యూజిక్ కంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే యాపిల్ మ్యూజిక్ ఫ్రీ ట్రయల్ మనదేశంలో కేవలం ఒక్క నెల మాత్రమే.
స్పాటిఫై ఈ ఆఫర్‌ను కేవలం మనదేశంలో మాత్రమే అందిస్తుంది. ఈ ఆఫర్ కేవలం నాలుగు నెలల పాటు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఆ తర్వాత మీ ఖాతా నుంచి రూ.119 కట్ అవుతుంది. కానీ మీరు వెంటనే దాన్ని క్యాన్సిల్ చేస్తే ఆటో డెబిట్ కాకుండా ఉంటుంది.
ఈ ఆఫర్ కేవలం అక్టోబర్ 24వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. కాబట్టి మీకు స్పాటిఫై ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలనే ఆలోచన ఉంటే త్వరపడటం మంచిది. దీని ద్వారా మీరు యాడ్స్ లేకుండా మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
స్పాటిఫై ప్రీమియంను పొందడానికి మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఇవే!
స్టెప్ 1: మీ స్మార్ట్ ఫోన్‌లో స్పాటిఫై యాప్‌ను తెరవండి.
స్టెప్ 2: కింద భాగంలో కుడివైపు ఉన్న ప్రీమియంపై క్లిక్ చేయండి.
స్టెప్ 3: చివరిగా, ప్రీమియం ఇండివిడ్యువల్ ప్లాన్‌పై క్లిక్ చేయండి.
(ఒకవేళ మీరు ఐఫోన్ ఉపయోగిస్తున్నట్లు అయితే సఫారీ లేదా క్రోమ్ వంటి బ్రౌజర్లను ఉపయోగించాలి. ఎందుకంటే యాపిల్ తన యాప్ వెండర్ల నుంచి ఇన్ యాప్ పర్చేజెస్‌కు ఎక్స్‌ట్రా చార్జ్‌లను వసూలు చేస్తుంది. అందుకే స్పాటిఫై మెంబర్‌షిప్‌ను మీరు ఐఫోన్ యాప్ ద్వారా కొనుగోలు చేయలేరు.)
స్టెప్ 4: మీరు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డును యాడ్ చేయాలి లేకపోతే యూపీఐ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.
ఈ ప్రీమియం ప్లాన్‌లో కొన్ని అదనపు లాభాలు ఉన్నాయి. మీరు యాడ్స్ లేకుండా మ్యూజిక్ వినవచ్చు. అన్‌లిమిటెడ్ డౌన్‌లోడ్స్ చేసుకోవచ్చు. హైక్వాలిటీ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయవచ్చు. 320 కేబీపీఎస్ వద్ద మీ ఫేవరెట్ పాటలను వినవచ్చు.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
View this post on Instagram