QR Code Scanner Shortcut: జీపే, ఫోన్‌పే, పేటీయంల్లో ఈ షార్ట్ కట్ మీకు తెలుసా - చాలామందికి తెలియని విషయం ఇది!
Online Tips: ఆన్‌లైన్ పేమెంట్ యాప్స్‌లో క్యూఆర్ కోడ్ సులభంగా స్కాన్ చేయడానికి కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది.
Gpay Shortcuts: ఇప్పుడు మనదేశంలో చాలా మంది యూపీఐ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. గూగుల్‌పే (జీపే), పేటీయం, ఫోన్‌పే యాప్స్ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటే ప్రతిసారీ యాప్‌లను మళ్లీ మళ్లీ తెరిచి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ సమస్యను మీరు అందరూ ఎదుర్కొంటారు.
మీరు యూపీఐ యాప్‌లను రోజుకు 10 సార్లు ఉపయోగిస్తే క్యూఆర్ కోడ్ ద్వారా కనీసం ఏడు నుంచి ఎనిమిది చెల్లింపులు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో యాప్‌ని మళ్లీ మళ్లీ ఓపెన్ చేయడం టైమ్ టేకింగ్ ప్రాసెస్‌గా ఉంటుంది. పదేపదే యాప్ ఓపెన్ చేసి స్కాన్ చేయాల్సిన అవసరం లేకుండా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి.
యూపీఐ యాప్‌లను మళ్లీ మళ్లీ తెరవడాన్ని నివారించాలంటే మీరు ఈ యాప్‌ల క్యూఆర్ స్కానర్ షార్ట్‌కట్‌లను మీ హోమ్‌స్క్రీన్‌లో ఉంచుకోవాలి. దీని కోసం మీరు ఏదైనా యూపీఐ యాప్‌ని లాంగ్ ప్రెస్ చేయాలి. దీని తర్వాత మీరు అనేక ఆప్షన్లను చూడటం ప్రారంభిస్తారు. వాటిలో 'Scan Any QR Code' అని కనిపిస్తుందేమో చూడండి. ఒకవేళ కనిపిస్తే ఈ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. దాన్ని డ్రాగ్ చేసి హోమ్‌స్క్రీన్‌పై ఉంచండి. దీంతో మీరు ఇక్కడ నుంచి నేరుగా ఏదైనా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా పేమెంట్ చేయగలరు. అంటే మీరు ఈ షార్ట్‌కట్‌పై క్లిక్ చేస్తే మీ స్కానర్ వెంటనే ఓపెన్ అవుతుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ ఆప్షన్‌కి వెళ్లడానికి యాప్‌ని మళ్లీ మళ్లీ ఓపెన్ చేసే ప్రాబ్లం మీకు ఉండదు.
అయితే మీరు యూపీఐ యాప్‌ల్లో పాస్‌వర్డ్‌ని సెట్ చేసి ఉంటే షార్ట్‌కట్‌ను తెరవడానికి ముందు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని కోసం కెమెరా పర్మిషన్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా మీరు మరిన్ని షార్ట్ కట్స్ కూడా హోం స్క్రీన్‌కు యాడ్ చేసుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్, సెండ్ మనీ, చెక్ బ్యాలెన్స్, హిస్టరీ మొదలైనవి కూడా హోం స్క్రీన్‌పై యాడ్ చేసుకోవచ్చు.
మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో పోటీ నిరంతరం పెరుగుతూనే ఉంది. ఓపెన్ఏఐ జనరేటివ్ ఏఐ ఛాట్‌జీపీటీ తర్వాత పెద్ద కంపెనీలు కూడా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రేసులో ముందుకు వెళ్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాల తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద లిస్టెడ్ కంపెనీ యాపిల్ కూడా ఇప్పుడు ఏఐకి సంబంధించిన రేసులో చేరిందని సమాచారం. ఐఫోన్, ఐప్యాడ్ వంటి అనేక టెక్ ఉత్పత్తులను విక్రయించే దిగ్గజ కంపెనీ యాపిల్ ఇప్పుడు ఛాట్‌జీపీటీ వంటి సొంత జనరేటివ్ ఏఐని సిద్ధం చేసిందని వివిధ మీడియా సంస్థలు తమ నివేదికల్లో పేర్కొన్నాయి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!