News
News
X

Tech News: రోజూ మీ ఫోన్, ల్యాప్‌టాప్‌ ఛార్జ్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

ఫోన్లు, ల్యాప్ టాప్ లతో పాటు ఇతర గాడ్జెట్స్ కు ప్రతి రోజు తప్పకుండా ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. అయితే, వీటికి ఛార్జింగ్ చేయడం మూలంగా రోజులకు ఎంత ఖర్చు అవుతుందంటే..

FOLLOW US: 

స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్.. ఈ జనరేషన్ వ్యక్తులు తప్పకుండా ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ పరికరాలు. చాలా మందికి చేతిలో ఫోన్ లేకపోతే ప్రపంచం మొత్తం స్తంభించిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకే, ఎప్పుడూ ఫుల్ ఛార్జ్ చేసి ఇష్టం ఉన్నంత సేపు వాడుతూ ఉంటారు. నిత్యం మీరు సెల్ ఫోన్, ల్యాప్ టాప్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కు ఛార్జింగ్ పెడుతుంటారు. కానీ, ఓ విషయం గురించి ఎప్పుడూ ఆలోచించి ఉండరు. అదేంటంటే.. ఒక రోజు మనం వాడే సెల్ ఫోన్, ల్యాప్ టాప్ ఛార్జింగ్ కు ఎంత ఖర్చు అవుతుంది?  

ఇదే విషయానికి సంబంధించి Ofgem ఓ నివేదికను రూపొందించింది.  ప్రస్తుత విద్యుత్ ధర కిలోవాట్ అవర్(kWh)కి  సుమారు 28 పౌండ్స్(యూకేలో) గా ఉంది.  మొబైల్ కంపారిజన్ సైట్ Uswitch.com ప్రకారం.. మనం ప్రతిరోజూ  ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ‘సిఫార్సు చేయబడిన’ సమయం రెండు గంటల 40 నిమిషాలు. ఆ సంఖ్య ఆధారంగా.. ప్రతి రోజు ఫోన్‌ ను ఛార్జ్ చేయడానికి సగటు వ్యక్తికి సంవత్సరానికి 85 పౌండ్స్ అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.7,483 ఖర్చు అవుతుంది.  మీ ఫోన్‌ ను ఎక్కువసేపు ఛార్జ్‌ లో ఉంచినట్లయితే  లేదంటే ఎక్కువ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఛార్జ్ చేస్తే ఆ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. ల్యాప్‌ టాప్‌ ను వాడే వారికి ఎక్కువ కరెంటు అవసరం ఉంటుంది. మీ ల్యాప్‌ టాప్‌ ను ఛార్జ్ చేయడానికి ఏడాదికి 12.26 పౌండ్స్ అంటే భారత కరెన్సీలో రూ. 1,077 ఖర్చు చేయాల్సి ఉంటుంది.  

పెద్ద గృహ ఉపకరణాలు కలిగిన కుటుంబాలు ఈ ఖర్చును మరింతగా భరించాల్సి ఉంటుంది.  బ్రిటిష్ గ్యాస్ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో UKలోని గృహాలు కొన్ని ఉపకరణాలను స్టాండ్‌బైలో ఉంచడం ద్వారా సంవత్సరానికి £2.2(193.42) బిలియన్లు ఖర్చు చేస్తున్నాయని తేలింది.  రాత్రిపూట, ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు వాటిని పూర్తిగా ఆపివేయడం లేదని తేలింది.  ఇది సగటు కుటుంబానికి సంవత్సరానికి £147(రూ.12,924)కి సమానంగా చెప్పుకోవచ్చు. స్మార్ట్ స్పీకర్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ రూటర్‌ లు అన్నీ ఈ డివైజ్‌ల పరిధిలోకి వస్తాయి. టీవీని ఆఫ్ చేయకుండా స్టాండ్‌ బైలో ఉంచడం ద్వారా ఒక్కో కుటుంబం సంవత్సరానికి £24.61(రూ.2,163.71) ఖర్చవుతుందని పరిశోధనలో వెల్లడి అయ్యింది.

సెట్ టాప్ బాక్స్ స్టాండ్ బైలో ఉంచడం మూలంగా ఏడాదికి £23.10(రూ.2,030.95) ఖర్చు అవున్నట్లు తేలింది. స్టాండ్‌ బైలో గేమ్‌ కన్సోల్‌ లు సగటున £12.17(రూ.1069.98) ఖర్చుకు కారణం అవుతున్నాయి. కంప్యూటర్‌ ల  ధర సుమారు £11.22(రూ.986.46) ఉంటుందని వెల్లడి అయ్యింది. అందకు వాటిని ఉపయోగించడం పూర్తయ్యాక స్విచ్ ఆఫ్ చేయడం మంచింది. కరెంటు ఖర్చును కొంత మేర తగ్గించుకునే వెసులుబాటు కలుగుతుంది. 

News Reels

Also Read: మీ స్మార్ట్ ఫోన్ పోయిందా? వెంటనే ఇలా ట్రాక్ చేసి, ఎక్కడుందో తెలుసుకోండి
Also Read: మీ వాట్సాప్ చాట్ ను ఎవరికీ కనిపించకుండా దాచుకోవచ్చు, ఎలాగో తెలుసా!?

Published at : 27 Sep 2022 06:10 PM (IST) Tags: Phone Charge Laptop Charge Every Day Chage cost

సంబంధిత కథనాలు

Vivo Y76s T1 Version: వివో బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేసింది - మిగతా బ్రాండ్ల బడ్జెట్ 5జీ మొబైల్స్‌కు పోటీ!

Vivo Y76s T1 Version: వివో బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేసింది - మిగతా బ్రాండ్ల బడ్జెట్ 5జీ మొబైల్స్‌కు పోటీ!

Tecno Phantom X2: టెక్నో ఫాంటం ఎక్స్ సిరీస్ వచ్చేస్తుంది - షావోమీ, రియల్‌మీ టాప్ ఎండ్ ఫోన్లతో పోటీ!

Tecno Phantom X2: టెక్నో ఫాంటం ఎక్స్ సిరీస్ వచ్చేస్తుంది - షావోమీ, రియల్‌మీ టాప్ ఎండ్ ఫోన్లతో పోటీ!

WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలోనే - ఇక డెస్క్‌టాప్‌లో కూడా!

WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలోనే - ఇక డెస్క్‌టాప్‌లో కూడా!

Samsung Galaxy S23 Ultra: కళ్లు చెదిరే డిస్‌ప్లేతో శాంసంగ్ కొత్త ఫోన్ - ఏకంగా ఐఫోన్ 14 ప్రో తరహాలో!

Samsung Galaxy S23 Ultra: కళ్లు చెదిరే డిస్‌ప్లేతో శాంసంగ్ కొత్త ఫోన్ - ఏకంగా ఐఫోన్ 14 ప్రో తరహాలో!

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!

టాప్ స్టోరీస్

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి