Honor Magic V: ఈసారి హానర్ వంతు.. కొత్త సంవత్సరంలో అదిరిపోయే ఫోన్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన ఫోల్డబుల్ ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది.
హానర్ మ్యాజిక్ వీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ జనవరి 10వ తేదీన లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ టిప్‌స్టర్ తెలిపారు. కంపెనీ లాంచ్ చేయబోయే మొదటి ఫోల్డబుల్ ఫోన్ ఇదే. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. హానర్ పేరెంట్ కంపెనీ హువావే ఇటీవలే పీ50 పాకెట్ ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ చైనాలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 4జీ ప్రాసెసర్‌తో లాంచ్ అయింది.
డిజిటల్ చాట్ స్టేషన్ అనే ఐడీ ఉన్న టిప్‌స్టర్ దీనికి సంబంధించిన లీకులు ఇచ్చారు. ఈ ఫోన్ ధర చైనా కరెన్సీలో 10,000 యువాన్ల (సుమారు రూ.1.18 లక్షలు) రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఫీచర్ల గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.
దీనికి సంబంధించిన షార్ట్ వీడియోను హానర్ తన చైనా విబో ఖాతాలో అనౌన్స్ చేసింది. కంపెనీ సీఈవో జావో మింగ్ కూడా ఈ ఫోన్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోల్డబుల్ ఫోన్లలో బెస్ట్ స్క్రీన్ ఇందులో అందుబాటులో ఉండనుందని ఈయన తెలిపారు.
ఇందులో కాంప్లెక్స్ హింజ్ టెక్నాలజీని అందించనున్నట్లు పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్ స్థాయిలో దీని ఆప్టిమైజేషన్ ఉండనుందని తెలిపారు. కొన్ని కంపెనీలు చిన్న ఫోల్డింగ్ స్క్రీన్లు అందిస్తున్నాయని.. ఫోల్డింగ్ ఫోన్ల సాధారణ స్వభావానికి ఇది విరుద్ధమన్నారు. డ్యూయల్ స్క్రీన్ డిజైన్‌ను ఇందులో అందించే అవకాశం ఉంది. ఇంటర్నల్ డిస్‌ప్లే 8 అంగుళాలు, సెకండరీ డిస్‌ప్లే 6.51 అంగుళాలుగా ఉండనున్నాయి.
హువావే, ఒప్పో కంపెనీలు కూడా ఇటీవలే ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేశాయి. హువావే పీ50 పాకెట్ స్మార్ట్ ఫోన్, ఒప్పో ఫైండ్ ఎన్ స్మార్ట్ ఫోన్లు ఇటీవలే చైనీస్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి.
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?