Google New Features: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెనక పరిగెడుతున్న ప్రపంచం - గూగుల్ సెర్చ్‌కు కొత్త ఏఐ ఫీచర్లు!
గూగుల్ తన సెర్చింజన్‌కు మూడు కొత్త జనరేటివ్ ఏఐ ఫీచర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది.
Google Genarative AI Features: టెక్ దిగ్గజం గూగుల్ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఫుల్ స్వింగ్‌లో పని చేస్తుంది. ఇప్పటి వరకు కంపెనీ అనేక వర్క్‌స్పేస్ యాప్‌లలో ఏఐ సపోర్టును అందించింది. గూగుల్ తన సెర్చ్ ఇంజిన్‌లో ఏఐ సంబంధిత ఫీచర్లను కూడా జోడించింది. ఈ మూడు కొత్త ఫీచర్లు ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ ప్రకటించిన జనరేటివ్ ఏఐ పవర్డ్ సెర్చ్ ఎక్స్‌పీరియన్స్(SGE)లో భాగంగా ఉన్నాయి. ఈ ఫీచర్ల సహాయంతో వినియోగదారులు ఏ అంశం పైన అయినా వేగంగా సెర్చ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. అంటే మీరు సమాచారాన్ని వేగంగా అందుకుంటారు. అలాగే అప్‌డేటెడ్‌గా ఉంటారు.
1. ఇప్పటివరకు మనం గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు చాలా సమాచారం ఇమేజ్‌లు, టెక్స్ట్‌లలో వస్తుంది. ఈ రెండు విషయాలు ఓవర్‌వ్యూ విభాగంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు కంపెనీ అందులో వీడియోను కూడా యాడ్ చేయనుంది. అంటే ఇప్పుడు దేన్ని అయినా సెర్చ్ చేసినప్పుడు మీరు ఓవర్‌వ్యూ విభాగంలో వీడియోలను కూడా చూడవచ్చు.
2. ఇప్పుడు ఓవర్‌వ్యూలు మరింత వేగంగా లోడ్ అవుతాయి. ఏఐ ఓవర్‌వ్యూలను రూపొందించడానికి పట్టే సమయాన్ని సగానికి తగ్గించిన ఏఐ పవర్డ్ సెర్చ్ ఎక్స్‌పీరియన్స్‌కు ఇటీవల పెద్ద మార్పు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. వారు సమాచారాన్ని వేగంగా పొందగలుగుతారు.
3. గూగుల్ జోడించిన మరో ఫీచర్ లింక్‌కి ప్రచురణ తేదీని జోడించడం. అంటే మీరు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు దానికి బదులుగా కనిపించే టెక్స్ట్ లింక్‌లో తేదీలు కూడా కనిపిస్తాయి. తద్వారా ఆర్టికల్ ఎప్పుడు రాశారు అన్నది కూడా తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం ఎవరికి అందుబాటులో ఉంది?
ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనేది కూడా గూగుల్ తెలిపింది. నేటి నుంచి ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లోని గూగుల్ యాప్, గూగుల్ క్రోమ్ డెస్క్‌టాప్ యాప్ రెండింటిలోనూ లైవ్ అవుతుందని గూగుల్ తెలిపింది. ఈ అప్‌డేట్ ప్రస్తుతం గూగుల్ ల్యాబ్‌కు సభ్యత్వం పొందిన వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే కాలంలో కంపెనీ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రానుంది.
మరోవైపు ఇన్‌ఫీనిక్స్ జీటీ 10 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇది ఒక గేమింగ్ ఫోన్‌గా మార్కెట్లోకి వచ్చింది. ఇందులో వెనకవైపు ట్రాన్స్‌పరెంట్ ఎఫెక్ట్ అందించే బ్యాక్ ప్యానెల్‌ను కంపెనీ అందించింది. మినీ ఎల్ఈడీ లైట్ స్ట్రిప్, రిఫ్లెక్టివ్ హార్డ్ వేర్‌ను కూడా ఇందులో చూడవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్‌పై ఇన్‌ఫీనిక్స్ జీటీ 10 ప్రో పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి. వేపర్ కూలింగ్ ఛాంబర్, బైపాస్ ఛార్జింగ్ ఫీచర్లు కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న అమోఎల్ఈడీ స్క్రీన్‌ను కూడా ఉన్నాయి. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. ఇక వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉంది.
Read Also: ఐఫోన్ లవర్స్ కు బ్యాడ్‌న్యూస్ - 15 ప్రో సిరీస్ ధరలు భారీగా పెంపు - రూ.2 లక్షలు దాటించేస్తారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial