అన్వేషించండి

Jio Fiber Video Call: వారెవ్వా.. ఏం టెక్నాలజీరా బాబు… వెబ్ కెమెరా లేకపోయినా టీవీ నుంచి వీడియో కాల్స్

టీవీలో వీడియోకాల్స్ మాట్లాడుకోవచ్చని మీకు తెలుసా…! వెబ్ క్యామ్ పెడితే సాధ్యమే కదా అంటారేమో...కానీ ఇప్పుడొచ్చిన కొత్త ఫీచర్ కి కెమెరా, వెబ్ కెమెరా అవసరం లేదు....అదెలా అంటారా…

జియో ఫైబర్ యూజర్లకు ఇది శుభవార్తే. ఇకపై ఎలాంటి కెమెరా, వెబ్‌క్యామ్ అవసరం లేకుండానే టీవీ నుంచి వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ‘కెమెరా ఆన్ మొబైల్’ పేరుతో తీసుకొచ్చిన ఫీచర్ ద్వారా ఈ వెసులుబాటు అందుబాటులోకి వస్తుంది.

సాంకేతికత రోజురోజుకీ పెరుగుతోంది. ఎలక్ట్రానిక్ డివైజ్‌లు పెరుగుతున్నాయి. వాటిని వినియోగిస్తున్నవారి సంఖ్యా రెట్టింపవుతోంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీలు కూడా పోటాపోటీగా అప్‌డేట్ వెర్షన్లు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. గతంలో ఏడాదికో, రెండేళ్లలో మార్పులు చేర్పులు చేసే కంపెనీలు… ఇప్పుడు రోజుల వ్యవధిలో అప్ డేట్ అయిపోతున్నాయ్.  ట్రెండ్‌కి తగ్గట్టుగా ఫీచర్లు డిజైన్ చేసి…. యూజర్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నారు. కెమెరా ఆన్ మొబైల్ పేరుతో తాజాగా జియో ఫైబర్ యూజర్స్ కి మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.


Jio Fiber Video Call: వారెవ్వా.. ఏం టెక్నాలజీరా బాబు… వెబ్ కెమెరా లేకపోయినా టీవీ నుంచి వీడియో కాల్స్

వెబ్ కెమెరా అవసరం లేకుండా యూజర్స్ తన మొబైల్ ఫోన్ సాయంతో టీవీలో వీడియోకాల్స్ మాట్లాడుకునేలా కెమెరా  ఆన్ మొబైల్ పేరుతో కొత్త ఫీచర్ ను పరిచయం చేశారు. ఈ ఫీచర్ ‘జియో జాయిన్’ యాప్ (గతంలో జియో కాల్) ద్వారా ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లకు అందుబాటులో ఉంది. వీడియో కాల్స్ కోసం ఫోన్ కెమెరాను ఇది ఇన్‌పుట్ డివైజ్‌గా మార్చేస్తుంది. అప్పుడు టీవీ ద్వారా ఎంచక్కా వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అలాగే, జియో ఫైబర్ యూజర్లు తమ మొబైల్‌లోని జాయిన్ జియో యాప్ ద్వారా  తమ ల్యాండ్‌లైన్ నంబరు నుంచి వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. 

మొబైల్‌ను ఉపయోగించి టీవీ ద్వారా వీడియో కాల్స్ చేసుకునేందుకు ముందు  పది అంకెల జియో ఫైబర్ నంబరును జాయిన్ జియో యాప్‌లో జోడించాల్సి ఉంటుంది. దీనిద్వారా మీ మొబైల్ వర్చువల్‌గా టీవీకి కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత జియో జాయిన్ యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘కెమెరా ఆన్ మొబైల్’ పీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. అంతే.. ఫోన్‌ను వెబ్‌కెమెరాగా ఉపయోగించి వీడియో కాల్స్ చేసుకోవచ్చు.  వీడియో కాల్స్ స్పష్టంగా ఉండాలంటే తమ మోడెమ్స్‌ను 5GHz వై-ఫై బ్యాండ్‌గా మార్చుకోవాలని జియో ఫైబర్ చెబుతోంది. 2.4GHz బ్యాండ్‌లో వీడియో కాల్స్ చేసుకోవచ్చు కానీ… వీడియో క్వాలిటీ అంత స్పష్టంగా ఉండదని పేర్కొంది.


Jio Fiber Video Call: వారెవ్వా.. ఏం టెక్నాలజీరా బాబు… వెబ్ కెమెరా లేకపోయినా టీవీ నుంచి వీడియో కాల్స్

ఇటీవలి కాలంలో, OnePlus, Xiaomi తో సహా పలు కంపెనీలు టీవీల కోసం ప్రత్యేకంగా వెబ్‌క్యామ్‌లను తీసుకొచ్చాయి. కరోనా కారణంగా అంతా ఆన్ లైన్ అయిన ఈ రోజుల్లో... ఫోన్‌లను వెబ్‌క్యామ్‌లుగా ఉపయోగించే మోడల్ జియో ఫైబర్ వినియోగదారులకు అదనపు సౌలభ్యాన్ని అందిస్తుంది. ఎందుకంటే వారు తమ టీవీల ద్వారా వీడియో కాల్స్ చేయడానికి ప్రత్యేక పరికరాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.

టాప్ హెడ్ లైన్స్

ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
How To Recover Deleted WhatsApp Messages: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
How To Free Up Storage On Android Phones: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget