Gionee G13 Pro: ఇదేందయ్యా ఇది.. ఐఫోన్‌ను దించేశారుగా.. రేటు రూ.6 వేలలోనే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ జియోనీ ఐఫోన్ 13 డిజైన్‌తో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది.
![Gionee G13 Pro: ఇదేందయ్యా ఇది.. ఐఫోన్‌ను దించేశారుగా.. రేటు రూ.6 వేలలోనే! Gionee G13 Pro Look alike iPhone 13 Launched Check Price Specifications Features Gionee G13 Pro: ఇదేందయ్యా ఇది.. ఐఫోన్‌ను దించేశారుగా.. రేటు రూ.6 వేలలోనే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/29/c5898f37e78f349d485f15fba66719d9_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
జియోనీ జీ13 ప్రో స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ లుక్ చూడటానికి అచ్చం యాపిల్ ఐఫోన్ 13లా ఉండటం విశేషం. అచ్చం దీనిలాగానే ఫ్లాట్ ఫ్రేమ్, కెమెరా మాడ్యూల్, సెల్ఫీ కెమెరా నాచ్.. ఇలా డిజైన్ మొత్తం సేమ్ టు సేమ్ ఐఫోన్ 13 తరహాలోనే ఉంది. హార్మొనీ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో స్మార్ట్ మోడ్ కూడా అందుబాటులో ఉంది.
జియోనీ జీ13 ప్రో ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 529 యువాన్లుగా (సుమారు రూ.6,200) ఉండగా, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 699 యువాన్లుగా (సుమారు రూ.8,200) నిర్ణయించారు. ఫస్ట్ స్నో క్రిస్టల్, సీ బ్లూ, స్టార్ పార్టీ పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
జియోనీ జీ13 ప్రో స్పెసిఫికేషన్లు
ఇందులో 6.26 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 19:9గా ఉంది. యూనిసోక్ టీ310 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు మాక్రో సెన్సార్ కూడా ఉండనుంది. ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో అందించారు. ఇందులో ఎల్డర్లీ మోడ్, స్మార్ట్ మోడ్ కూడా అందించారు. సెక్యూరిటీ కోసం ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. యువకుల కోసం ప్రత్యేకమైన స్మార్ట్ మోడ్‌ను కూడా ఇందులో అందించారు.
జియోనీ ఇందులో మల్టీపుల్ సాఫ్ట్ వేర్ ఓపెనింగ్స్‌ను అందించింది. అంటే వినియోగదారులు ఎన్ని వుయ్ చాట్ ఖాతాలు కావాలంటే అన్ని ఓపెన్ చేసుకోవచ్చన్న మాట. స్ప్లిట్ స్క్రీన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. హువావే హెచ్ఎంఎస్ ఎకో సిస్టంను ఇది సపోర్ట్ చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 3,500 ఎంఏహెచ్‌గా ఉంది. దీని మందం 0.92 సెంటీమీటర్లు కాగా.. బరువు 195 గ్రాములుగా ఉంది.
Gionee 13 Pro launched!!
— Technology Updates (@techupdatestcr) January 28, 2022
- 6.26-inch HD+ LCD display
- Unisoc T310 chipset
- 4 GB RAM, 32/128GB storage
- HarmonyOS
- 13MP Dual Rear camera
- 5MP Rear camera
- 3500mAh battery
- starts at 529 Yuan (~$83)#Gionee13Pro | #Gionee pic.twitter.com/nOlQw6gAD9
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)