News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

వాట్సాప్‌లో ఈ వెర్షన్ ఉపయోగిస్తున్నారా? వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి!

మీరు జీబీ వాట్సాప్ ఉపయోగిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే!

FOLLOW US: 
Share:

అత్యధిక సంఖ్యలో ఆండ్రాయిడ్ ట్రోజన్ డిటెక్షన్‌లను కలిగి ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. వాట్సాప్ క్లోన్డ్, థర్డ్-పార్టీ అనధికారిక వెర్షన్ అయిన ఒక యాప్ ద్వారా దేశంలోని ప్రజల చాట్‌లపై మానిటర్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.. సైబర్-సెక్యూరిటీ సంస్థ ESET నివేదిక ప్రకారం గత నాలుగు నెలల్లో ఆండ్రాయిడ్ స్పైవేర్ డిటెక్షన్‌లో ఎక్కువ భాగం వెనుక ఉన్నది ‘GB WhatsApp’. ఇది వాట్సాప్ క్లోన్డ్ థర్డ్ పార్టీ వెర్షన్. దీన్ని ఎక్కువ మంది వినియోగిస్తున్నారు.

ఇటువంటి హానికరమైన యాప్‌లు ఆడియో, వీడియోలను రికార్డ్ చేయడంతో సహా అనేక రకాల గూఢచర్య సామర్థ్యాలను కలిగి ఉంటాయి. "క్లోన్ అయిన యాప్ Google Playలో అందుబాటులో లేదు. అందువల్ల చట్టబద్ధమైన WhatsAppతో పోలిస్తే ఎటువంటి భద్రతా తనిఖీలు లేవు. వివిధ డౌన్‌లోడ్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్న వెర్షన్లు మాల్వేర్‌తో వస్తున్నాయి" అని నివేదిక పేర్కొంది.

కాబట్టి ఈ జీబీ వాట్సాప్ యాప్‌ను ఉపయోగిస్తున్నట్లయితే వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి. కొన్ని అదనపు ఫీచర్ల కోసం ఎంతో ప్రైవసీ ఉండే మీ డేటాను ప్రమాదంలో పెట్టకండి. వాట్సాప్ కూడా కొత్త ఫీచర్లను రెగ్యులర్‌గా తీసుకువస్తుంది. ఇటీవలే వాట్సాప్ కాల్ లింక్స్ అనే కొత్త ఫీచర్‌ను రోల్‌అవుట్ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు కొత్త కాల్ స్టార్ట్ చేయవచ్చు, లేదా అప్పటికే జరుగుతున్న కాల్‌లో జాయిన్ అవ్వవచ్చు. ఈ కాల్ లింక్స్ ఆప్షన్ కాల్స్ ట్యాబ్‌లో చూడవచ్చు. వినియోగదారులు దాని ద్వారా ఒక లింక్ క్రియేట్ చేసి ఆడియో, వీడియో కాల్ ప్రారంభించవచ్చు. దాన్ని ఇతర ప్లాట్‌ఫాంల్లో కూడా షేర్ చేయవచ్చు. ఈ ఫీచర్ ఈ వారంలోనే రోల్అవుట్ కానుంది. అయితే దీన్ని ఉపయోగించాలంటే యాప్ లేటెస్ట్ వెర్షన్ ఉండాలి. వాట్సాప్ గ్రూప్ వీడియో కాల్స్‌లో 32 మంది చేరేలా ఉండే ఫీచర్‌ను కూడా టెస్ట్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

వాట్సాప్ కాల్ లింక్స్ ఫీచర్ అంటే?
గూగుల్ మీట్, జూమ్ మీటింగ్‌లను మనం లింక్‌ల ద్వారా ఎలా షేర్ చేస్తామో, వాట్సాప్ వీడియో కాల్ లింక్స్‌ను కూడా అలా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కాల్‌లో జాయిన్ అవ్వవచ్చు. వాట్సాప్‌లోనే కాకుండా మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో కూడా దీన్ని షేర్ చేయవచ్చు.

అయితే ఈ ఫీచర్ మొదట ఆండ్రాయిడ్‌కు అందుబాటులోకి వస్తుందో, లేకపోతే ఐవోఎస్‌కు అందుబాటులోకి వస్తుందో తెలియరాలేదు. లింక్‌కు సంబంధించిన ఫీచర్ కాబట్టి రెండు ప్లాట్‌ఫాంలకు ఒకేసారి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

లింక్ క్రియేట్ చేయాలంటే వినియోగదారులు కాల్ స్టార్ట్ చేశాక కాల్స్ ట్యాబ్‌లో ఉన్న కాల్ లింక్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ ఆడియో కాల్ లేదా వీడియో కాల్‌ను లింక్ ద్వారా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Published at : 15 Oct 2022 05:55 PM (IST) Tags: WhatsApp GB Whatsapp Data Theft GB Whatsapp GB Whatsapp Disadvantages GB Whatsapp Uninstall

ఇవి కూడా చూడండి

Smartphone Prices: ప్లీజ్... రేట్లు తగ్గించండి - స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు మొబైల్ రిటైలర్ల లెటర్!

Smartphone Prices: ప్లీజ్... రేట్లు తగ్గించండి - స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు మొబైల్ రిటైలర్ల లెటర్!

Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్ - డేటా మరింత సేఫ్ అయ్యేలా!

Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్ - డేటా మరింత సేఫ్ అయ్యేలా!

Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!

Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!

Nudify Apps: అలాంటి యాప్‌లకు పెరుగుతున్న పాపులారిటీ- సంచలనం సృష్టిస్తున్ననివేదిక, !

Nudify Apps: అలాంటి యాప్‌లకు పెరుగుతున్న పాపులారిటీ- సంచలనం సృష్టిస్తున్ననివేదిక, !

WhatsApp New Feature: త్వరలో వాట్సాప్ సూపర్ మ్యూజిక్ ఫీచర్ - ఇకపై వీడియో కాల్స్‌లో కూడా!

WhatsApp New Feature: త్వరలో వాట్సాప్ సూపర్ మ్యూజిక్ ఫీచర్ - ఇకపై వీడియో కాల్స్‌లో కూడా!

టాప్ స్టోరీస్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్‌- తప్పులేదన్న సజ్జనార్‌

Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్‌- తప్పులేదన్న సజ్జనార్‌

Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య