అన్వేషించండి

Galaxy Watch 6 Vs Watch 6 Classic: శాంసంగ్ స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా? గెలాక్సీ వాచ్ 6, గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్‌ల్లో ఏది బెస్ట్!

శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6, శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్‌ల్లో ఏది బాగుంది? ఏది కొనడం బెస్ట్?

మీరు కొత్త శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌వాచ్ కొనాలని చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6, శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ మధ్య ఏది ఎంచుకోవాలో ఆలోచిస్తున్నారా? మీరు సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడటానికి కొన్ని టెక్నికల్ డిటైల్స్ చూద్దాం.

డిజైన్
డిజైన్‌తో ప్రారంభిస్తే శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6కి దాని ముందు వెర్షన్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5కి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. ఇది పెద్ద డిస్‌ప్లేను అందిస్తుంది. కానీ మొత్తం భౌతిక పరిమాణంలో కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఇది స్పోర్టియర్, సింపుల్ లుక్ కలిగి ఉంది. తేలికపాటి ఆర్మర్ అల్యూమినియం కేస్ః, స్పోర్ట్ బ్యాండ్‌తో ఇది రానుంది. మీరు 40mm, 44mm రెండు సైజుల నుంచి ఎంచుకోవచ్చు. అలాగే కలర్ ఆప్షన్లలో 40mm మోడల్ కోసం గ్రాఫైట్, సిల్వర్... 44mm వెర్షన్ కోసం గ్రాఫైట్, గోల్డ్ ఉన్నాయి. దీనికి సాఫైర్ క్రిస్టల్ గ్లాస్‌ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది. దీంతో స్విమ్మింగ్ కూడా చేయవచ్చు.

మరోవైపు శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్‌ను మరింత ట్రెడిషనల్‌గా డిజైన్‌ చేసింది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్‌లో కనిపించే రొటేటింగ్ బెజెల్ ఇందులో ఉంది. కానీ పాత మోడల్ కంటే ఇందులో 15 శాతం ఉంది. ఇదే దాని ప్రత్యేక ఫీచర్. ఈ బెజెల్ కేవలం ఫంక్షనల్‌గా ఉండటమే కాకుండా వాచ్‌కు సౌందర్యాన్ని కూడా జోడిస్తుంది. క్లాసిక్ మోడల్ స్టెయిన్‌లెస్ స్టీల్ కేస్‌ను కలిగి ఉంది. అలాగే హైబ్రిడ్ ఎకో-లెదర్ బ్యాండ్‌తో వస్తుంది. ఇది 43mm, 47mm సైజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. రెండు మోడల్స్‌నూ నలుపు లేదా సిల్వర్ రంగులలో కొనవచ్చు. సాధారణ గెలాక్సీ వాచ్ 6 లాగా... ఇది సాఫైర్ క్రిస్టల్ గ్లాస్, IP68, 5ATM వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

ప్రదర్శన
శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6, శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ రెండు మోడల్స్‌లోనూ సూపర్ అమోఎల్ఈడీ ప్యానెల్స్ అందించారు. ఇవి రెండూ ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లేలే. కేస్ సైజ్ ఆధారంగా డిస్‌ప్లే సైజులు కొద్దిగా మారుతూ ఉంటాయి. చిన్న సైజు వాచ్‌ల్లో (40mm రెగ్యులర్, 43mm క్లాసిక్), 432 x 432 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉన్న 1.3 అంగుళాలు (33.3mm) డిస్‌ప్లే ఉంది. పెద్ద మోడల్స్‌లో (44mm రెగ్యులర్, 47mm క్లాసిక్) 480 x 480 పిక్సెల్స్ రిజల్యూషన్‌ ఉన్న 1.5 అంగుళాల (37.3mm) డిస్‌ప్లేలు ఉండనున్నాయి. సాఫైర్ క్రిస్టల్ గ్లాస్ అన్ని మోడళ్లను ప్రొటెక్షన్ అందిస్తుంది.

ప్రాసెసర్, సాఫ్ట్‌వేర్
రెండు స్మార్ట్‌వాచ్‌లు ఒకే ఎక్సినోస్ డబ్ల్యూ930 డ్యూయల్ కోర్ 1.4 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌తో రానున్నాయి. శాంసంగ్ వన్ యూఐ 5 వాచ్ ఇంటర్‌ఫేస్‌ లేయర్డ్‌ వేర్ఓఎస్ 4పై ఈ రెండూ పని చేయనున్నాయి. యాప్స్‌ను లాంచ్ చేసేటప్పుడు ఎక్సినోస్ డబ్ల్యూ930 చిప్ ఇంప్రూవ్‌మెంట్‌ను ఇస్తుంది. మునుపటి తరం కంటే దాదాపు 18 శాతం వేగంగా యాప్‌లను తెరుస్తుంది.

వన్ యూఐ 5 వాచ్ పర్సనల్ ప్రైవసీ, సెక్యూరిటీ లక్షణాలను మెరుగుపరుస్తుంది. వీటిలో ఆటోమేటిక్ ఫాల్ డిటెక్షన్, SOS కాలింగ్, మొదటి రెస్పాండర్‌లకు యాక్సెస్ చేయగల అత్యవసర సమాచారం ఉన్నాయి. స్లీప్ కోచింగ్, ఇన్‌సైట్స్, పర్సనలైజ్డ్ ట్రైనింగ్ కార్యక్రమాల కోసం మెరుగైన రన్నింగ్ మెట్రిక్స్ వంటి అదనపు ఫీచర్‌లు కూడా వీటిలో ఉన్నాయి.

రెండు గడియారాలు బాగా పని చేస్తున్నప్పటికీ, ప్రారంభ సెటప్, అప్పుడప్పుడు టచ్ ఇన్‌పుట్ గ్లిచెస్ వంటి కొన్ని చిన్న పెర్పార్మెన్స్ ఇష్యూస్ కనిపించాయి.

బ్యాటరీ, ఛార్జింగ్
శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6, శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ రెండూ... వాటి ముందు వెర్షన్ల కంటే కొంచెం పెద్ద బ్యాటరీలతో వస్తాయి. 40mm శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6లో 300 ఎంఏహెచ్, 43mm శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్‌లో 284 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉన్నాయి. పెద్ద 44mm శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6లో 410 ఎంఏహెచ్, 47mm శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్‌లో 425mAh బ్యాటరీలు ఉన్నాయి.

మునుపటి వెర్షన్‌తో పోలిస్తే గణనీయంగా మెరుగైన బ్యాటరీ జీవితాన్ని ఇవి అందించనున్నాయి. శాంసంగ్ సొంత WPC-ఆధారిత వైర్‌లెస్ ఛార్జర్ ద్వారా దీన్ని ఛార్జింగ్ పెట్టవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ కూడా ఉంది. 15 నిమిషాల్లో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6...  30 శాతం ఛార్జ్‌కు చేరుకుంటుంది. క్లాసిక్ మోడల్ 20 నిమిషాల్లో 25 శాతం ఛార్జ్‌ని సాధిస్తుంది. పూర్తి ఛార్జింగ్‌కి గంట కంటే ఎక్కువ సమయం పడుతుంది.

ఫిట్‌నెస్, హెల్త్ ట్రాకింగ్
రెండు వాచీలు శాంసంగ్ 3-in-1 బయోయాక్టివ్ సెన్సార్, హౌసింగ్ హార్ట్ రేట్, ఎలక్ట్రికల్ హార్ట్ సిగ్నల్, బయోఎలక్ట్రికల్ ఇంపెడెన్స్ అనాలిసిస్ సెన్సార్‌లను కలిగి ఉంటాయి. వారు స్టెప్ ట్రాకింగ్, స్లీప్ స్కోర్‌తో స్లీప్ ట్రాకింగ్, 90కి పైగా వర్కవుట్ రకాలు (కొన్ని ఆటోమేటిక్‌గా ట్రాక్ అవుతాయి), శరీర కొవ్వు, అస్థిపంజర కండరం, బాడీ వాటర్, మరిన్నిటికి సంబంధించిన కొలతలతో సహా సమగ్రమైన ఫిట్‌నెస్, హెల్త్ ట్రాకింగ్‌ను అందిస్తాయి. ప్రామాణిక ఆరోగ్య పర్యవేక్షణలో 24/7 హార్ట్ రేట్ ట్రాకింగ్, ఎస్పీఓ2 మానిటరింగ్, ఈసీజీ, బాడీ టెంపరేచర్ సెన్సార్ ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్‌లో రొటేటింగ్ బెజెల్ స్థానాన్ని గుర్తించడం కోసం 3D హాల్ సెన్సార్‌ని కలిగి ఉంది. కానీ ఆరోగ్యం లేదా ఫిట్‌నెస్ ట్రాకింగ్‌కు దోహదపడదు.

వేటి ధర ఎంత?
ఈ రెండు వాచ్‌లూ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫాంల్లో కొనుగోలు చేయవచ్చు. 

ఇప్పుడే కొనండి
శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6
MRP: రూ. 29,999

ఇప్పుడే కొనండి
శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్
MRP: రూ. 36,999

శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 (40mm): రూ. 29,999 నుంచి ప్రారంభం
శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 (44mm): రూ. 32,999 నుంచి ప్రారంభం
శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ (43mm): రూ. 26,999 నుంచి ప్రారంభం
శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్‌ (47mm): రూ. 39,999 నుంచి ప్రారంభం

ఏది కొనాలి?
శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6, శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్‌ల్లో ఏది కొనాలి అంటే అది మీ టేస్ట్ మీద బేస్ అయి ఉంటుంది. మీరు చిన్న కేస్ సైజ్‌తో సింపుల్, స్పోర్టీ లుక్‌ను ఇష్టపడితే, శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 దీనికి బెస్ట్ ఆప్షన్. ఇది మరింత బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ కూడా.

అలా కాకుండా, మీరు ట్రెడిషనల్ మోడల్ కావాలనుకుని, రొటేటింగ్ బెజెల్‌ను ఇష్టపడితే శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్‌ను కొనుగోలు చేయవచ్చు. దీని స్టెయిన్‌లెస్ స్టీల్ కేస్, హైబ్రిడ్ ఎకో లెదర్ బ్యాండ్ దాని లుక్‌ను మరింత అందంగా మారుస్తాయి. రెండు గడియారాలు వాటి ముందు వెర్షన్లతో పోలిస్తే అద్భుతమైన హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్, చక్కని పనితీరు, మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయి.

Disclaimer: This is a partnered article. The information is provided to you on an "as-is" basis, without any warranty. Although all efforts are made, however, there is no guarantee to the accuracy of the information. ABP Network Private Limited (‘ABP’) and/or ABP Live make no representations or warranties as to the truthfulness, fairness, completeness, or accuracy of the information. Readers are advised visit to the website of the relevant advertiser to verify the pricing of the goods or services before any purchase.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget