News
News
X

Ambrane Glares: స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ చేసిన యాంబ్రేన్ - మొదటి సేల్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు!

యాంబ్రేన్ గ్లేర్స్ అనే స్మార్ట్ గ్లాసెస్ మనదేశంలో లాంచ్ అయ్యాయి.

FOLLOW US: 

యాంబ్రేన్ తన మొదటి స్మార్ట్ గ్లాసెస్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అవే యాంబ్రేన్ గ్లేర్స్. ఇవి ఒక ఓపెన్ ఎయిర్ ఆడియో గ్లాసెస్. ఇందులో బిల్ట్ ఇన్ స్పీకర్లు ఉండనున్నాయి. ఫ్రేమ్‌లోనే అవి హైడ్ అయ్యాయి. బ్లూటూత్ వీ5.1 ఫీచర్‌ను వీటిలో అందించారు. రెండు గంటలు చార్జింగ్ పెడితే ఏడు గంటల బ్యాటరీ లైఫ్‌ను ఇవి అందించనున్నాయి. యూవీ ప్రొటెక్షన్ కూడా వీటిలో ఉన్నాయి.

యాంబ్రేన్ గ్లేర్స్ ధర
వీటి ధరను మనదేశంలో రూ.9,999గా నిర్ణయించారు. ప్రారంభ ఆఫర్ కింద కంపెనీ వెబ్ సైట్లో రూ.4,999కే అందుబాటులో ఉన్నాయి. రౌండ్, స్క్వేర్ షేప్స్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు. కేవలం బ్లాక్ కలర్ ఆప్షన్ మాత్రమే ఇందులో అందుబాటులో ఉంది.

యాంబ్రేన్ గ్లేర్స్ స్పెసిఫికేషన్లు
ఇందులో ఇన్ బిల్ట్ స్పీకర్లు అందించారు. టచ్ కంట్రోల్స్‌ను కూడా ఇవి సపోర్ట్ చేయనుంది. ఇందులోనే మైక్రోఫోన్, హెచ్‌డీ సరౌండ్ సౌండ్ కూడా ఉన్నాయి. వినియోగదారులు కాల్స్‌ను రిసీవ్ చేయడం, రిజెక్ట్ చేయడం వంటివి కూడా టచ్ కంట్రోల్స్ ద్వారానే చేయవచ్చు. బ్లూటూత్ వీ5.1 కనెక్టివిటీ ఫీచర్‌ను ఇవి సపోర్ట్ చేయనున్నాయి. ఐవోఎస్, ఆండ్రాయిడ్ డివైస్‌లను ఇవి సపోర్ట్ చేయనున్నాయి.

రౌండ్, స్క్వేర్ షేప్‌ల్లో వీటిని కొనుగోలు చేయవచ్చు. ఇవి బ్లూ లైట్‌ను బ్లాక్ చేసి స్క్రీన్‌ టైమ్‌ను కంఫర్టబుల్‌గా మార్చనున్నాయి. యాంబ్రేన్ గ్లేర్స్‌లో యూవీ400 సర్టిఫికేషన్ ఉండనుంది. అల్ట్రా వయొలెట్ కిరణాలు, రేడియేషన్ నుంచి 99.99 శాతం ప్రొటెక్షన్ అందించనుంది.

యాంబ్రేన్ కంపెనీ మనదేశంలో ఇటీవలే కొత్త పవర్ బ్యాంక్ లాంచ్ చేసింది. దీని ధరను రూ.3,999గా నిర్ణయించారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. బ్లాక్, బ్లూ రంగుల్లో యాంబ్రేన్ 50000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ లాంచ్ అయింది.

ఇందులో 50000 ఎంఏహెచ్ లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంది. ఇది 20W పవర్ అవుట్‌పుట్‌ను అందించనుంది. తొమ్మిది లేయర్ల చిప్ సెట్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఓవర్ హీటింగ్, షార్ట్ సర్క్యూట్ల నుంచి ఇది కాపాడనుంది. క్విక్ చార్జ్ 3.0 హై స్పీడ్ 2 వే చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.

యాంబ్రేన్ ఇటీవలే వైజ్ రోమ్ స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. ఇందులో 1.28 అంగుళాల సర్క్యులర్ లూసిడ్ డిస్‌ప్లేను అందించారు. 2.5డీ కర్వ్‌డ్ గ్లాస్‌ను ఇందులో ప్రొటెక్షన్ కోసం అందించారు. 450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఈ డిస్‌ప్లే అందించనుంది. ఇందులో 100కు పైగా క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. ఐపీ68 స్టాండర్డ్స్ వరకు స్ప్లాష్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. అంటే పొరపాటున నీరు వాచ్ మీద పడ్డా ఏం కాదన్న మాట.

హార్ట్ రేట్ ట్రాకింగ్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్, ఎస్‌పీఓ2 ట్రాకర్, మెన్‌స్ట్రువల్ ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్ ఫీచర్లు కూడా ఈ స్మార్ట్ వాచ్‌లో అందించారు. దీంతోపాటు వెదర్ ఫోర్‌కాస్ట్, ఫిమేల్ హెల్త్ ట్రాకర్, హై ఏఆర్ అలెర్ట్, బ్రీత్ ట్రైనింగ్ ఫీచర్లు యాంబ్రేన్ వైజ్ రోమ్ స్మార్ట్ వాచ్‌లో ఉన్నాయి. 60కి పైగా స్పోర్ట్స్ మోడ్స్‌‌ను కంపెనీ ఇందులో అందించింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లను ఇది సపోర్ట్ చేయనుంది.

రెండు గంటల పాటు చార్జింగ్ పెడితే ఈ స్మార్ట్ వాచ్ ఏకంగా 10 రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ ఇవ్వనుంది. 260 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఈ స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ మైక్ కూడా ఉంది. ఇది బ్లూటూత్ కాలింగ్స్‌ను సపోర్ట్ చేయనుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఇన్ కమింగ్ కాల్స్, టెక్స్ట్ మెసేజెస్‌లను మీకు నోటిఫై చేసే స్మార్ట్ నోటిఫికేషన్ ఫీచర్ ఇందులో ఉంది. అలాగే వాయిస్ అసిస్టెంట్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

Published at : 19 Sep 2022 09:08 PM (IST) Tags: Ambrane Glares Price in India Ambrane Glares Ambrane Glares Launched Ambrane Glares Specifications Ambrane Glares Features

సంబంధిత కథనాలు

Amazon Great Indian Festival Sale Goes Live: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్ట్ సేల్ ప్రారంభం - యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్ ఫోన్లపై టాప్ డీల్స్!

Amazon Great Indian Festival Sale Goes Live: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్ట్ సేల్ ప్రారంభం - యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్ ఫోన్లపై టాప్ డీల్స్!

Train Tickets Booking On Google: గూగుల్ సెర్చ్ నుంచే నేరుగా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Train Tickets Booking On Google: గూగుల్ సెర్చ్ నుంచే నేరుగా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Amazon Great Indian Festival Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ప్రైమ్ మెంబర్స్‌కు మరిన్ని ఆఫర్లు!

Amazon Great Indian Festival Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ప్రైమ్ మెంబర్స్‌కు మరిన్ని ఆఫర్లు!

Nokia T10: నోకియా టీ10 ధర లీక్ - రూ.12 వేలలోపే బడ్జెట్ ట్యాబ్!

Nokia T10: నోకియా టీ10 ధర లీక్ - రూ.12 వేలలోపే బడ్జెట్ ట్యాబ్!

Oneplus Nord Watch: వన్‌ప్లస్ చవకైన వాచ్ వచ్చేస్తుంది - ధర ఎంత ఉండనుందంటే?

Oneplus Nord Watch: వన్‌ప్లస్ చవకైన వాచ్ వచ్చేస్తుంది - ధర ఎంత ఉండనుందంటే?

టాప్ స్టోరీస్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు