Flipkart Big Billion Days 2024: బిగ్ బిలియన్ డేస్ ప్రారంభం అయ్యేది ఎప్పుడు? - ఈ స్మార్ట్‌ఫోన్లపై అద్భుత ఆఫర్లు!
Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2024 సేల్ సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో అందించనున్న పలు డీల్స్‌ను కూడా కంపెనీ ప్రకటించింది.
Flipkart Big Billion Days 2024 Sale Date: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 తేదీలను కంపెనీ ప్రకటించింది. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సేల్ ప్రారంభం కానుంది. కానీ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు దీనికి సంబంధించిన ఎర్లీ యాక్సెస్ 24 గంటల ముందే లభించనుంది. అంటే ప్లస్ సభ్యులకు దీని సేల్ సెప్టెంబర్ 26వ తేదీ నుంచే ప్రారంభం కానుందన్న మాట. ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు అందించనున్నారు. ఈ సేల్‌లో గూగుల్ పిక్సెల్ 8, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు లభించనుంది.
ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్‌లో సేల్ ధరలను కంపెనీ టీజ్ చేయడం ప్రారంభించింది. గూగుల్ పిక్సెల్ 8లో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.75,999గా ఉంది. ఈ ఫోన్ రూ.40 వేలలోపు ధరకే ఈ సేల్‌లో లభించనుంది. అలాగే 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ధర ప్రస్తుతం రూ.89,999గా ఉంది. ఇది కూడా రూ.40 వేలలోపే లభించనుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్ల ఫైనల్ ధరను ఫ్లిప్‌కార్ట్ ఇంకా రివీల్ చేయలేదు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
మరిన్ని స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ బేస్ మోడల్‌ను కంపెనీ రూ.79,999కే విక్రయిస్తుంది. ఈ ఫోన్‌ను రూ.30 వేలలోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. అలాగే పోకో ఎక్స్6 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ.20 వేల లోపు ధరకే తగ్గనుంది.
ఇతర స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన సేల్ ధరలను ఫ్లిప్‌కార్ట్ ఇంకా రివీల్ చేయలేదు. సీఎంఎఫ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2ఏ, పోకో ఎం6 ప్లస్, వివో టీ3ఎక్స్, ఇన్‌ఫీనిక్స్ నోట్ 40 ప్రో వంటి అనేక స్మార్ట్ ఫోన్లను చాలా తక్కువ ధరలకు విక్రయించనున్నారు. సీఎంఎఫ్ ఫోన్ 1 ధర రూ.12,999కు తగ్గనుందని తెలుస్తోంది.
దీంతోపాటు పలు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే రూ.50 తగ్గింపు అందించనున్నారు. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్ ద్వారా రూ.లక్ష వరకు పేమెంట్స్ చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
Google Pixel devices Flipkart BBD sales prices revealed. Here's what you should know -
— Harinarayanan p c (@harinarayananpc) September 21, 2024
❌ Do not get any of the 7 series Pixel devices as the Tensor G2 is very unreliable with heating and network issues.
🤔 Pixel 8 stands out for ₹32k, assuming Flipkart isn't doing some shady… pic.twitter.com/I4LK6Bil4c