అన్వేషించండి

File Sharing Techniques : ఇంటర్నెట్ లేకుండానే ఫైల్స్ షేర్ చేయాలా? 7 సింపుల్ మార్గాలు, Android & iPhone యూజర్లకు బెస్ట్

File Sharing : ఇంటర్నెట్ లేకుండా మొబైల్ నుంచి ఫైల్స్ పంపడానికి 7 సులభమైన మార్గాలు ఇక్కడున్నాయి. సులభంగా, సురక్షితంగా ఎలా పంపాలో చూసేద్దాం.

File Sharing Techniques Without Internet : మొబైల్ నుంచి మొబైల్‌కు.. ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌లను షేర్ చేయడం ఈరోజుల్లో సర్వ సాధారణం. కానీ ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు ఫైల్‌ ఎలా పంపాలి అనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఇంటర్నెట్ మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫైల్స్ పంపించడంలో హెల్ప్ చేస్తుంది. అయితే ఇంటర్నెట్ లేకుండా కూడా సులభంగా, సురక్షితంగా, వేగంగా ఫైల్‌లను షేర్ చేసుకోవచ్చని మీకు తెలుసా? అవును ఇంటర్నెట్ లేకుండా మీ Android లేదా iPhoneలో ఫైల్‌లను పంపడానికి హెల్ప్ చేసే 7 సింపుల్ మార్గాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

బ్లూటూత్ (Bluetooth)

నెట్ లేకుండా ఏవైనా ఫైల్స్ పంపాలనుకున్నప్పుడు రెండు ఫోన్‌ల బ్లూటూత్‌ను ఆన్ చేసి.. పెయిర్ చేయాలి. ఆపై ఫైల్ పంపుకోవచ్చు. ఫోటోలు, పాటలు, చిన్న డాక్యుమెంట్‌లు పంపేందుకు ఇది సరిపోతుంది. పెద్ద వీడియో ఫైల్‌ల పంపాలనుకుంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది.

వై-ఫై డైరెక్ట్ 

Wi-Fi Direct సాంకేతికత ఇంటర్నెట్ లేకుండానే వేగంగా ఫైల్‌లను పంపడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. రెండు ఫోన్‌లలో Wi-Fi Directని ఆన్ చేసి కనెక్ట్ చేయండి. ఫైల్ మేనేజర్ లేదా గ్యాలరీ నుంచి ఫైల్‌ను పంపవచ్చు.

నియర్​బై షేర్ (Nearby Share)

ఇది కేవలం Android ఉపయోగించేవారికి మాత్రమే. ఐఫోన్ వారికి ఈ సౌలభ్యం ఉండదు. ఈ నియర్​బై ఫోన్​ సెట్టింగ్‌లలో ఆన్ చేయవచ్చు. ఇది యాక్టివేట్ అయిన తర్వాత.. ఫోటోలు, వీడియోలు, యాప్‌లు, డాక్యుమెంట్‌లను సులభంగా షేర్ చేసుకోవచ్చు.

ఎయిర్‌డ్రాప్ 

ఇది కేవలం Apple వినియోగదారులకు మాత్రమే. AirDrop అనేది ఫైల్స్ పంపేందుకు సులభమైన మార్గం. దీనికోసం AirDropని ఆన్ చేసి ఫైల్‌ను పంపండి. iPhone నుంచి iPhoneకి చాలా వేగంగా ఫైల్ ట్రాన్సఫర్ చేయవచ్చు.

USB OTG కేబుల్

హార్డ్‌వేర్‌తో నేరుగా బదిలీ చేసుకోవచ్చు. మీ దగ్గర OTG కేబుల్ ఉంటే.. మీరు ఒక ఫోన్‌ను నేరుగా మరొకదానికి కనెక్ట్ చేయవచ్చు. ఈ పద్ధతి వేగంగా ఉంటుంది. పెద్ద ఫైల్‌లను కూడా ఈజీగా షేర్ చేయవచ్చు.

ఆఫ్‌లైన్ ఫైల్ షేరింగ్ యాప్‌లు

ప్లేస్టోర్‌లో ఇంటర్నెట్ లేకుండా లోకల్ హాట్‌స్పాట్‌ను ద్వారా ఫైల్‌లను బదిలీ చేసే అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు SHAREit, Xender, Zapya మొదలైనవి ఫైల్స్ పంపేందుకు హెల్ప్ చేస్తాయి. అయితే థర్డ్ పార్టీ యాప్‌లలో డేటా దొంగతనం జరిగే ప్రమాదం ఉంది.

QR కోడ్ స్కానింగ్ ద్వారా 

కొన్ని యాప్‌లు ఫైల్‌ను QR కోడ్‌గా మార్చడం ద్వారా షేరింగ్ సౌకర్యాన్ని అందిస్తాయి. ఎదురుగా ఉన్న ఫోన్ ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.ఫైల్ సులభంగా బదిలీ అయిపోతుంది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
Smart Kitchen Appliances : స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
Google Account Security: మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Election: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Rishabh Pant News: పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
BRS Leaders Arrest: కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
రూ.65 వేల నుంచి లక్ష ధరలో హోండా టూవీలర్స్‌.. షైన్‌, యాక్టివ్‌, డియో, లివో మోడళ్లు
రూ.లక్ష లోపే కొనగలిగే హోండా బైక్ లేదా స్కూటర్.. మీ కోసం 10 రకాల టూవీలర్లు
Embed widget