By: ABP Desam | Updated at : 06 Dec 2022 04:15 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@meta/facebook
జర్నలిజం బిల్లు ఆమోదం పొందితే మెటాకు నష్టం
ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా ఏకంగా అమెరికా ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చింది. జర్నలిజం కాంపిటీషన్ అండ్ ప్రిజర్వేషన్ యాక్ట్ (JCPA) బిల్లును మెటా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే తమ ఫ్లాట్ ఫామ్ నుంచి అమెరికా వార్తలను తొలగిస్తామని వెల్లడించింది. ఈ చట్టం అమల్లోకి వస్తే అమెరికా మీడియా సంస్థలు ఫేస్ బుక్ లో షేర్ చేసే కంటెంట్ కు సంబంధించి ఫీజును ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. దీని మూలంగా మెటాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకే, తమ ఫ్లాట్ ఫామ్ లో ఆయా వార్తా సంస్థలు కంటెంట్ పోస్టు చేయడం వల్ల వారికే మేలు కలుగుతుందని వాదిస్తోంది. ట్రాఫిక్ పెరగడం వల్ల సదరు సంస్థలకే లాభం చేకూరుతుందని వెల్లడించింది.
వాస్తవానికి గతంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సైతం ఇలాంటి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయాన్ని ఫేస్ బుక్ అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించింది. ఆస్ట్రేలియా వార్తా సంస్థలకు సంబంధించిన న్యూస్ కంటెంట్ ను ఫేస్ బుక్ తొలగించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అప్పటి నుంచి తమ నిర్ణయాన్ని కూడా ఫేస్ బుక్ వెనక్కి తీసుకుంది. కెనడాలోనూ ఇలాంటి చట్టం అమల్లోకి వచ్చినా, ఆ తర్వాత రద్దు చేశారు. తాజాగా ఇలాంటి చట్టమే అమెరికా సెనేట్ ముందుకు వచ్చింది. ఇప్పటికే US సెనేట్ జ్యుడీషియరీ కమిటీ సెప్టెంబర్‌లో జర్నలిజం కాంపిటీషన్ అండ్ ప్రిజర్వేషన్ యాక్ట్ ను ఆమోదించింది. దీనిని పూర్తి సెనేట్ ను ఆమోదించాల్సి ఉంది. ఈ బిల్లుకు ఆమోదం పొందితే సోషల్ మీడియా సంస్థల నుంచి రుసుము డిమాండ్ చేసే అవకాశం వార్తా సంస్థలకు లభిస్తోంది.
అటు సోషల్ మీడియా సంస్థలకు వచ్చే యాడ్ రెవెన్యూ నుంచి వార్తా సంస్థలు సైతం వాటా కోరే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వార్తల నుంచి ఫేస్ బుక్ పెద్ద ఎత్తున ఆదాయం అందుకుంటుందని వార్తా సంస్థలు ఆరోపిస్తున్నాయి. కరోనా లాంటి కష్ట సమయంలో ఆదాయం లేక వార్తా సంస్థలు ఇబ్బంది పడితే ఫేస్ బుక్ మాత్రం భారీగా ఆదాయం పొందిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే, ఈ వార్తలను మెటా సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది. తమ ఫ్లాట్ ఫామ్ లో వార్తలను షేర్ చేయడం మూలంగానే ఆయా సంస్థల సైట్లకు ట్రాఫిక్ పెరుగుతోందని వాదిస్తోంది. ఈ విషయంలో మెటా ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. జాతీయ భద్రతా చట్టంలో భాగంగా అసమగ్రంగా పరిశీలించిన జర్నలిజం కాంపిటీషన్ అండ్ ప్రిజర్వేషన్ యాక్ట్ ను సెనేట్ ఆమోదిస్తే అమెరికాకు సంబంధించిన వార్తలను తొలిగించే విషయాన్ని పరిశీలిస్తామని తేల్చి చెప్పింది.
Read Also: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్, ఫీచర్లు మామూలుగా లేవుగా!
Updating Apps: మీ స్మార్ట్ ఫోన్లో యాప్స్ అప్డేట్ చేయట్లేదా? అయితే మీ డేటా ప్రమాదంలో!
Amazon Deal: అమెజాన్లో ఈ ఫోన్పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.12 వేలు తగ్గింపు!
Amazon Deal: మీ భాగస్వామికి బెస్ట్ వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? - అమెజాన్లో వీటిపై ఓ లుక్కేయండి!
Elon Musk to Mr Tweet: ట్విట్టర్ లో పేరు మార్చుకున్న ఎలన్ మస్క్, ఆటాడేసుకుంటున్న నెటిజన్స్
OnePlus 11R: లాంచ్ కు ముందే స్పెసిఫికేషన్లు లీక్, OnePlus 11R ప్రత్యేకతలు ఇవే!
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!