Republic Day Whatsapp Stickers : రిపబ్లిక్ డే విషెస్ ను కొత్తగా చెప్పాలనుకుంటున్నారా.. మీ ఫొటోనే వాట్సాప్ స్టిక్కర్‌గా క్రియేట్ చేసి సెండ్ చేయండిలా..
Republic Day Whatsapp Stickers : జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలిపేందుకు వాట్సాప్ లో సొంతంగా స్టిక్కర్స్ ను క్రియేట్ చేయొచ్చు.

Republic Day - Whatsapp Stickers : ఏ వేడుకైనా ఇతరులతో పంచుకోవడం, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేయడం మామూలే. అప్పట్లో ఎవర్నైనా విష్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఆ వ్యక్తి ఎదురుగా ఉంటే తప్ప విషయాన్ని చెప్పలేని పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. మన జీవితాల్లోకి టెక్నాలజీ వచ్చిన తర్వాత దూరంతో పని లేకుండా ఆ వ్యక్తి ఎక్కడున్నా సరే విష్ చేయడం చాలా సులభమైపోయింది. ఈ రోజుల్లో సోషల్ మీడియాను దాదాపు అందరూ ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ (Whatsapp), యూట్యూబ్ (Youtube), ఇన్ స్టాగ్రామ్ (Instagram) వంటి యాప్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. అందులో ముఖ్యంగా మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను కొన్ని కోట్ల మంది యూజర్స్ ఉపయోగిస్తున్నారు. కేవలం మేసేజెస్ నే కాకుండా వాటిని స్టిక్కర్ల రూపంలోనూ పంపేలా ఇటీవలి కాలంలో సరికొత్త ఫీచర్స్ తీసుకొచ్చింది వాట్సాప్. ఇంతకుముందు ఈ స్టిక్కర్స్ ను యూజ్ చేసుకోవాలంటే ఆయా థీమ్ కు సంబంధించిన వాటిని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పని లేకుండా మనకిష్టమైన ఫొటోను స్టిక్కర్ గా క్రియేట్ చేసి ఇతరులకు పంపొచ్చు. మరో రెండ్రోజుల్లో గణతంత్ర దినోత్సవం రాబోతోంది. కాబట్టి మీరు కూడా ఈ చిన్న టిప్స్ ను ఫాలో అయ్యి, మీకిష్టమైన వారికి ఈ రోజున రిపబ్లిక్ డే (Republic Day) స్టిక్కర్స్ ను స్వయంగా మీరే క్రియేట్ చేసి పంపొచ్చు.
ప్లే స్టోర్ లో వాట్సాప్ స్టిక్కర్స్ ను క్రియేట్ చేసేందుకు అనేక యాప్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఇవి యూజర్స్ కు అనుకూలమైన స్టిక్కర్స్ ను క్రియేట్ చేస్తాయి. ఈ యాప్‌ల సహాయంతో యూజర్లు తమ ఫోటోలలో దేనినైనా స్టిక్కర్లుగా మార్చుకోవచ్చు. అయితే మీరు ఇందుకోసం స్టిక్కర్ మేకర్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయాలి, ఎలా స్టిక్కర్స్ ను క్రియేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- ముందుగా గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) నుంచి స్టిక్కర్ మేకర్ (Sticker Maker) యాప్ ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
- ఆ తర్వాత యాప్‌ను ఓపెన్ చేసి క్రియేట్ న్యూ స్టిక్కర్ ప్యాక్ పై క్లిక్ చేయాలి.
- యూజర్స్ ఇప్పుడు సైజ్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి.
- ఇప్పుడు ఈ స్టిక్కర్ ను మరింత అట్రాక్టివ్ గా చేసేందుకు టెక్ట్స్, ఎమోజీ లాంటి ఎఫెక్ట్స్ ను యాడ్ చేసుకోవచ్చు.
- దీని తర్వాత సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి స్టిక్కర్ ప్యాక్ కి ఏదైనా పేరు పెట్టాలి. అలా యూజర్స్ వారి అవసరానికి అనుగుణంగా అనేక స్టిక్కర్లను క్రియేట్ చేయొచ్చు, యూజ్ చేసుకోవచ్చు.
- వాట్సాప్ కు ఈ స్టిక్కర్స్ ను యాడ్ చేసేందుకు యాడ్ వాట్సాప్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
- వాట్సాప్ లో స్టిక్కర్ ప్యాక్ ను చేర్చాలంటే ఒక ప్యాక్ లో తప్పనిసరిగా కనీసం 3 స్టిక్కర్స్ అయినా ఉండాలి. ఆ తర్వాతే వాట్సాప్ కి యాడ్ చేసుకునేందుకు యాక్సెస్ ఉంటుంది.
Also Read : AI Tools 2025 : 2025లో వెలుగులోకి రానున్న అద్భుతమైన AI టూల్స్.. ఫీచర్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే





















