BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ వచ్చేసింది - ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీ!
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ రూ.797 ప్లాన్ లాంచ్ అయింది. దీని లాభాలు ఏంటంటే?
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే రూ.797 ప్లాన్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉండటం విశేషం. ఈ ప్లాన్ లాభాలను ఒకసారి చూద్దాం...
బీఎస్ఎన్ఎల్ రూ.797 ప్లాన్ లాభాలు
బీఎస్ఎన్ఎల్ ఈ రూ.797 ప్లాన్ వ్యాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించింది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ డేటాను బీఎస్ఎన్ఎల్ అందించనుంది. ఈ 2 జీబీ డేటా అయిపోతే నెట్ స్పీడ్ 80 కేబీపీఎస్‌కు తగ్గిపోనుంది. అయితే 60 రోజుల తర్వాత ఈ డేటా లాభాలు ఎక్స్‌పైర్ అవుతాయి కానీ... సిమ్ కార్డు మాత్రం యాక్టివ్‌గానే ఉంటుంది. ఆ తర్వాత కాల్స్, డేటా లాభాలు కావాలంటే మాత్రం రీచార్జ్ చేసుకోవాలి.
ఆ తర్వాత వినియోగదారులకు రూ.197 ప్లాన్ ఉపయోగపడనుంది. బీఎస్ఎన్ఎల్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. జూన్ 12వ తేదీ లోపు రీచార్జ్ చేసుకున్న వారికి అదనంగా 30 రోజుల వ్యాలిడిటీ కూడా అందించనున్నారు.
ఆసక్తి గల వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వెబ్ సైట్లో రూ.797 ప్లాన్ రీచార్జ్ చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకుంటే నాలుగు శాతం క్యాష్ బ్యాక్ కూడా లభించనుంది. బీఎస్ఎన్ఎల్ ఇటీవలే రూ.329 భారత్ ఫైబర్ ఎంట్రీ లెవల్ ప్లాన్‌ను లాంచ్ చేసింది.
ఈ ప్లాన్ ద్వారా 1 టీబీ డేటాను అందించనున్నారు. 20 ఎంబీపీఎస్ స్పీడ్‌ను ఈ ప్లాన్ అందించనుంది. రోజువారీ లిమిట్ అయిపోయాక ఇంటర్నెట్ స్పీడ్ 2 ఎంబీపీఎస్‌కు పడిపోనుంది. దీంతోపాటు ఫిక్స్‌డ్ లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్‌ను ఉచితంగా అందించనున్నారు. మొదటి నెల బిల్లుపై 90 శాతం డిస్కౌంట్‌ను కూడా అందించనున్నారు.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?
BSNL introduces new special Annual Plan voucher PLAN-797 with additional plan validity of 30 days. Enjoy unlimited calls, unlimited data[speed reduced to 80 kbps after 2GB/day], 100 SMS/day for 60 days. pic.twitter.com/XfFylDuaKt
— BSNL_Karnataka (@BSNL_KTK) March 16, 2022