BSNL Offers: బీఎస్ఎన్ఎల్ దీపావళి ఆఫర్ - ఈ ప్లాన్లతో ఎక్స్‌ట్రా డేటా!
బీఎస్ఎల్ దీపావళి ఆఫర్ కింద కొన్ని ప్లాన్లపై అదనపు డేటాను అందిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం దీపావళి ఆఫర్లను అందిస్తుంది. రూ.251, రూ.299, రూ.398 ప్లాన్లతో రీఛార్జ్ చేస్తే అదనంగా డేటా కూడా లభించనుంది. ఈ విషయాన్ని కంపెనీ తన ఎక్స్/ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ పోర్టల్ ద్వారా రీఛార్జ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ అదనపు డేటా లభిస్తుంది.
రూ.251 ప్లాన్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే అదనంగా 3 జీబీ డేటా లభించనుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 70 జీబీ డేటా అందించనున్నారు. కానీ దీపావళి సందర్భంగా అదనపు డేటా కూడా లభించనింది. దీని వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.
దీంతోపాటు రూ.299 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్నప్పటికీ అదనంగా 3 జీబీ డేటా లభించనుంది. కానీ దీనికి మీరు సెల్ఫ్ కేర్ యాప్ నుంచి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీ లభించనుంది. రోజుకు అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు లభించనున్నాయి.
ఈ లిస్ట్‌లో చేరిన లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్ రూ.398 వోచర్. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 కాల్స్ లభించనుంది. 120 జీబీ డేటా కూడా అందించనున్నారు. ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులకు చేరింది. దీంతోపాటు అదనంగా 3 జీబీ డేటా లభించనుంది. యాప్ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్‌ల్లో బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ అందుబాటులో ఉండనుంది.
మరోవైపు బీఎస్ఎన్ఎల్ గతేడాది రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను మనదేశంలో లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి. వీటిలో అన్నిటికంటే ఖరీదైన ప్లాన్ ధర రూ.1,198 కాగా, చవకైన రెండో ప్లాన్ ధర రూ.439గా ఉంది. బీఎస్ఎన్ఎల్ రూ.1,198 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. లాంగ్ టర్మ్ ప్లాన్లు కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్. నెలకు 3 జీబీ డేటా, 300 నిమిషాల కాలింగ్, 30 ఎస్ఎంఎస్‌లు ఈ ప్లాన్ ద్వారా లభించనున్నాయి. ప్రతి నెల ప్రారంభంలో ఇవి మళ్లీ రెన్యూ అవుతాయి. ముందు నెల డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ లాభాలు మిగిలితే అవి వచ్చే నెలకు క్యారీ అవ్వవని కంపెనీ తెలిపింది.
బీఎస్ఎన్ఎల్ రూ.439 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. అన్‌లిమిడెట్ వాయిస్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్‌లను ఈ ప్లాన్ ద్వారా అందించనున్నారు. అయితే ఈ ప్లాన్ ద్వారా డేటా మాత్రం కంపెనీ అందించడం లేదు.
బీఎస్ఎన్ఎల్ దగ్గర మిగతా నెట్‌వర్క్‌ల లేని ప్లాన్లు కూడా కొన్ని ఉన్నాయి. అదే రూ.398 ప్లాన్. బీఎస్ఎన్ఎల్ రూ.398 ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ డేటాను అందించనుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా లభించనున్నాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. వొడాఫోన్ ఐడియా పోస్ట్ పెయిడ్‌లో రూ.699 ప్లాన్ ద్వారా ఇటువంటి లాభాలను అందించనుంది. కానీ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ చాలా ధర తక్కువగా ఉంది.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?