BSNL Best Long Term Plans: ఒక్క రీఛార్జ్‌తో 395 రోజుల వ్యాలిడిటీ - 790 జీబీ అందించే బీఎస్ఎన్ఎల్ ప్లాన్ - ధర ఎంతంటే?
BSNL 395 Days Plan: బీఎస్ఎన్ఎల్ ఎన్నో బెస్ట్ ప్లాన్లను అందిస్తుంది. ఇందులో ఏకంగా 395 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లు కూడా ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ అందించే బెస్ట్ లాంగ్ టర్మ్ ప్లాన్లు ఇప్పుడు చూద్దాం.
BSNL Long Term Plans: ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు చాలా చవకగా రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఒక వైపు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు తమ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను చాలా పెంచేశాయి. ఈ కథనంలో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న నాలుగు మంచి ప్లాన్ల గురించి తెలుసుకుందాం.
బీఎస్ఎన్ఎల్ రూ. 2399 ప్లాన్
ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ వాలిడిటీ ఏడాది కంటే ఎక్కువ. సాధారణంగా మీరు అన్ని కంపెనీల లాంగ్ టర్మ్ ప్లాన్‌ల గరిష్ట వాలిడిటీని ఒక సంవత్సరం వరకు ఉండటం చూసి ఉంటారు. కానీ బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు ఒక సంవత్సరం కంటే కొన్ని నెలల పాటు వ్యాలిడిటీని పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 395 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌తో మీరు ప్రతిరోజూ 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు.
ఈ ప్లాన్ ద్వారా బీఎస్‌ఎన్ఎల్ వినియోగదారులకు జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమియాన్ మొదలైన ఉచిత సౌకర్యాలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు మొత్తంగా 790 జీబీ డేటాను పొందుతారు.
Also Read: యాపిల్, గూగుల్‌కు శాంసంగ్ పోటీ - ఎస్25 స్లిమ్ లాంచ్ త్వరలో!
బీఎస్ఎన్ఎల్ రూ. 1899 ప్లాన్
ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులుగా ఉంది. దీని ద్వారా రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు మొత్తంగా 600 జీబీ డేటాను పొందుతారు. దీని ద్వారా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమియాన్ మొదలైన ఉచిత సౌకర్యాలను కూడా పొందవచ్చు.
బీఎస్ఎన్ఎల్ రూ. 1499 ప్లాన్
ఈ ప్లాన్ వాలిడిటీ 336 రోజులుగా ఉంది. దీని ద్వారా రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు మొత్తం 24 జీబీ డేటాను పొందుతారు.
బీఎస్ఎన్ఎల్ రూ. 1198 ప్లాన్
ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 365 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు ప్రతి నెలా 3 జీబీ డేటా పొందుతారు. అంటే ఏడాదికి మొత్తం 36 జీబీ డేటా లభిస్తుందన్న మాట. అయితే ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్ రాదు. ఏదైనా నెట్‌వర్క్‌కి కాల్ చేయడానికి 300 నిమిషాల వాయిస్ కాలింగ్ మాత్రమే లభిస్తుంది.
Also Read: అనుకున్న దాని కంటే ముందే ఆండ్రాయిడ్ 16 - ఎప్పుడు రానుందంటే?
#BSNL redefines home entertainment with IFTV – India’s First Fiber-Based Intranet TV Service! Access 500+ live channels and premium Pay TV content with crystal-clear streaming over BSNL’s FTTH network. Enjoy uninterrupted entertainment that doesn’t count against your data limit!… pic.twitter.com/m1OC4XBwsD
— BSNL India (@BSNLCorporate) November 9, 2024
#BSNL brings a revolution in connectivity with #NationalWiFiRoaming! Now #FTTH customers can carry their home WiFi account across the country, accessing free data on BSNL WiFi networks nationwide. It’s secure, simple, and lets you stay connected wherever you travel.… pic.twitter.com/JlwbMAYhio
— BSNL India (@BSNLCorporate) November 8, 2024