BSNL 5G Testing: ఫాస్ట్‌గా పరిగెడుతున్న బీఎస్ఎన్ఎల్ - 5జీ ట్రయల్స్ వేగవంతం!
BSNL 5G Trails: బీఎస్ఎన్ఎల్ 5జీ ట్రయల్స్‌ను మరింత వేగవంతం చేసింది. దీంతోపాటు నెట్‌వర్క్ విస్తరణపై కూడా దృష్టి పెట్టింది. దీని కోసం దేశీయ పరికరాలపైనే బీఎస్ఎన్ఎల్ ఆధారపడింది.
BSNL 5G: గత కొంత కాలం నుంచి బీఎస్ఎన్ఎల్ టెలికాం రంగంలో దూసుకుపోతుంది. దీంతో తన నెట్‌వర్క్‌ను విస్తరించడంలో కూడా దృష్టి పెట్టింది. ఈ భారత ప్రభుత్వ టెలికాం కంపెనీ ఇప్పటికే 5జీ టెస్టింగ్ (5G Network Testing) చేస్తోంది. వీలైనంత త్వరగా దేశంలో 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురావాలని బీఎస్ఎన్ఎల్ ప్రయత్నిస్తోంది.
బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్ టెస్టింగ్ షురూ
బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్ గురించి ప్రత్యేక విషయం ఏంటంటే కంపెనీ దేశీయంగా తయారు చేసిన టెక్నాలజీని ఉపయోగించి 5జీ కనెక్టివిటీని రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్రభుత్వ టెలికాం కంపెనీ స్థానిక టెక్నాలజీ తయారీదారులు, సరఫరాదారులకు మార్కెట్లో తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చింది.
ఈ సిరీస్‌లో గాలోర్ నెట్‌వర్క్స్, వీవీడీఎన్ టెక్నాలజీస్, లేఖా వైర్‌లెస్, వైసిగ్ వంటి కంపెనీలు బీఎస్ఎన్ఎల్ సహకారంతో దాని 5జీని టెస్ట్ చేస్తుంది. విదేశీ సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గించడం, దీర్ఘకాలంలో దిగుమతి బిల్లులను తగ్గించడం ఈ కంపెనీల లక్ష్యం.
భారతీయ టెలికాం కంపెనీ జియోకి దాని స్వంత 5జీ నెట్‌వర్క్ ఉంది. అయితే భారతదేశంలో ఇతర 5జీ నెట్‌వర్క్‌లను రూపొందించడానికి విదేశీ కంపెనీల సహాయం ఇంకా అవసరం. ఎకనమిక్ టైమ్స్ నివేదిక ప్రకారం న్యూఢిల్లీలోని మింటో రోడ్‌లో బీఎస్ఎన్ఎల్ సహకారంతో లేఖా వైర్‌లెస్ 5జీని టెస్ట్ చేస్తుంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
ఎంటీఎన్ఎల్ చాణక్యపురి లొకేషన్‌లో వీవీడీఎన్ 5జీ నెట్‌వర్క్‌ని పరీక్షిస్తోంది. అదే సమయంలో ఢిల్లీలోని ఎంటీఎన్ఎల్ కోసం షాదీపూర్, కరోల్ బాగ్, రాజేంద్ర నగర్‌లోని మూడు సైట్లలో 5జీ నెట్‌వర్క్‌ని అమలు చేయడం ద్వారా గాలోర్ నెట్‌వర్క్స్ పరీక్షిస్తోంది.
పాత 3జీ నెట్‌వర్క్‌తో 5జీని అనుసంధానించడానికి గాలోర్ నెట్‌వర్క్స్ కోరల్ టెలికామ్‌తో భాగస్వామ్యం కలిగి ఉందని నివేదిక పేర్కొంది. టెస్టింగ్‌లో ఉన్న నెట్‌వర్క్ ఆర్కిటెక్చర్‌ను ఓపెన్ RAN (రేడియో యాక్సెస్ నెట్‌వర్క్) అని పిలుస్తారు. ఇక్కడి కోర్ భారతీయ విక్రేతలు దీన్ని సరఫరా చేస్తున్నారు. ఈ భారతీయ విక్రేతలు భవిష్యత్తులో బీఎస్ఎన్ఎల్ నుంచి వాణిజ్య ఒప్పందాలను పొందుతామని నమ్మకంగా ఉన్నారు. దీని కింద ఇది దేశంలో 5జీ నెట్‌వర్క్‌లను విడుదల చేస్తుంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
Next-Level Convenience at Your Fingertips!
— BSNL India (@BSNLCorporate) September 21, 2024
The #BSNLSelfcareApp is your all-in-one solution for landline, FTTH, and mobile services.
Google Play: https://t.co/CVXLFIxtdH
App Store: https://t.co/0mzHyHZENB #BSNLOnTheGo #BSNL #DownloadNow #SwitchToBSNL pic.twitter.com/sgf1L7EAlH
BSNL's plan to success:
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) September 18, 2024
- Wider roll out of the 4G network,
- Attracting and retaining new customers,
- Ensuring customer satisfaction, and
- Successful implementation of Amended BharatNet initiative.@BSNLCorporate pic.twitter.com/dqXZprHSRS