అన్వేషించండి

Black Friday Sale 2023: భారతదేశ మార్కెట్లో బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు - అమెజాన్ నుంచి యాపిల్ వరకు!

Black Friday Sale 2023 Telugu: భారతదేశంలో కొన్ని కంపెనీ బ్లాక్ ఫ్రైడే ఆఫర్లను అందిస్తున్నాయి.

Black Friday Sale 2023 Offers in India: బ్లాక్ ఫ్రైడే సేల్స్ అంటే మొదట అమెరికాలో ఉండే వారికి మాత్రమే పరిమితం అయ్యేవి. కానీ క్రమంగా వాటికి గ్లోబల్ పాపులారిటీ లభించింది. భారత్ వంటి పెద్ద మార్కెట్లలో కూడా బ్లాక్ ఫ్రైడే సేల్స్ విస్తరించాయి. అనేక ఇంటర్నేషనల్ కంపెనీలు, లోకల్ బ్రాండ్స్ ప్రస్తుతం బ్లాక్ ఫ్రైడే సేల్స్‌ను అందిస్తున్నాయి. ఒకవేళ మీకు కూడా బ్లాక్ ఫ్రైడే ఆఫర్ సేల్స్ మీద ఆసక్తి ఉంటే మనదేశంలో ఏయే వెబ్ సైట్లు, రిటైల్ అవుట్‌లెట్లు ఈ సేల్స్‌ సందర్భంగా అందిస్తున్నాయో తెలుసుకుందాం.

మనీ కంట్రోల్ కథనం ప్రకారం... స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర గ్యాడ్జెట్లు, దుస్తులు, ఫుట్‌వేర్‌పై బ్లాక్ ఫ్రైడే సేల్స్ సందర్భంగా బెస్ట్ డీల్స్ అందిస్తున్న రిటైలర్లు, ఈ-కామర్స్ వెబ్ సైట్లు ఇవే.

అమెజాన్ (Amazon Black Friday 2023 Offers)
ప్రస్తుతం అమెజాన్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ కింద పలు ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందిస్తున్నారు. ట్యాబ్లెట్లు, స్పీకర్లు, వాచ్‌లు, స్మార్ట్ ఫోన్లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్, వివో, రియల్‌మీ వంటి బ్రాండ్లపై తమ స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు అందిస్తున్నాయి.

విజయ్ సేల్స్ (Vijay Sales Black Friday 2023 Offers)
విజయ్ సేల్స్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ నేటి నుంచి (నవంబర్ 24వ తేదీ) నుంచి ప్రారంభం అయింది. సైబర్ మండే అయిన నవంబర్ 27వ తేదీ వరకు ఈ సేల్ జరగనుంది. మొబైల్స్, స్మార్ట్ వాచ్‌లు, గృహోపకరణాలు, ల్యాప్‌టాప్‌లు, మ్యూజిక్ గ్యాడ్జెట్లు, కిచెన్ అప్లయన్సెస్, వంట సామాన్లపై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

యాపిల్ ఫోన్లు కావాలనుకునే వారికి కూడా మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 15ను ఈ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా రూ.72,990కే కొనుగోలు చేయవచ్చు. అంతే కాకుండా హెచ్ఎస్‌బీసీ బ్యాంకు క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై కనీసం రూ.20 వేల షాపింగ్ చేస్తే 7.5 శాతం డిస్కౌంట్ లభించనుంది. రూ.7,500 వరకు ఈ డిస్కౌంట్ అందించనున్నారు. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులపై కూడా మంచి క్యాష్‌బ్యాక్, ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి.

క్రోమా (Croma Black Friday 2023 Offers)
నేటి నుంచే (నవంబర్ 24వ తేదీ) క్రోమాలో కూడా బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభం కానుంది. నవంబర్ 26వ తేదీ వరకు సేల్ జరగనుంది. అనేక గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్స్‌పై ఆఫర్లు లభించనున్నాయి. వన్‌ప్లస్, వివో, రియల్‌మీ ఫోన్లపై భారీ తగ్గింపులు అందించనున్నారు.

అజియో (Ajio Black Friday 2023 Offers)
క్లోతింగ్, యాక్సెసరీలు, ఫుట్‌వేర్, ఐవేర్‌లపై అజియోలో 50 శాతం నుంచి 90 శాతం వరకు తగ్గింపు లభించనుంది. నవంబర్ 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ సేల్ జరగనుంది. అలాగే అజియో లూక్స్‌లో మైకేల్ కోర్స్, కేట్ స్పేడ్, స్టెల్లా మెకార్ట్నే వంటి ప్రముఖ గ్లోబల్ బ్రాండ్లపై 50 శాతం వరకు తగ్గింపు అందించారు.

హెచ్ఎండ్ఎం (H&M Black Friday 2023 Offers)
హెచ్అండ్ఎం కూడా తన మెంబర్ కస్టమర్లకు 20 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కొనుగోళ్లపై ఈ ఆఫర్ లభించనుంది.

జారా (Zara Black Friday 2023 Offers)
మరో క్లోతింగ్ బ్రాండ్ జారా కూడా ఎంపిక చేసిన దుస్తులపై 40 శాతం వరకు డిస్కౌంట్లను అందించనుంది. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది. జారా వెబ్‌సైట్, స్టోర్లలో కూడా ఈ ఆఫర్లను ఉపయోగించుకోవచ్చు.

నైకా (Nykaa Black Friday 2023 Offers)
ఈ సేల్‌కు నైకా ‘పింక్ ఫ్రైడే సేల్’ అని పేరు పెట్టింది. 2,100కు పైగా బ్రాండ్లపై ఏకంగా 50 శాతం వరకు తగ్గింపు లభించనుంది. నవంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 4 గంటల నుంచి ఈ సేల్ ప్రారంభం అయింది.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Vidyalaxmi: 'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
Supreme Court : రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
TTD:  టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
2008 DSC Latest News: డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి
డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

US Election Results 5 Reasons for Kamala Harris Defeatజగనన్నపై కారుకూతలు కూస్తార్రా? ఇక మొదలుపెడుతున్నా!Elon Musk Key Role Donald Trump Win | ట్రంప్ విజయంలో కీలకపాత్ర ఎలన్ మస్క్ దే | ABP DesamTrump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Vidyalaxmi: 'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
Supreme Court : రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
TTD:  టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
2008 DSC Latest News: డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి
డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి
Viral Video : కెప్టెన్‌తో గొడవ- మ్యాచ్ మధ్యలోనే కోపంతో వెళ్లిపోయిన విండీస్‌ బౌలర్‌
కెప్టెన్‌తో గొడవ- మ్యాచ్ మధ్యలోనే కోపంతో వెళ్లిపోయిన విండీస్‌ బౌలర్‌
Mahindra Thar: థార్ లవర్స్‌కి గుడ్ న్యూస్ - ఏకంగా రూ.3 లక్షల వరకు డిస్కౌంట్!
థార్ లవర్స్‌కి గుడ్ న్యూస్ - ఏకంగా రూ.3 లక్షల వరకు డిస్కౌంట్!
Samantha: బాలీవుడ్ హీరోతో సమంత లిప్ లాక్... నెట్టింట వీడియో వైరల్
బాలీవుడ్ హీరోతో సమంత లిప్ లాక్... నెట్టింట వీడియో వైరల్
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో చిచ్చు రేపిన ప్లకార్డు - కొట్టుకున్న ఎమ్మెల్యేలు
జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో చిచ్చు రేపిన ప్లకార్డు - కొట్టుకున్న ఎమ్మెల్యేలు
Embed widget