Best Earbuds Under Rs 3000: రూ.మూడు వేలలోపు బెస్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - వన్‌ప్లస్ నుంచి బోట్ వరకు!
Best Earbuds: ప్రస్తుతం మనదేశంలో రూ.మూడు వేలలోపు ధరలో చాలా వైర్‌లెస్ ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిలో బెస్ట్ మాత్రం కొన్నే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
![Best Earbuds Under Rs 3000: రూ.మూడు వేలలోపు బెస్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - వన్‌ప్లస్ నుంచి బోట్ వరకు! Best Earbuds Under Rs 3000 OnePlus Nord Buds 3 Realme Buds T310 Check List Best Earbuds Under Rs 3000: రూ.మూడు వేలలోపు బెస్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - వన్‌ప్లస్ నుంచి బోట్ వరకు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/06/50c752ee23310f1659d06ad90ea2387817334882359161071_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Earbuds Under 3000: మనదేశంలో ఇయర్‌బడ్స్‌కు డిమాండ్ బాగా పెరుగుతోంది. ప్రజలు తమ సౌలభ్యం, వినోదం కోసం ఇయర్‌బడ్స్‌ను ఉపయోగిస్తారు. మీరు కూడా బడ్జెట్ ధరలో అత్యుత్తమ ఇయర్‌బడ్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటే మనదేశంలో చాలా ఆప్షన్లు. రూ.3 వేలలోపు ధరలో ఉన్న బెస్ట్ ఇయర్ ఫోన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో వన్‌ప్లస్ నుంచి రియల్‌మీ వరకు అనేక కంపెనీల ఇయర్‌బడ్స్ ఉన్నాయి. వీటిలో మంచి ఫీచర్లు కూడా కనిపిస్తాయి.
వన్‌ప్లస్ నార్డ్ బర్డ్స్ 3 (OnePlus Nord Buds 3)
ప్రస్తుతం వన్‌ప్లస్ ఇయర్‌బడ్స్‌కు మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. ఈ డివైస్‌లో కంపెనీ 12.4 ఎంఎం డైనమిక్ డ్రైవర్లను అందించింది. ఇది కాకుండా ఈ బడ్స్‌లో నాలుగు మైక్రోఫోన్లు అందించనున్నారు. వన్‌ప్లస్ నార్డ్ బర్డ్స్ 3లో 58 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ డివైస్ ఏఎన్‌సీలో ఎనిమిది గంటల బ్యాకప్‌ను ఇస్తుంది. ఈ బడ్స్ ఛార్జింగ్ కేసుతో కలిపి 28 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఛార్జింగ్ కేస్, ఇయర్‌బడ్స్‌ను కలిపి 10 నిమిషాలు ఛార్జింగ్ పెడితే 11 గంటల బ్యాకప్ లభిస్తుంది. ఏఎన్‌సీ, ఐపీ55 రేటింగ్, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించారు. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో వీటి ధర రూ.2,099గా ఉంచారు.
రియల్‌మీ బడ్స్ టీ310 (Realme Buds T310)
రియల్‌మీ ఇయర్‌బడ్స్ కూడా మార్కెట్లో బాగా మంచి పేరు పొందాయి. ఏఎన్‌సీ, 12.4 ఎంఎం డైనమిక్ డ్రైవర్స్ వంటి ఫీచర్లు ఈ బడ్స్‌లో అందించారు. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ ఇయర్‌బడ్స్ 40 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తాయి. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇవి సపోర్ట్ చేయనున్నారు. ఈ డివైస్ ఐపీ55 రేటింగ్‌తో వస్తుంది. అంటే ఈ ఇయర్‌బడ్స్ నీరు, దుమ్ము వల్ల పాడైపోలేదన్న మాట. ఈ ఇయర్‌బడ్స్ కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో ఐదు గంటల బ్యాకప్‌ను అందిస్తాయి. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డివైస్ ధర రూ. 1998గా నిర్ణయించారు.
Also Read: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3 ప్రో (OnePlus Nord Buds 3 Pro)
వన్‌ప్లస్ ఇయర్‌బడ్స్‌ను కంపెనీ తీసుకొచ్చిన బెస్ట్ ఇయర్‌బడ్స్‌లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ డివైస్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో పాటు 12.4 ఎంఎం డైనమిక్ డ్రైవర్స్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఇయర్‌బడ్స్ 44 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తాయి. అలాగే ఈ డివైస్ కేవలం 10 నిమిషాల ఛార్జ్‌పై 11 గంటల బ్యాకప్‌ను ఇస్తుంది. ఈ ఇయర్‌బడ్‌లో మూడు ఇన్ బిల్ట్ మైక్రోఫోన్‌లు ఉన్నాయి. అలాగే ఇది ఇతర డివైస్‌లకు సులభంగా కనెక్ట్ అయ్యే బ్లూటూత్ 5.4 వెర్షన్‌ని కలిగి ఉంది. ఈ డివైస్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 2799కి లిస్ట్ అయింది.
బోట్ నిర్వాణ (Boat Nirvana)
బోట్ అందిస్తున్న ఈ ఇయర్‌బడ్స్ మార్కెట్‌లోని అనేక డివైస్‌లతో పోటీపడే ప్రీమియం ఇయర్‌బడ్స్ అని చెప్పవచ్చు. ఈ డివైస్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో 360 డిగ్రీల స్పేషియల్ ఆడియో సౌకర్యాన్ని అందిస్తుంది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ ఇయర్ బడ్స్ 50 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఈ డివైస్ బరువు కేవలం 45 గ్రాములు మాత్రమే. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఇయర్‌బడ్స్ ధర రూ. 2999గా ఉంది.
Also Read: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)