5G Phones Under Rs 20k: రూ.20 వేలలోపు టాప్ 5జీ ఫోన్లు ఇవే - న్యూ ఇయర్ ఆఫర్లలో రేట్ ఇంకా తగ్గచ్చేమో!
Best Smartphones Under Rs 20000: రూ.20 వేలలోపు బడ్జెట్ ధరలో ఎన్నో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో బెస్ట్ అంటే మాత్రం కొన్నే.
Smartphones Under Rs 20000: 2023 సంవత్సరం దాదాపు ముగిసిపోవడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం నవంబర్ చివరిలో ఉన్నాం. ఇంకా కేవలం ఒక నెల మాత్రమే మిగిలి ఉంది. ఆ తర్వాత కొత్త సంవత్సరం 2024 ప్రారంభం కానుంది. ఈ సమయంలో వివిధ రకాల స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. అలాగే ఆన్‌లైన్‌లో దాదాపు అన్ని కంపెనీల ధరలు మార్కెట్ ధర కంటే కొంచెం తక్కువగా ఉన్నాయి. మీరు సంవత్సరం చివరిలో స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, రూ. 20 వేలలోపు ఏదైనా ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
మోటో జీ84 5జీ (Moto G84 5G)
ఈ మోటొరోలా ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంది. ఇది 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ స్టోరేజీ మొత్తాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ వెనకవైపు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా సెన్సార్ కూడా ఉంది. మోటో జీ84 ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే ఫోన్ ఒకటిన్నర రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ అందించనుందని మోటొరోలా పేర్కొంది. మోటో జీ84 ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉంది. దీని ధర రూ. 17,999 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ వివా మాగెంటా రంగులో అందుబాటులో ఉంటుంది.
రియల్‌మీ 10 ప్రో 5జీ (Realme 10 Pro 5G)
ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ ఎల్సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ముందువైపు అందించారు. ఈ ఫోన్‌లో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 50 శాతానికి ఛార్జ్ చేయడానికి 20 నిమిషాలు సరిపోతుంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంకు సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ. 18,999 నుండి ప్రారంభమవుతుంది.
ఐకూ జెడ్7 5జీ (iQoo Z7 5G)
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.38 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్ ఉన్న అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ ద్వారా రన్ కానుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 2 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ లెన్స్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, దీంతోపాటు 44W ఫ్లాష్ చార్జ్ సపోర్ట్ కూడా అందించారు. దీని ధర రూ.18,999 నుంచి ప్రారంభం కానుంది.
పోకో ఎక్స్5 ప్రో (Poco X5 Pro)
ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్ ఉన్న 10 బిట్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై పోకో ఎక్స్5 ప్రో పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. క్వాల్‌కాం డైమెన్సిటీ 778జీ ప్రాసెసర్ ద్వారా రన్ కానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు. దీని ధర రూ.18,499 నుంచి ప్రారంభం కానుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!