By: ABP Desam | Updated at : 22 Sep 2023 01:24 PM (IST)
నేటి నుంచి ఐఫోన్ 15 విక్రయాలు, యాపిల్ స్టోర్ వద్ద బారులు తీరిన జనం!
iPhone 15: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న యాపిల్ 15 సిరీస్ ఫోన్ల రిటైల్ విక్రయాలు నేటి నుంచి అంటే శుక్రవారం (సెప్టెంబర్ 22) నుంచి ప్రారంభమయ్యాయి. యాపిల్ కొత్తగా లాంఛ్ చేసిన ఐఫోన్ 15 సిరీస్ మోడళ్లను ముందుగా దక్కించుకోవడానికి ముంబై, ఢిల్లీ ప్రజలు పోటీ పడుతున్నారు. ముంబైలోని తొలి రిటైల్ స్టోర్ బీకేసీ వద్దకు గురువారం సాయంత్రం నుంచే క్యూలైన్లలో బారులుతీరారు.
తన ఐఫోన్ 15ను దక్కించుకునేందుకు అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచే యాపిల్ స్టోర్ వద్ద వేచి ఉన్నట్లు చెప్పడం గమనార్హం. ఎలాగైనా తొలి రోజునే తమ డ్రీమ్ ఫోన్ దక్కించుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచే అక్కడే ఉన్నానని, తొలి ఐఫోన్ తీసుకునేందుకు నేను 17 గంటలుగా క్యూలైన్లలో వేచి ఉన్నట్లు చెప్పారు. అహ్మదాబాద్ నుంచి వచ్చిన మరో వ్యక్తి మాట్లాడుతూ.. గురువారం రోజునే ఇక్కడికి వచ్చానని చెప్పారు. స్టోర్ వద్దకు ఇవాళ ఉదయం 5-6 గంటల మధ్య చేరుకున్నట్లు తెలిపారు. బెంగళూరు నుంచి వచ్చిన మరో వ్యక్తి మాట్లాడుతూ.. తాను ఐఫోన్ 15 ప్రో ను పొందేందుకు ఎంతో ఉత్సాహంతో ఉన్నట్లు చెప్పారు. దేశంలో రెండో యాపిల్ స్టోర్ అయిన ఢిల్లీలోని సిటీ వాక్ మాల్ వద్ద సైతం ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ కోసం యాపిల్ స్టోర్ ముందు శుక్రవారం తెల్లవారుజాము నుంచే పడిగాపులుగాస్తున్నారు.
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ‘యాపిల్’ సెప్టెంబర్ 12న వండర్‌లస్ట్ ఈవెంట్‌లో ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. 15 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లను యాపిల్ రిలీజ్ చేసింది.
ఐఫోన్ 15 మోడల్స్, ధరలు
ఐఫోన్ 15
సైజు – 147.6 X 71.6 X 7.8ఎంఎం. తెర : 6.1 అంగుళాలు, బరువు : 171 గ్రా., చాసిస్ : అల్యూమినియం, మెయిన్ కెమెరా : 48 MP, అల్ట్రా వైడ్ : 12MP, బ్యాటరీ : 3877, ఎహెచ్, ఓఎస్ : ఐఓఎస్ 17, ధర: రూ. 79,900
ఐఫోన్ 15 ప్లస్
సైజు – 147.6 X 71.6 X 7.8ఎంఎం., తెర : 6.7 అంగుళాలు, బరువు : 171 గ్రా., చాసిస్ : అల్యూమినియం, మెయిన్ కెమెరా : 48 MP, అల్ట్రా వైడ్ : 12MP, బ్యాటరీ : 4912 ఎంఎహెచ్, ఓఎస్ : ఐఓఎస్ 17, ధర : రూ.89,900
ఐఫోన్ 15ప్రొ
సైజు-146.6 X 70.6 X 8.25ఎంఎం. తెర : 6.1 అంగుళాలు, బరువు : 188 గ్రా. చాసిస్ : టైటానియం, మెయిన్ కెమెరా : 48 MP, టెలీఫోటో: 12.7MP, అల్ట్రా వైడ్ : 13.4 MP, బ్యాటరీ : 3650 ఎంఎహెచ్, ఓఎస్ : ఐఓఎస్ 17, ధర: రూ.1,34,900
ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్
సైజు – 159.9 X 76.7 X 8.25ఎంఎం. తెర : 6.7 అంగుళాలు బరువు : 221గ్రా. చాసిస్ : టైటానియం మెయిన్ కెమెరా : 48 MP, టెలీఫోటో: 12.7MP - 85ఎంఎం పెరిస్కోప్, అల్ట్రా వైడ్ : 13.4 MP బ్యాటరీ : 4852 ఎంఎహెచ్ ఓఎస్ : ఐఓఎస్ 17 ధర : 1,59,900
యాపిల్ వాచ్‌లు
యాపిల్‌వాచ్ 9 ను కూడా యాపిల్ విడుదల చేసింది. ఎస్9 చిప్‌తో పాటు, 18 గంటల బ్యాటరీ లైఫ్ దీని ప్రత్యేకతలు. వాచ్‌ఓఎస్ 10తో రానుంది. దీని ధర రూ. 41,900 ఉండనుంది. అలాగే యాపిల్ వాచ్ ఎస్ఈ2ను లాంచ్ చేసింది. దీని ధర 29,9900గా ఉండనుంది.
యాపిల్ వాచ్ అల్ట్రా2: సాహసయాత్రికుల కోసం గతేడాది వచ్చిన అల్ట్రాకు కొనసాగింపిది. సిగ్నల్ లేకపోయినా సాటిలైట్ సహాయంతో పనిచేస్తుంది. కఠినమైన వాతావరణాలలోనూ, ఎక్కువ నీటి లోతుల్లోనూ ఇది నిరంతరాయంగా పనిచేస్తుంది.
Smartphone Prices: ప్లీజ్... రేట్లు తగ్గించండి - స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు మొబైల్ రిటైలర్ల లెటర్!
Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్ - డేటా మరింత సేఫ్ అయ్యేలా!
Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!
Nudify Apps: అలాంటి యాప్‌లకు పెరుగుతున్న పాపులారిటీ- సంచలనం సృష్టిస్తున్ననివేదిక, !
WhatsApp New Feature: త్వరలో వాట్సాప్ సూపర్ మ్యూజిక్ ఫీచర్ - ఇకపై వీడియో కాల్స్‌లో కూడా!
TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన
Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం
Bhagwant Mann: 'అబద్ధాల మా నాన్న మూడోసారి తండ్రి కాబోతున్నారు' - పంజాబ్ సీఎం భగవంత్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు
MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!
/body>