Amazon Pay Cash Load System: ఇంటి దగ్గరే రూ.2,000 నోటు మార్చుకోవచ్చు - కొత్త పద్ధతికి తెర తీసిన అమెజాన్!
రూ.2,000 నోటును మార్చుకోవడానికి అమెజాన్ కొత్త దారిని చూపిస్తుంది.
Amazon Pay Cash Load System: ఆర్‌బీఐ రూ. 2,000 నోటును చెలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రతి ఒక్కరూ తమ నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుకు వెళ్లాలని కూడా విజ్ఞప్తి చేసింది. రూ.2000 నోటును మార్చుకునేందుకు ఆర్బీఐ ప్రజలకు గడువు విధించింది. ఈ ప్రకటన తర్వాత రూ.2000 నోట్లను మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకులకు వెళ్లడం తప్పడం లేదు. ప్రజలు సులభంగా నోట్లను మార్చుకునేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 'అమెజాన్ పే క్యాష్ లోడ్ సిస్టమ్'ను ప్రవేశపెట్టింది. దీని కింద మీరు ఒక నెలలో రూ. 50,000 వరకు ఇంటి వద్దే అమెజాన్ యాప్ ద్వారా మార్చుకోవచ్చు.
అమెజాన్ ద్వారా మీరు నోట్లు మార్చుకుంటే, మీరు మీ 'Amazon Pay Wallet'లో ఆన్‌లైన్‌లో డబ్బు పొందుతారు. మీరు Amazon Payలో నగదు ద్వారా యాప్‌లో షాపింగ్ చేయవచ్చు లేదా దానిని మీ బ్యాంకుకు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.
2000 నోట్లను ఇలా మార్చుకోండి
1. రూ. 2000 నోటును మార్చుకోవడానికి, ముందుగా మీరు క్యాష్ లోడ్‌కు అర్హత ఉన్న కొన్ని వస్తువులను అమెజాన్ నుండి ఆర్డర్ చేయాలి.
2. చెక్అవుట్ ప్రక్రియలో, "క్యాష్ ఆన్ డెలివరీ" ఎంపికను ఎంచుకోండి.
3. ఇప్పుడు డెలివరీ ఏజెంట్ మీ ఇంటికి వచ్చినప్పుడు, మీరు మీ Amazon Pay బ్యాలెన్స్‌లో డబ్బు డిపాజిట్ చేయాలనుకుంటున్నారని అతనికి తెలియజేయండి.
4. డబ్బును ఏజెంట్‌కి ఇవ్వండి. డెలివరీ చేసే వ్యక్తి ఈ డబ్బును చెక్ చేసి మీ Amazon Pay వాలెట్‌కి నగదును బదిలీ చేస్తాడు.
5. లావాదేవీ పూర్తయిన తర్వాత మీ ఖాతాలో డబ్బు విజయవంతంగా జమ చేయబడిందా లేదా అని మీరు అమెజాన్ పే బ్యాలెన్స్‌లో చెక్ చేయవచ్చు.
ప్రస్తుతం రూ.2000 నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ ప్రజలకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు సమయం ఇచ్చింది. దీని తర్వాత పరిస్థితిని బట్టి ఆర్బీఐ ఈ కాలపరిమితిని మరింత పెంచవచ్చు.
అమెజాన్ ప్రైమ్ లైట్ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. కంపెనీ అందిస్తున్న ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కంటే ఇది కొంచెం చవకైన ప్లాన్. ఈ ప్లాన్ ఇప్పటికే కొంతమంది యూజర్లకు రోల్ అవుట్ అయింది. దీని ద్వారా వినియోగదారులకు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా రెండు రోజుల ఫ్రీ డెలివరీలు లభించనున్నాయి. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌లో ఉండే కంటెంట్ ఉచితంగా లభించనుంది. కానీ అమెజాన్ మ్యూజిక్, అమెజాన్ గేమింగ్, ప్రైమ్ రీడింగ్ వంటి ఆప్షన్లు లభించవు.
అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ధర ఎంత?
అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ధర సంవత్సరానికి రూ.999గా ఉంది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ రెగ్యులర్ ప్లాన్ ధర రూ.1,499గా ఉంది. ఒరిజినల్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌కు ఇది కొంచెం టోన్డ్ డౌన్ వెర్షన్ అని చెప్పవచ్చు. మరోవైపు ఫ్రీ డెలివరీ, ప్రైమ్ సేల్స్‌కు ఎర్లీ యాక్సెస్, అమెజాన్ ప్రైమ్ వీడియోకు యాక్సెస్ వంటి లాభాలు ఈ ప్లాన్ ద్వారా లభించనున్నాయి.
అమెజాన్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ యాప్‌ల ద్వారా ఈ లైట్ ప్లాన్ కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ప్రస్తుతం మీ అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాన్ నుంచి చవకైన ప్రైమ్ లైట్ ప్లాన్‌కు కూడా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది.