(Source: ECI/ABP News/ABP Majha)
Amazon Vs Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో ఏ కార్డులపై ఆఫర్లు ఉన్నాయి? - వీటి ద్వారా మరింత తగ్గనున్న ధరలు!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో ఏ కార్డులపై ఆఫర్లు లభించనున్నాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని రెండు సంస్థలూ అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 8వ తేదీ నుంచి ఈ సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ సేల్స్‌లో ఎన్నో ఉత్పత్తులపై ఆఫర్లు, డీల్స్, డిస్కౌంట్లు లభించనున్నాయి. వీటిలో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లు ఉండనున్నాయి. దీంతోపాటు వినియోగదారులు అమెజాన్ కిక్‌స్టార్టర్ డీల్స్, ఫ్లిప్‌కార్ట్ సేల్ ప్రైస్ లైవ్ ప్రమోషన్ల ద్వారా సేల్‌కు ముందే కొన్ని ఉత్పత్తులపై ఆఫర్లను అందుకోవచ్చు.
దీంతోపాటు ఈ రెండు సేల్స్‌లోనూ పలు క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే మీరు మరింత తక్కువ ధరకు ఉత్పత్తులను పొందే అవకాశం ఉంది. ఇది మీ సేవింగ్స్‌ను మరింత పెంచుతుంది. ఈ అదనపు డిస్కౌంట్ల కోసం మీరు ఆయా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులను అందుబాటులో ఉంచుకోవడం ఉత్తమం.
ఈ కార్డులపై అమెజాన్ ఆఫర్లు...
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. దీంతోపాటు స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా తగ్గింపు లభించనుంది.
ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు ఈ కార్డులతోనే!
ఒకవేళ మీ దగ్గర యాక్సిస్ బ్యాంకు, కొటక్ బ్యాంకు లేదా ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డులు ఉంటే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో 10 శాతం అదనపు తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ కాయిన్స్ ఉపయోగించడం ద్వారా ధర మరింత తగ్గనుంది.
అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లు, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ ఉన్నవారికి ఉన్న మరో అడ్వాంటేజ్ ఏంటంటే... వీరికి ముందుగానే సేల్ ప్రారంభం అవుతుంది. ఉదాహరణకు మీ దగ్గర అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే మీకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్ అక్టోబర్ 7వ తేదీ నుంచే ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ లేని వారికి 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది.
మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియో తన సర్వీసులో యాడ్స్ వేయడం త్వరలో ప్రారంభించనుంది. ఇప్పటివరకు అమెజాన్ ప్రైమ్‌లో సినిమాలు, సిరీస్‌లు చూసేటప్పుడు యాడ్స్ ఎక్కువగా వచ్చేవి కావు. కానీ త్వరలో ప్రైమ్ వీడియోలో ప్లే అయ్యే కంటెంట్‌లో యాడ్స్‌ను కూడా కచ్చితంగా చూడాల్సి వస్తుంది. 2024 ప్రారంభం నుంచి అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ, కెనడా దేశాల్లో ప్లే అయ్యే కంటెంట్‌లో యాడ్లు రానున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, మెక్సికోల్లో తర్వాతి దశలో ప్రారంభించనున్నారు. కానీ భారతదేశం సంగతి మాత్రం తెలియరాలేదు.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial