Amazon Sale: త్వరలో అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ - భారీ ఆఫర్లు కూడా!
అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ వచ్చే నెలలో జరగనుంది.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వచ్చే నెలలో భారతదేశంలో స్పెషల్ సేల్‌ను తీసుకురానుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో జరిగిన ఈ సేల్‌లో కస్టమర్లు గొప్ప డిస్కౌంట్‌లతో షాపింగ్ చేసే అవకాశాన్ని పొందుతారు. ఇందులో మీరు అన్ని రకాల ఉత్పత్తులపై అత్యుత్తమ డీల్స్‌ను పొందుతారు. సేల్ సమయంలో మీరు ఎస్‌బీఐ కార్డుతో షాపింగ్ చేస్తే, మీకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్, మొబైల్ యాక్సెసరీస్, టీవీ ఉపకరణాలు, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ అండ్ కిచెన్‌తో సహా అనేక ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ సెల్‌లో అనేక రకాల బ్రాండ్లకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయగలరు. అమెజాన్ ఈ సేల్‌లో సెగ్మెంట్ల వారీగా షాపింగ్ స్పెషల్స్‌ను కూడా అందుబాటులో తీసుకువస్తుంది.
ఈ సేల్‌లో ప్రారంభ ధర రూ.7,790కి రిఫ్రిజిరేటర్లు, రూ.6,999కి స్మార్ట్ టీవీ, రూ.5,990కి వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయవచ్చు. మీరు కేవలం రూ. 799 ఈఎంఐతో 32 అంగుళాల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 50 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. నిత్యవసర వస్తువులు, పుస్తకాలు, వినోదం సహా అనేక వస్తువుల విక్రయం కేవలం రూ.99 నుంచి ప్రారంభమవుతుంది.
ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్ అయితే అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ 2023 సేల్‌లో మీరు 12 గంటల ముందుగానే సేల్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఈ సేల్‌లో మీకు 30 రోజుల ఉచిత ప్రైమ్ మెంబర్‌షిప్ ట్రయల్ కూడా అందించనున్నారు. సేల్‌లో కూపన్లు, క్యాష్‌బ్యాక్ రివార్డులు కూడా లభించనున్నాయి.
మరోవైపు హానర్ 90 మనదేశంలో సెప్టెంబర్‌లో లాంచ్ కానుందని తెలుస్తోంది. చాలా కాలం తర్వాత తిరిగి హానర్ బ్రాండ్ భారతదేశంలో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మొబైల్ చైనాలో 2023 ప్రారంభంలోనే అందుబాటులోకి వచ్చింది. ఇందులో 200 మెగాపిక్సెల్ కెమెరాను వెనకవైపు కంపెనీ అందించనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై హానర్ 90 పని చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 66W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. మనదేశంలో ఈ ఫోన్ వేరే స్పెసిఫికేషన్లతో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్లో ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. ఈ వివరాలను ప్రముఖ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ రివీల్ చేశారు. చైనాలో హానర్ 90 ఇప్పటికే లాంచ్ అయింది. అక్కడ ఈ స్మార్ట్ ఫోన్ ధరను 2,499 యువాన్లుగా (సుమారు రూ.28,700) నిర్ణయించారు. ఇది 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర.
హానర్ 90 స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో రూ.45 వేల రేంజ్‌లో లాంచ్ చేస్తారని తెలుస్తోంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్ ఉన్న స్మార్ట్ ఫోన్లకు రూ. 45 వేల ధర అంటే చాలా ఎక్కువ. అయితే ఇండియన్ వెర్షన్‌లో మరో ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ ఉంటుందా లేకపోతే ఇదే ఉంటుందా అన్నది చూడాలి. గూగుల్ పిక్సెల్ 7ఏ, నథింగ్ ఫోన్ 2, ఐకూ నియో 7 ప్రో, వన్‌ప్లస్ 11ఆర్‌లతో హానర్ 90 పోటీ పడనుంది.
Read Also: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial