Amazon Prime Cheapest Subscription: అమెజాన్ ప్రైమ్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. ఇక రూ.129కే!
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మనదేశంలో తన నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే అమెజాన్ రూ.129 ప్లాన్.

అమెజాన్ భారతదేశంలో తన పాపులర్ నెలవారీ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను తిరిగి తీసుకువచ్చింది. ఆన్‌లైన్ లావాదేవీల ప్రాసెసింగ్‌కు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆథెంటికేషన్(AFA) అమలు కోసం ఈ సంవత్సరం ప్రారంభంలో దీన్ని తీసేశారు. అమెజాన్ ఇప్పటి వరకు మూడు నెలలు, వార్షిక ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లను మాత్రమే అందిస్తోంది, అయితే నెలవారీ రూ. 129 ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఇప్పుడు కంపెనీ సైట్‌లో లైవ్‌లో కనిపిస్తుంది. ఈ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ను అన్ని ఎలక్ట్రానిక్ పద్ధతుల ద్వారా కొనుగోలు చేయలేం.
ఈ-కామర్స్ దిగ్గజం ఇప్పుడు ప్రైమ్ మెంబర్‌షిప్ కోసం మూడు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను లిస్ట్ చేసింది. వార్షిక ప్రణాళిక ధర రూ. 999, అయితే మూడు నెలల ప్లాన్ అసలు ధర రూ.387 కాగా, ప్రస్తుతం రూ. 329కే అందుబాటులో ఉంది. ఈ రెండు ప్లాన్‌లను అమెజాన్ సైట్ నుండి అన్ని ఎలక్ట్రానిక్ పద్ధతుల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇక నెలవారీ ప్లాన్‌ను రూ.129కే అందిస్తున్నట్లు అమెజాన్ లిస్టింగ్‌లో చూడవచ్చు. అయితే దీనిని క్రెడిట్ కార్డులు లేదా ఎంపిక చేసిన డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్ నవరాత్రి సేల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెజాన్ రూ.129 నెలవారీ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఆర్‌బీఐ ఈ-మాండేట్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న బ్యాంకుల ద్వారా మాత్రమే కొనుగోలు చేయవచ్చని కంపెనీ టెర్మ్స్ అండ్ కండిషన్ పేజీలో చూడవచ్చు. మార్పులను పాటించని అన్ని బ్యాంకులు ఆటోమేటెడ్ చెల్లింపుల కోసం ఇలాంటి అభ్యర్థనలను ప్రాసెస్ చేయలేకపోవచ్చు.
కొత్త ఆర్‌బీఐ మార్గదర్శకాల కారణంగా, అమెజాన్ తదుపరి నోటీసు వచ్చేవరకు అమెజాన్ ప్రైమ్ కొత్త మెంబర్లకు అందించే ఫ్రీ ట్రయల్‌ను నిలిపివేసింది. దానికి మాత్రం ఎటువంటి మార్పులూ చేయలేదు.
కొత్త ఆర్‌బీఐ ఆదేశాల మేరకు రూ.5,000 లోపు జరిగే పునరావృత లావాదేవీల కోసం ఒకేసారి AFAని అమలు చేయాలని బ్యాంకులను కోరింది. రూ.5,000 కట్-ఆఫ్ పైన ఉన్న లావాదేవీలకు ప్రతి చెల్లింపుకు AFA కచ్చితంగా అవసరం. వినియోగదారులు తమ కార్డులపై అనుకోకుండా జరిగే పునరావృత చెల్లింపులను నిరోధించడానికి కొత్త మార్గదర్శకాలు మొదటగా 2019లో ప్రవేశపెట్టబడ్డాయి. ఈ ఫ్రేమ్‌వర్క్ చివరకు అనేక ఆలస్యాల తర్వాత అక్టోబర్ 1వ తేదీన అమలులోకి వచ్చింది.
Also Read: Facebook Server Down: మళ్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. ఇంతకీ ఏమైనట్టు?
Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

