Google 27th Birthday: Google గురించి 27 ఆసక్తికర విషయాలు! మీ జీవితంలో Google పాత్ర ఏంటో తెలుసా?
Google 27th Birthday: అంతర్జాతీయ టెక్ దిగ్గజం Google ఇవాళ 27వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఓ చిన్న గ్యారేజ్‌లో మొదలైన ఈ టెక్ కంపెనీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ జెయింట్‌గా అవతరించింది.

Google Amazing Facts: మనం గూగుల్ ప్రొడక్టు ఉపయోగించని రోజు ఒక్కటైనా ఉంటుందా..? ఏ సమాచారం కావాలన్నా గూగుల్ Google సెర్చ్, అఫీషియల్ మెయిల్ కోసం Gmail, ఆఫీసు వర్క్ కోసం Google Docs, వీడియోలు చూడాలంటే.. Youtube, ఆండ్రాయిడ్ యాప్లు ఇలా మన ఇంట్లోకి Google వచ్చేసిందా.. లేక గుగులమ్మ ఇంట్లో మనం ఉన్నామో అర్థం కానంత స్థాయిలో ఇది మన జీవితంలో భాగమైపోయింది. సెప్టెంబర్ 27 గూగుల్ పుట్టినరోజు.. ఇవాల్టికి గూగుల్ పుట్టి 27 సంతత్సరాలు. 27th బర్త్‌డే సందర్భంగా గూగుల్ గురించి 27 ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
గూగుల్ గురించి 27 అద్భుతమైన వాస్తవాలు:(27 Amazing Facts about Google):
1. అసలు పేరు 'బ్యాక్‌రబ్': స్టాన్‌ఫోర్డ్‌లో గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ అభివృద్ధి చేసిన సెర్చ్ ఇంజన్ మొదటి పేరు "బ్యాక్‌రబ్"(BackRub). ఇది వెబ్‌సైట్ ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి దాని బ్యాక్‌లింక్‌లను విశ్లేషించేది.
2. అది ఒక తప్పు పేరు: గూగుల్(Google)అనే పేరు "గూగోల్"(Googol)అనే గణిత పదానికి తప్పుగా రాసిన రూపం. గూగోల్ అంటే 1 తరువాత 100 సున్నాలు ($10^{100}$)ఉండే సంఖ్య.
3. LEGO బ్లాక్‌తో సర్వర్: చిన్న పిల్లలు ఆడుకునే LEGO బిల్డింగ్ బ్లాక్స్ తెలుసు కదా.. మొదట సెర్చ్ ఇంజన్ డేటా కోసం LEGO బ్రిక్స్ తో సర్వర్ రూమ్ తయారు చేశారు. దాన్నైతే.. ఎప్పటికప్పుడు తీసి పెంచుకోవచ్చుని.. !
4. మొదటి ఆఫీస్ ఒక గ్యారేజ్: గూగుల్ మొదటి ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్‌లో సూసన్ వోజిస్కీ కి (Susan Wojcicki) చెందిన ఓ అద్దె గ్యారేజ్.
5. ఆల్ఫాబెట్ (Alphabet Inc.): మొదట గూగుల్ పేరుతో మొదలైనా.. ఆ తర్వాత.. గూగుల్ అనుబంధ సంస్థలన్నీ ఆల్ఫాబెట్ అనే కొత్త మాతృ సంస్థ (Parent Company) కిందకు వచ్చాయి. 2015లో దీనిని స్థాపించారు
6.ఉద్యోగులు (Googlers & Nooglers): 2024 నాటికి, ఆల్ఫాబెట్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,80,000 మందికి పైగా పూర్తికాల ఉద్యోగులను (Full-time employees) కలిగి ఉంది. గూగుల్ ఉద్యోగులను 'Googler' అని, కొత్తగా గూగుల్లో చేరిన వారిని 'Nooglers' అని పిలుస్తారు. అన్ని గూగుల్ ఆఫీసుల్లో 5 స్టార్ రేంజ్ ఫుడ్ ఫ్రీ..!
7.టి-రెక్స్ Mascot: కాలిఫోర్నియాలోని గూగుల్ హెడ్క్వార్టర్ Google Plexలో "స్టాన్" (Stan) అనే పేరు గల ఒక పెద్ద టి-రెక్స్ అస్థిపంజరం ఉంది. కంపెనీ అంతరించిపోకుండా, నిరంతరం కొత్త ఆలోచనలతో ఉండాలని ఉద్యోగులకు గుర్తుచేయడానికి ఇది అక్కడ ఉంచారు
8.గూగుల్ Market Cap, Revenue: ఆల్ఫాబెట్ ఇంక్. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో ఒకటి.దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ $2 ట్రిలియన్ (రెండు లక్షల కోట్ల డాలర్లు, కోటీ అరవై లక్షల కోట్లు) ఉంటుంది.గూగుల్ కిందటి ఏడాది ఆదాయం 26లక్షల కోట్లు. ఆ కంపెనీ లాభం 6లక్షల కోట్లు..! కేవలం గుగూల్ లాభమే చాలా దేశాల జీడీపీ కంటే ఎక్కువ.
9.1 మిలియన్కు బేరం: ప్రారంభ రోజుల్లో, లారీ , సెర్గీ కంపెనీ మొత్తాన్ని ఎక్సైట్ (Excite) అనే సంస్థకు కేవలం $1 మిలియన్ కు అమ్మడానికి ప్రయత్నించారు, కానీ ఆ సంస్థ CEO నిరాకరించారు.
10. Google Storage Exabytes: Gmail, Drive, Photos, YouTube మొత్తం డేటా నిల్వ సామర్థ్యం పదుల ఎగ్జాబైట్స్ Exabytes లో ఉంటుంది. ఒక ఎగ్జాబైట్ అంటే సుమారు 100 కోట్ల GB
11. Google Data Centres: మన ఫోటోలు...YouTube వీడియోలు మొత్తం క్లౌడ్లో డేటా సెంటర్లలో సేవ్ అవుతాయి. గూగుల్కు ప్రపంచవ్యాప్తంగా చాలా డేటాసెంటర్లు ఉన్నాయి. కొన్ని సెంటర్లు కోటి చదరపు అడుగుల విస్తీర్ణంలో కూడా ఉన్నాయి. అంటే దాదాపు 230 ఎకరాలు
12. 15% New Searches: గూగుల్ లో ప్రతీరోజూ 850కోట్ల సెర్చ్లు జరుగుతాయి. అందులో 15శాతం కొత్త సెర్చ్లే. అంటే దాదాపు 120 కోట్ల కొత్త విషయాలను గూగుల్లో వెతుకుతుంటారు అన్నమాట
13. గూగుల్ మొదటి ట్వీట్: 2009లో గూగుల్ చేసిన మొట్టమొదటి ట్వీట్ "I'm feeling lucky".ఈ వాక్యాన్ని బైనరీ కోడ్‌లో రాసింది.
14. Googling: గూగుల్ చేయడం కూడా ఓ క్రియ. Google అనే పదాన్ని 2006లో అధికారికంగా మెరియం-వెబ్‌స్టర్, ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలలో ఒక క్రియ (Verb)గా చేర్చారు.
15. గూగుల్ విద్యుత్ వినియోగం: ఒకప్పుడు, ఒకే గూగుల్ సెర్చ్‌కు పట్టే కంప్యూటింగ్ శక్తి సుమారుగా అపోలో 11 వ్యోమగాములను చంద్రుడిపైకి పంపడానికి పట్టినంత శక్తికి సమానమని అంచనా వేశారు
16. GMAIL ఏప్రిల్ ఫూల్స్ డే: Gmail అనే ఉచిత ఇమెయిల్ సర్వీస్ ఏప్రిల్ 1, 2004న ప్రారంభించారు. దీంతో 1GB ఉచిత స్టోరేజ్ ఆఫర్‌ను చాలా మంది మొదట్లో ఏప్రిల్ ఫూల్స్ జోక్‌గా భావించారు.
17. డేటా సెంటర్లలో రోబోట్లు: గూగుల్ యొక్క కొన్ని డేటా సెంటర్‌లలో మానవుల కంటే **రోబోట్లు** ఎక్కువ పనిచేస్తాయి. విఫలమైన హార్డ్ డ్రైవ్‌లను (Failed Hard Drives) తీసివేయడం మరియు కొత్త వాటిని ఇన్స్టాల్ చేయడం వంటి పనులను ఇవి చేస్తాయి.
18. Google Secret Lab -(Google X): ఆల్ఫాబెట్‌లో X అనే పేరుతో ఒక రహస్య ప్రయోగశాల ఉంది. దీనిని మూన్‌షాట్ ఫ్యాక్టరీ (Moonshot Factory) అని కూడా అంటారు. ఇక్కడ కేవలం సెర్చ్ ఇంజన్‌కు సంబంధించినవి కాకుండా, మానవాళికి ఉపయోగపడే భవిష్యత్ టెక్నాలజీలపైన పరిశోధన చేస్తారు. వేమో (Waymo) సెల్ఫ్-డ్రైవింగ్ కార్లు, గూగుల్ గ్లాస్ (Google Glass),బెలూన్ల ద్వారా ఇంటర్నెట్ అందించే ప్రాజెక్ట్ లూన్ (Project Loon) ఇక్కడ నుంచే వచ్చాయి.
19. ఆండ్రాయిడ్ కొనుగోలు: ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ను (Android) గూగుల్ 2005లో $50 మిలియన్లకు కొనుగోలు చేసింది
20: Youtube కొనుగోలు: గూగుల్ 2006లో యూట్యూబ్‌ను $1.65 బిలియన్ల కు కొనుగోలు చేసింది, ఇది చరిత్రలో అత్యంత తెలివైన టెక్ కొనుగోళ్లలో ఒకటిగా చెబుతారు
21: మొదటి కార్పొరేట్ డాగ్: గూగుల్‌ప్లెక్స్‌లోని మొదటి అధికారిక కంపెనీ కుక్క ఒక రాట్‌వైలర్ (Rottweiler) దాని పేరు యోష్కా(Yoshka).
22: జెన్నిఫర్ లోపెజ్తో గూగుల్ ఇమేజ్ సెర్చ్: 2001లో గూగుల్ ఇమేజ్ సెర్చ్ ప్రారంభించడానికి కారణం... 2000 సంవత్సరంలో గ్రామీ అవార్డులకు జెన్నిఫర్ లోపెజ్ ధరించిన పచ్చటి వెర్సెస్ (Versace) గౌన్ చిత్రాల కోసం లక్షలాది మంది వెతకడం.
23. గూగుల్‌కు మీ అడ్రస్ తెలుసు: మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా గూగుల్కు తెలుస్తుంది. గూగుల్ స్ట్రీట్ వ్యూ 28 మిలియన్ మైళ్ల రహదారులను ఫోటోలు తీసింది.
24: గూగుల్లో మేకలు:మౌంటెన్ వ్యూలోని గూగుల్‌ప్లెక్స్ చుట్టూ ఉన్న గడ్డి, పొదలను కత్తిరించడానికి, శబ్దంతో కూడిన యంత్రాలకు బదులుగా గూగుల్ సుమారు 200 మేకల మందను అద్దెకు తీసుకుంటుంది
25: ఐ యామ్ ఫీలింగ్ లక్కీ: గూగుల్ సెర్చ్లో మొదట ఈ బటన్ ఉండేది.అప్పట్లో దాని మీద క్లిక్ చేస్తే...నేరుగా వెబ్సైట్ల వద్దకు తీసుకెళ్తుంది. దీనివల్ల గూగుల్ కోట్ల రూపాయల్లో ప్రకటనల ఆదాయం కోల్పోయినా కూడా యూజర్లకు ఆ థ్రిల్ ఉండాలన్న ఉద్దేశ్యంతో దానిని కొనసాగించింది.
26: సముద్రపు అడుగున కేబుల్స్: గూగుల్‌కు ప్రపంచంలోని అతిపెద్ద Undersea Internet Cable నెట్‌వర్క్ ఉంది. ఇది సెర్చ్ స్పీడ్‌ను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దాని స్వంత "కర్లీ" (Curie) అనే కేబుల్ అమెరికా నుండి చిలీ వరకు విస్తరించి ఉంది.
27. గూగుల్ Graveyard: గూగుల్ నిలిపివేసిన ఉత్పత్తులు సేవల (Google+, Google Reader వంటివి) సుదీర్ఘ జాబితాను ట్రాక్ చేసే వెబ్‌సైట్‌లు ఉన్నాయి, దీనికి "గూగుల్ గ్రేవియార్డ్" అని పేరు పెట్టారు





















