Jasprit Bumrah: పేస్ బౌలర్లకు బాధ్యతలు ఎందుకు అప్పగించకూడదు.. అవసరమైతే బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు

vఅన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న పేసర్ బుమ్రాను దక్షిణాఫ్రికాతో త్వరలో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) బాధ్యతలు అప్పగించింది.

FOLLOW US: 

టీమిండియా యువ పేస్ సంచలనం జస్ప్రిత్ బుమ్రాకు ఇటీవల ప్రమోషన్ లభించింది. అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న పేసర్ బుమ్రాను దక్షిణాఫ్రికాతో త్వరలో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) బాధ్యతలు అప్పగించింది. ఇతర క్రికెటర్లను పక్కనపెట్టి మరీ పేసర్‌కు కీలక బాధ్యతలు అప్పగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లాంటి ఐపీఎల్ కెప్టెన్సీ అనుభవం ఉన్న ఆటగాళ్లను పక్కన పెట్టి బుమ్రాకు వైస్ కెప్టెన్సీ ఇవ్వడానికి గల కారణాలను ఎమ్మెస్కే ప్రసాద్ వివరించారు. ‘ఇది చాలా సులువైన నిర్ణయం. 2016లో జస్ప్రిత్ బుమ్రా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటినుంచీ అతడు నిలకడగా రాణిస్తూ ప్రపంచంలోని మేటి బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. పలు సిరీస్‌లలో బౌలింగ్ విభాగానికి పెద్దగా వ్యవహరిస్తున్నాడు బుమ్రా. జట్టు కోసం శక్తి వంచన లేకుండా పోరాడుతున్న బుమ్రాకు తగిన గౌరవం ఇవ్వడం సరైన నిర్ణయం. పేసర్‌కు వైస్ కెప్టెన్సీ ఎందుకు ఇవ్వకూడదు. 

ఒకవేళ రాహుల్ తప్పుకోవడం గానీ, సిరీస్‌కు దూరం కావడంగానీ జరిగినట్లయితే బుమ్రా తాత్కాలికంగా ఈ వన్డే సిరీస్‌లో కెప్టెన్సీ చేసే అవకాశం లేకపోలేదు. అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న బుమ్రా లాంటి పేస్ బౌలర్‌కు కెప్టెన్ గా సైతం అవకాశం ఇవ్వడంలో తప్పులేదు. జస్ప్రిత్ బుమ్రా ఏం ఆశిస్తున్నాడో ఎవరికీ తెలియదు. రాహుల్, రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే పేసర్‌కు సిరీస్ మొత్తం సారథ్య బాధ్యతలు అప్పగించడం సబబేనని’ ఎమ్మెస్కే ప్రసాద్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 

మాజీ ఆల్ రౌండర్ రీతిందర్ సింగ్ సైతం బుమ్రాకు వెస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై హర్షం వ్యక్తం చేశాడు. అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణించే ఇలాంటి పేసర్‌ కెప్టెన్సీకి కూడా సరిపోతాడు. అయితే పేసర్లు కెప్టెన్సీ చేయలేరనే అపోహలు కూడా ఉన్నాయి. వీటిని పటాపంచలు చేయాలంటే ఇలాంటి కీలక నిర్ణయాలకు సైతం స్వాగతం పలకాల్సిన అవసరం ఉందన్నారు. టెస్ట్ సిరీస్ అనంతరం టీమిండియా, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ మొదలవుతుంది.

Also Read: Sankranti Special Trains: సంక్రాంతికి మరో 10 ప్రత్యేక రైళ్లు ... దక్షిణ మధ్య రైల్వే ప్రకటన  
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి! 
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 02 Jan 2022 12:05 PM (IST) Tags: Team India BCCI sports news Latest News Jasprit Bumrah ICC World Test Championship Ind vs SA India vs South Africa Bumrah Vice Captain For South Africa ODI Series

సంబంధిత కథనాలు

Rohit Sharma: ఇంగ్లాండ్‌తో తొలి టీ20కి ముందు రోహిత్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌!!

Rohit Sharma: ఇంగ్లాండ్‌తో తొలి టీ20కి ముందు రోహిత్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌!!

IND vs ENG 1st T20: అసలే బట్లర్‌ ఆపై కెప్టెన్‌ అయ్యాడు! హిట్‌మ్యాన్‌ ఆపగలడా?

IND vs ENG 1st T20: అసలే బట్లర్‌ ఆపై కెప్టెన్‌ అయ్యాడు! హిట్‌మ్యాన్‌ ఆపగలడా?

Asus ROG Phone 6 Pro: దేశంలోనే బెస్ట్ గేమింగ్ ఫోన్ - ల్యాప్‌టాప్‌ను మించే ఫీచర్లు!

Asus ROG Phone 6 Pro: దేశంలోనే బెస్ట్ గేమింగ్ ఫోన్ - ల్యాప్‌టాప్‌ను మించే ఫీచర్లు!

Ind vs Eng 1st T20 Live Streaming: జియో టీవీలో ఫ్రీ! తొలి టీ20 లైవ్‌ స్ట్రీమింగ్‌, మ్యాచ్‌ టైమ్‌, మిగతా వివరాలేంటి?

Ind vs Eng 1st T20 Live Streaming: జియో టీవీలో ఫ్రీ! తొలి టీ20 లైవ్‌ స్ట్రీమింగ్‌, మ్యాచ్‌ టైమ్‌, మిగతా వివరాలేంటి?

Happy Birthday MS Dhoni: తుఫాన్ ఎదురొచ్చినా తలొంచని తత్వం - మహేంద్రుడి సొంతం!

Happy Birthday MS Dhoni: తుఫాన్ ఎదురొచ్చినా తలొంచని తత్వం - మహేంద్రుడి సొంతం!

టాప్ స్టోరీస్

2024 Elections India: రాజ్యసభ నామినేషన్లు, సౌత్ ఇండియా మిషన్‌లో భాగమేనా? భాజపా స్ట్రాటెజీలు రెడీ!

2024 Elections India: రాజ్యసభ నామినేషన్లు, సౌత్ ఇండియా మిషన్‌లో భాగమేనా? భాజపా స్ట్రాటెజీలు రెడీ!

YSRCP Permanent President : వైఎస్ఆర్‌సీపీ శాశ్వత అధ్యక్షుడిగా సీఎం జగన్ ! ఎందుకంటే ?

YSRCP Permanent President :  వైఎస్ఆర్‌సీపీ శాశ్వత అధ్యక్షుడిగా సీఎం జగన్ ! ఎందుకంటే ?

UK Prime Minister Resignation: బ్రేకింగ్ న్యూస్- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా!

UK Prime Minister Resignation: బ్రేకింగ్ న్యూస్- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా!

Why Nagababu Target Modi : మోదీపైనా నాగబాబు సెటైర్లు ! జనసేన డైరక్ట్‌గానే చెబుతోందా ?

Why Nagababu Target Modi : మోదీపైనా నాగబాబు సెటైర్లు ! జనసేన డైరక్ట్‌గానే చెబుతోందా ?