అన్వేషించండి

Hockey, India Enters Semi-Final: సెమీస్‌కి భార‌త మ‌హిళ‌ల హాకీ జ‌ట్టు.. ఆస్ట్రేలియాకు షాక్‌... ఒలింపిక్స్‌ చరిత్రలో తొలిసారి సెమీస్‌కు

టోక్యో ఒలింపిక్స్‌ ( Tokyo Olympics 2020)లో భార‌త మ‌హిళ‌ల హాకీ ( Indian Women Hockey) జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది.

టోక్యో ఒలింపిక్స్‌ ( Tokyo Olympics)లో భార‌త మ‌హిళ‌ల హాకీ ( Indian Women Hockey) జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. పోటీల్లో భాగంగా సోమవారం ఉదయం భారత్... డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో 1-0 గోల్స్ తేడాతో గెలిచిన ఇండియా సెమీస్‌లోకి ప్ర‌వేశించింది. సెమీస్‌లో టీమిండియా... అర్జెంటీనాతో త‌ల‌ప‌డ‌నుంది. ఆట రెండ‌వ అర్ధభాగంలో గుర్జిత్ కౌర్ ( Gurjit Kaur) అద్భుత‌మైన గోల్ చేసింది. అయితే ఆట మొత్తం లీడింగ్‌లో ఉన్న ఇండియా ఏకంగా డిఫెండింగ్ ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. భార‌త మ‌హిళల హాకీ జ‌ట్టు ఒలింపిక్స్‌ చరిత్రలో సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి.

రాణి రాంపాల్ నేతృత్వంలోని భార‌త జ‌ట్టు.. గ్రూప్ బీలో టాప్‌లో నిలిచిన ఆస్ట్రేలియాను అనూహ్య రీతిలో ఓడించింది. 22వ నిమిషంలో గుర్జిత్ కౌర్ భార‌త్ త‌ర‌పున ఏకైక గోల్ చేసింది. ఆస్ట్రేలియా జోరుకు భార‌త మ‌హిళ‌లు ఏమాత్రం బెద‌ర‌లేదు. ప్ర‌త్య‌ర్థుల్ని డిఫెన్స్‌లో ప‌డేశారు. దీంతో ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెరిగింది. అడ‌పాద‌డ‌పా ఆసీస్ దూకుడు ప్ర‌ద‌ర్శించినా.. భార‌త జ‌ట్టు ధీటుగా ఎదుర్కొంది. గుర్జీత్ డ్రాగ్ ఫ్లిక్ షాట్‌తో చేసిన గోల్ ఇండియాకు బాగా క‌లిసి వ‌చ్చింది.

ఆస్ట్రేలియాకి ఈ మ్యాచ్‌లో అనేకసార్లు పెనాల్టీ కార్నర్లు కొట్టే అవకాశం దక్కింది. కానీ, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో డిఫెండింగ్ ఛాంపియన్ విఫలమైంది. స‌ర్కిల్‌లో చుట్టుముట్టిన ఆసీస్ క్రీడాకారిణులు గోల్ పోస్టుపై ఇండియా క‌న్నా ఎక్కువ షాట్స్ ఆడారు. కానీ భార‌త మ‌హిళ‌లు మాత్రం ఆసీస్‌కు ఎక్క‌డా త‌లొగ్గ‌లేదు. మూడో క్వార్ట‌ర్స్‌లో ఆసీస్ జోరు పెంచినా.. రాణి రాంపాల్ బృందం ధైర్యంగా వారిని అడ్డుకున్న‌ది. రియో ఒలింపిక్స్‌లో ఇదే ఆస్ట్రేలియా జ‌ట్టు చేతిలో 6-1తో ఓడి సెమీస్ ఆశ‌లు చేజార్చుకున్న భార‌త జ‌ట్టు ఈసారి ఫ‌లితాన్ని తిర‌గ‌రాయ‌డం అద్భుతం. దీంతో భారత జట్టు ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకున్నట్లైంది.

Also Read: PV Sindhu Wins Bronze Medal: సాహో ‘కాంస్య’ సింధు... వరుసగా రెండుసార్లు ఒలింపిక్ పతకాలు..

ఈ సారి మ‌హిళ‌ల జ‌ట్టు నాకౌట్ ద‌శ‌లోకి ప్ర‌వేశించి చ‌రిత్ర సృష్టించింది. పూల్ ఏలో ఇండియా జ‌ట్టు నాలుగ‌వ స్థానంలో నిలిచింది. గ్రూపు స్టేజ్‌లో రెండు విజ‌యాలు, మూడు ప‌రాజ‌యాల‌ను న‌మోదు చేసింది. అయితే ఇవాళ జ‌రిగిన మ్యాచ్‌లో నిజానికి ఆస్ట్రేలియానే ఫెవ‌రేట్‌. వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ టూ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను ఇండియా మ‌ట్టిక‌రిపించిన తీరు ప్ర‌శంస‌నీయం. మహిళల హాకీలో నెద‌ర్లాండ్స్ ఫ‌స్ట్ ర్యాంక్‌లో ఉంది.

ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో బోలెడ‌న్ని పెనాల్టీ కార్న‌ర్లు తీసుకున్న‌ది. గోల్ పోస్టుపై ఇండియా క‌న్నా ఎక్కువ దాడులు చేసినా సఫలం కాలేకపోయింది. మరోవైపు భారత మహిళలు గత ఒలింపిక్స్ ఓటమికి ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకున్నారు. చివర్లో ఆసీస్ క్రీడాకారిణులు గోల్ పోస్ట్‌ వద్ద ఒత్తిడి తీసుకొచ్చి టీమిండియాను అడ్డుకోవాలని ప్రయత్నించారు. ఏ దశలోనూ టీమిండియా వెనక్కి తగ్గకుండా ఒత్తిడిని జయిస్తూ ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీఫైనల్లోకి ప్రవేశించి సరికొత్త చరిత్ర లిఖించారు.

Also Read: Tokyo Olympics Boxer Protest: రిఫరీపై కోపం... రింగ్ పై కూర్చొని బాక్సర్ నిరసన. టోక్సో ఒలింపిక్స్ లో షాకింగ్ సంఘటన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP EXclusive:  26/11 ముంబై దాడుల తర్వాత పాకిస్తాన్ పై ఎదురుదాడి చేయాలనుకున్నాం.. కానీ బయట శక్తుల ప్రభావం వల్ల....
ABP EXclusive: 26/11 ముంబై దాడుల తర్వాత పాకిస్తాన్ పై ఎదురుదాడి చేయాలనుకున్నాం.. కానీ ఎందుకు చేయలేదంటే...!
TVK Karur Stampede: కరూర్‌లో విజయ్ ర్యాలీలో పవర్ కట్ చేయాలని టీవీకేనే లేఖ రాసింది- ఊహించని ట్విస్ట్
కరూర్‌లో విజయ్ ర్యాలీలో పవర్ కట్ చేయాలని టీవీకేనే లేఖ రాసింది- ఊహించని ట్విస్ట్
YSRCP Digital Book: విడదల రజినిపై వైసీపీ డిజిటల్‌ బుక్‌లో ఫిర్యాదు, జగన్ చర్యలు తీసుకోవాలని కోరిన బాధితుడు
విడదల రజినిపై వైసీపీ డిజిటల్‌ బుక్‌లో ఫిర్యాదు, జగన్ చర్యలు తీసుకుంటారా?
Sobhita Dhulipala : పెళ్లి తర్వాత హీరోయిన్‌గా శోభిత దూళిపాళ ఫస్ట్ మూవీ - తమిళ స్టార్ డైరెక్టర్‌ పా రంజిత్ 'వేట్టువం'లో డిఫరెంట్‌గా...
పెళ్లి తర్వాత హీరోయిన్‌గా శోభిత దూళిపాళ ఫస్ట్ మూవీ - తమిళ స్టార్ డైరెక్టర్‌ పా రంజిత్ 'వేట్టువం'లో డిఫరెంట్‌గా...
Advertisement

వీడియోలు

Tilak Varma Innings Asia Cup Final | తెలుగోడి పొగరు చూపించిన తిలక్
Team India Match Fess to India Army | Asia Cup 2025 | మ్యాచ్ ఫీజులు ఆర్మీ కి ఇచ్చిన SKY
Bumrah Fighter Jet Celebrations Asia Cup Final | హారిస్ రౌఫ్‌‌కు బుమ్రా కౌంటర్
Team India Rejected Asia Cup | ఆసియా కప్ ను నిరాకరించిన టీమ్ ఇండియా
PM Modi Tweet Asia Cup Final | ఆసియా కప్ గెలవడంపై ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP EXclusive:  26/11 ముంబై దాడుల తర్వాత పాకిస్తాన్ పై ఎదురుదాడి చేయాలనుకున్నాం.. కానీ బయట శక్తుల ప్రభావం వల్ల....
ABP EXclusive: 26/11 ముంబై దాడుల తర్వాత పాకిస్తాన్ పై ఎదురుదాడి చేయాలనుకున్నాం.. కానీ ఎందుకు చేయలేదంటే...!
TVK Karur Stampede: కరూర్‌లో విజయ్ ర్యాలీలో పవర్ కట్ చేయాలని టీవీకేనే లేఖ రాసింది- ఊహించని ట్విస్ట్
కరూర్‌లో విజయ్ ర్యాలీలో పవర్ కట్ చేయాలని టీవీకేనే లేఖ రాసింది- ఊహించని ట్విస్ట్
YSRCP Digital Book: విడదల రజినిపై వైసీపీ డిజిటల్‌ బుక్‌లో ఫిర్యాదు, జగన్ చర్యలు తీసుకోవాలని కోరిన బాధితుడు
విడదల రజినిపై వైసీపీ డిజిటల్‌ బుక్‌లో ఫిర్యాదు, జగన్ చర్యలు తీసుకుంటారా?
Sobhita Dhulipala : పెళ్లి తర్వాత హీరోయిన్‌గా శోభిత దూళిపాళ ఫస్ట్ మూవీ - తమిళ స్టార్ డైరెక్టర్‌ పా రంజిత్ 'వేట్టువం'లో డిఫరెంట్‌గా...
పెళ్లి తర్వాత హీరోయిన్‌గా శోభిత దూళిపాళ ఫస్ట్ మూవీ - తమిళ స్టార్ డైరెక్టర్‌ పా రంజిత్ 'వేట్టువం'లో డిఫరెంట్‌గా...
Committee On Tollywood Artists: సినీ కార్మికుల సమస్యలపై కమిటీ నియమించిన తెలంగాణ ప్రభుత్వం- చైర్మన్, సభ్యులు వీరే
సినీ కార్మికుల సమస్యలపై కమిటీ నియమించిన తెలంగాణ ప్రభుత్వం- చైర్మన్, సభ్యులు వీరే
Allu Arjun Atlee Movie Update: అల్లు అర్జున్, అట్లీతో జపనీస్ కొరియోగ్రాఫర్ - హుక్ స్టెప్ కన్ఫర్మ్?... సైన్స్ ఫిక్షన్ మూవీపై బిగ్ అప్డేట్
అల్లు అర్జున్, అట్లీతో జపనీస్ కొరియోగ్రాఫర్ - హుక్ స్టెప్ కన్ఫర్మ్?... సైన్స్ ఫిక్షన్ మూవీపై బిగ్ అప్డేట్
BJP Vishnu: త్వరలో నక్సల్ రహిత భారత్ -  “భారత్ మంథన్”లో బీజేపీ అగ్రనేతల నమ్మకం
త్వరలో నక్సల్ రహిత భారత్ - “భారత్ మంథన్”లో బీజేపీ అగ్రనేతల నమ్మకం
World Highest Bridge:ప్రపంచంలో ఎత్తైన వంతెనను మూడేళ్లలో నిర్మించిన చైనా - 2గంటల ప్రయాణం 2 నిమిషాల్లో పూర్తి !
ప్రపంచంలో ఎత్తైన వంతెనను మూడేళ్లలో నిర్మించిన చైనా - 2గంటల ప్రయాణం 2 నిమిషాల్లో పూర్తి !
Embed widget