BJP Vishnu: త్వరలో నక్సల్ రహిత భారత్ - “భారత్ మంథన్”లో బీజేపీ అగ్రనేతల నమ్మకం
Naxalism will end: నక్సలిజం భారత్ లో అంతమవుతుందని బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో అమిత్ షా ముఖ్య అతిధిగా పాల్గొన్న భారత్ మంథన్‌లోఆయన ప్రసంగించారు.

Naxalism will end in India: నక్సలిజాన్ని వచ్చే ఏడాది మార్చి 31లోపు నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. “నక్సల్-రహిత భారతదేశం” అనే అంశంపై ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన “భారత్ మంథన్” కార్యక్రమం జరిగింది. ఇందులో హోంమంత్రి అమిత్ షాతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. మావోయిస్టు హింస ప్రభావిత ప్రాంతాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని అధిగమించడానికి అవసరమైనవ్యూహాలపై వివరణాత్మక అభిప్రాయాలను పంచుకున్నారు. మావోయిస్టు ఉగ్రవాదంపై విజయం కేవలం భద్రతా దళాల ఫలితం మాత్రమే కాదు, సమాజం సమిష్టి అవగాహన, అభివృద్ధి , ప్రజాస్వామ్య సాధికారత ఫలితమని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. పారామిలిటరీ దళాలు , పోలీసుల భాగస్వామ్యం, కఠినమైన చర్యల కారణంగా, నక్సలిజం నే ఉనికి చివరి దశలో ఉందన్నారు.
ఈ రోజు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన “భారత్ మంథన్” కార్యక్రమంలో నేను పాల్గొని, “నక్సల్-రహిత భారతదేశం” అనే అంశంపై నా ఆలోచనలను పంచుకున్నాను.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) September 28, 2025
కేంద్ర గృహ మంత్రివర్యులు అమిత్ షా గారు ప్రత్యేక అతిథిగా హాజరై, వామపక్ష… pic.twitter.com/SFMXs69sR5
భారత్ మంథన్‌లో ప్రసంగించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మావోయిస్టులతో ఎలాంటి శాంతి ఒప్పందం ఉండబోదని, ఆయుధాలు వదులుకుని లొంగిపోతే వారికి పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేశారు. అమిత్ షా, ఇటీవల చత్తీస్‌గఢ్‌లో విడుదలైన ఒక లేఖను ఉద్దేశిస్తూ, మావోయిస్టులు లొంగిపోతామని చెప్పడం గందరగోళం సృష్టించే ప్రయత్నమని విమర్శించారు. "శాంతి ఒప్పందం ఉండదు. ఆయుధాలు వదులుకోండి, లొంగిపోండి, పునరావాసం కల్పిస్తాం" అని ఆయన స్పష్టం చేశారు. ఈ
అభివృద్ధి లేకపోవడమే నక్సలిజం పెరగడానికి కారణమనే వాదనను "తప్పుదారి పట్టించే" ప్రచారంగా షా తోసిపుచ్చారు. "స్వాతంత్ర్యం వచ్చినప్పుడు వనరులు పరిమితంగా ఉన్నాయి, అన్ని ప్రాంతాలు ఒకేసారి అభివృద్ధి చెందలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా వంటి ప్రాంతాల్లో అభివృద్ధిని అడ్డుకున్నది ఎవరు?" అని ఆయన ఎడతెగని మావోయిస్ట్ మద్దతుదారులను ప్రశ్నించారు. ఆయన కొలంబియా, పెరూ, కంబోడియా ఉదాహరణలను ప్రస్తావిస్తూ, వామపక్ష భావజాలం మరియు హింస ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయన్నారు.
2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, నక్సలిజంపై "ఏకీకృత , కఠిన" విధానాన్ని అనుసరించినట్టు షా తెలిపారు. గత ప్రభుత్వాల "విచ్ఛిన్న" విధానాలకు భిన్నంగా, ఈ వ్యూహం హింసకు వ్యతిరేకంగా కఠిన చర్యలు, లొంగిపోయినవారికి పునరావాసం, మరియు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిని కలిపి చేసింది. "మేం రక్తపాతం కోరుకోం. కానీ అమాయక ఆదివాసీలను చంపాలనుకుంటే, వారిని రక్షించడం మా ధర్మం" అని ఆయన అన్నారు.





















